– టీ షాప్ నిర్వాహకులతో యువనేత మాటామంతీ!
గన్నవరం నియోజకవర్గం పాదయాత్ర చేస్తున్న యువనేత లోకేష్ తేలప్రోలులో జాతీయ రహదారి పక్కన ఓ టీకొట్టులో టీతాగి షాపు నిర్వాహకులతో ముచ్చటించారు.
• ఈ సందర్భంగా టీ షాపు నిర్వాహకులు ధనరాజు, నాగమణితో మాట్లాడుతూ… పెరిగిన గ్యాస్, ముడిసరుకుల ధరలతో వ్యాపారం లాభసాటిగా లేదు.
• పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలతో బతుకుబండి లాగడం భారంగా ఉంది.
• భార్యాభర్తలం రోజంతా కష్టపడినా కుటుంబాన్ని నడపడం కష్టంగా మారింది.
• ధరలను అదుపుచేస్తే మాలాంటి వారికి ఉపశమనంగా ఉంటుందని ధనరాజు, నాగమణి చెప్పారు.
యువనేత లోకేష్ మాట్లాడుతూ…
• జగనాసురుడి పాలనలో సామాన్య ప్రజలు కడుపునిండా భోజనం, కంటినిండా నిద్రపోయే పరిస్థితులు లేవు.
• నాలుగేళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు, 3సార్లు ఆర్టీసి చార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచాడు.
• దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎపిలో మాత్రమే ఉన్నాయి.
• పేదల కష్టం తెలుసుకున్నాకే చంద్రబాబునాయుడు ప్రతిఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.
• మహాశక్తిలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల రూ.1500 రూపాయలు ఉచితంగా ఇవ్వబోతున్నారు.
• రాబోయే చంద్రన్న ప్రభుత్వం ధరలను అదుపుచేసి అన్నివర్గాల ప్రజలకు అండగా నిలుస్తుంది.
నారా లోకేష్ ను కలిసిన ఎన్.అప్పారావుపేట గ్రామస్తులు
గన్నవరం నియోజకవర్గం పొట్టిపాడులో నారయ్య అప్పారావుపేట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు లేవు. డ్రైనేజీ నీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తోంది.
• వర్షాలు పడితే మా గ్రామంలో టూ వీలర్స్ తిరిగే పరిస్థితి లేదు.
• గ్రామంలో రోడ్లు సరిగా లేక స్కూల్ బస్సులు కూడా రావడం లేదు.
• త్రాగునీటి కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉంది. .
• మా గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యల్ని పరిష్కరించండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు.
• కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.9వేలకోట్లను జగన్ ప్రభుత్వం దొంగిలించింది.
• జల్ జీవన్ మిషన్ పథకం నిధులను కేంద్రం ఇస్తే వాడుకోలేని దివాలాకోరు ప్రభుత్వమిది.
• టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేశాం.
• అధికారంలోకి వచ్చాక గ్రామసీమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలికసదుపాయాలు కల్పిస్తాం.
• వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేసి, 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.