-
బాధితుల సహాయార్థం ఎమ్మెల్యేకు రూ.60వేల చెక్కును అందించిన డ్వాక్రా మహిళలు
-
దేశంలో ఏ నాయకుడు చంద్రబాబు మాదిరిగా విపత్తుల సమయంలో ఇలా స్పందించిన దాఖలాలు లేవు
-
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామ డ్వాక్రా సంఘాల మహిళలు సేకరించిన మొత్తాన్ని గురువారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ముప్పాళ్ళ గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలు వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ చేశారన్నారు. వారు సేకరించిన మొత్తం రూ.60వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి చెక్ రూపములో అందజేశారు. సామాజిక దృక్పథం కలిగిన మహిళలను ఎంఎల్‌ఏ తంగిరాల సౌమ్య అభినందించారు.
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, విపత్తు సమయంలో ఏడుపదుల వయస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన చొరవ, సమయస్ఫూర్తి అద్భుతమని ప్రశంసించారు. కలెక్టరేట్‌లో 9 రోజులపాటు బస్సులోనే ఉంటూ అధికారులను చంద్రబాబు పరుగులు పెట్టించారని అన్నారు. వరదలో చిక్కుకుపోయిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపన్నహస్తం అందించారని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, పాలన దక్షత వరద బాధితులను విపత్తు నుంచి గట్టెక్కించిందని చెప్పారు. తాను ఎప్పుడు ఇలాంటి విపత్తు చూడలేదన్నారు. దేశంలో ఏ నాయకుడు చంద్రబాబు మాదిరిగా విపత్తుల సమయంలో ఇలా స్పందించిన దాఖలాలు లేవని తంగిరాల సౌమ్య అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ, మండల పార్టీల కూటమి నేతలు పాల్గొన్నారు.