-ద్వారంపూడి దన్నుతో ఆలీషా వేల కోట్ల వ్యాపారం
-ద్వారంపూడి అవినీతితో పోర్టు కార్మికుల జీవితాలు చీకటి మయం
-కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
కాకినాడ: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దురాగతంతో కాకినాడ పోర్టు గుడ్ విల్ దెబ్బ తినడమే కాకుండా పోర్టుపై ఆధారపడి జీవిస్తున్న 20 వేల మంది పోర్టు కార్మికుల జీవితాలు చీకటి మయంలో పడిందని, భార్జీ ఓనర్లు, చాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారులు దారుణంగా నష్టపోయే పరిస్థితి కాకినాడ పోర్టులో నెలకొందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. గురువారం కొండబాబు ఛాంబర్ ప్రతినిధులు బార్జ్ ఓనర్స్ తో కలిసి పోర్టు ప్రాంతాన్ని సందర్సించారు.
ఈ సందర్భంగా కొండబాబు మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి స్వార్ధ ప్రయోజనం కోసం అక్రమ వ్యాపారాల కోసం కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకుని దోచుకోవడం జరిగిందని, వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ద్వారంపూడి చేసిన అక్రమాల ఫలితంగా కాకినాడ పోర్ట్ కి భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
పోర్టులు అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తే, వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత కాకినాడ పోర్టు భూములను తాకట్టు పెట్టి వచ్చిన సొమ్ములు వాటాల రూపంలో పంచుకున్నారని, ద్వారంపూడి అనుచరుడు షాన్ మేరైన్ అధినేత అలీషా 3100 స్కర్ యార్డ్ భూమిని లీజ్ కు తీసుకుని, సుమారు 6000 వేల స్కెర్ యార్డు భూమిని ఆక్రమించుకుని అక్రమ వ్యాపారం చేస్తున్నా అధికార యంత్రాంగం నిద్రలో నటించిందని తెలిపారు.
కేవలం ద్వారంపూడి అండ చూసుకుని పోర్టులో అన్యాయం, అక్రమాలు హద్దు మీరిపోయాయాని అన్నారు. వాటాల పంపకాల కోసం ఒక పనిని రెండుసార్లు ప్రారంభోత్సవాలు చేసి డ్రెజ్జింగ్ పేరుతో కోట్లు నొక్కేసి అరకోరగా పూర్తి చేసినా పోర్టు అధికారి నోరు మెదపక పోవడం వెనుక ద్వారంపూడి హస్తం ఉందని తెలిపారు.
తీరా డ్రెడ్జింగ్ పూర్తి చేసి నాలుగు నెలలు కాకపోయినా సముద్రంలో ఇసుకమేటలు తగిలి భార్జిల కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. తక్షణమే కాకినాడ పోర్టులో జరుగుతున్న చట్ట వ్యతిరేక పనులపై పోర్టు అధికారి జోక్యం చేసుకుని, ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో మొత్తం లీజు వసూలు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు IPL బాబు, డాక్టర్ రామ్మూర్తి, పెనుపోతు సూర్యారావు, సంఘాన్ని సత్తిబాబు, మడ్డు విజయ్, కర్రీ భద్రరావు, మల్లిపూడి వీరు, తుమ్మల రమేష్ తదితరులు ఉన్నారు.