చికెన్ షాపు అడ్రస్ తో 16 మందికి ఓటు హక్కు కల్పించారంటే ఏమనాలి?
ఆ చికెన్ షాపు ముస్లిం సోదరుడిది – ఓకే గది – అందులో హిందూ, ముస్లిం, క్రైస్తవ మతస్తులున్నారు
తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి డేటా ఎంట్రీ పొరపాటు తప్ప దొంగ ఓట్లు కాదని చెప్పడం దుర్మార్గం, కలెక్టర్ గా ఆయనకు తగని పని
పాలకుల అక్రమాలకు ప్రభుత్వ అధికారులే సహకరిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడేదెవరు?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
వైసీపీ పాలనలో ఎన్నికల ప్రక్రియ దొంగాటలా ఉంది తప్ప ఎన్నికలా లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ద్వజమెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లపై సచివాలయంలో ఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ….. జగన్ పాలనలో ఎన్నిక ప్రక్రియ అభాసుపాలవుతోంది. 7 వతరగతి చదవని వారు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎలా అవుతారు? తిరుపతిలో ఒక చికెన్ షాపు అడ్రస్ తో 16 మందికి ఓటు హక్కు కల్పించారు, ఆ 16 మందిలో హిందూ, ముస్లిం, క్రిష్టియన్ మతాలకు చెందిన ఓటర్లంతా ఆ చిన్న గదిలో ఉన్నారని చెప్పటం అధికారులు దొంగ ఓట్లకు “ సై” అన్నట్టు నిదర్శనం. డేటా ఎంట్రీలో పొరపాటు వల్లే చికెన్ షాపు అడ్రస్ తో ఓట్లు కల్పించామని తిరుపతి కలెక్టర్ వెంకట రమణారెడ్డి చెప్పటం కలెక్టర్ గా ఆయనకు తగని పని, ఇది సిగ్గుచేటు.
ఆ కలెక్టర్ మీద ఎన్నికల కమిషన్ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ఓటర్ లిస్టులో 30 శాతం బోగస్ ఓట్లే ఉన్నట్టుగా కన్పిస్తోంది. విశాఖపట్నంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్ది ఓటర్లకు వెండి బిస్కెట్లు పంచటంపై టీడీపీ, కమ్యూనిస్టు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. పోలీసులు వైసీపీ నాయకులతో కమ్మక్కయి వైసీపీ అభ్యర్ధి వెండి బిస్కట్లు అక్కడ నుంచి వేరే చోటికి తరలించాక పోలీసులు తాపీగా వెళ్లారు.
తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డి లాంటి వాళ్లు, ఇలాంటి పోలీసులుంటే దొంగ ఓట్లు, అక్రమాలతో జగన్ ఏ ఎన్నికలైనా గెలవగలరు. దొంగ ఓట్లతో గెలవడానికి ఇక ఈసీ ఎందుకు, ఎన్నికలెందుకు? ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య అన్నారు. ఫిర్యాదుతో పాటు తిరుపతిలో చికెన్ షాపు దగ్గర విచారించిన వీడియో జత చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరి అఖిల్, టీడీపీ హెచ్ ఆర్డీ మెంబర్ ఎస్పీ సాహెబ్, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు కొదమల సురేష్, మేకల అనిల్ , కట్టెపోగు వెంకయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.