-13 మంది వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం
– పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు
కర్ణాటకలో చిక్ బళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వలస కూలీలు 13 మంది మృతి చెందడం బాధాకరం. ఇవి జగన్ రెడ్డి ప్రభుత్వ హత్యలు. చనిపోయిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా జగన్ రెడ్డి ఛోద్యం చూస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఒక్క ఎకరాకు నీరందించలేదు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దోచుకోవడం తప్పా వాటిని పూర్తి చేసి పంటలకు నీరందించాలన్న ద్యాస జగన్ రెడ్డిలో లేదు.
సాగుకే కాదు కనీసం తాగటానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి. జీవనాడి పోలవరాన్ని సర్వనాశనం చేసి నదుల అనుసంధానానికి గండి కొట్టి రాయలసీమలో వ్యవసాయాన్ని ప్రశ్నార్ధకం చేశారు. సాగునీటికి ఇబ్బందులు పడుతున్న రైతులు ప్రభుత్వ ఆదరణ లేదు, రాయితీలు అందండం లేదు, ఉద్యానపంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు వైసీపీ నాయకులు తరిమేస్తున్నారు. పారిశ్రామికీకరణ జరగడం లేదు. జాబ్ క్యాలెండర్ హామీని తుంగలో తొక్కారు.రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, ఉపాధి దొరకక, గత్యంతరం లేక నిరుద్యోగులు, కూలీలు ఇతర రాష్ట్రాలకు పొట్ట కూటి కోసం వలస వెళ్లి జీవనోపాధిని పొందుతున్నారు.