ఎక్కడ ఉన్నా తనదైన పరిపాలనా శైలితో ఆ శాఖపై తన ముద్ర వేసే సీనియర్ ఐపిఎస్ ద్వారకా తిరుమలరావు.. ఇప్పుడు తాను ఎండీగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీలోనూ తన ముద్ర వేస్తున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా తనదైన ముద్ర వేసిన ద్వారకా.. ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీలోనూ కొత్త సంస్కరణలకు తెరలేపారు. ఆర్టీసీ సొంతగా బస్సులు కొనడంతోపాటు, ఉన్న బస్సులలో కొన్నింటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చే ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సొంత బస్సులు కొనుగోలు చేయడం వల్ల.. ఇకపై ప్రైవేటు అద్దె బస్సులపై ఆధారపడే అవసరం ఉండదు. ఇక ఇంధన ఆదా మార్గంలో ఎలక్ట్రికల్ బస్సుల ప్రయోగం కూడా, ఆర్టీసీపై పెను భారం తగ్గించేదే. ఇవన్నీ ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో మర్చిపోలేని మైలురాళ్లు. ఈ వివరాలను ఆయనే వెల్లడించారు.
ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఏమన్నారంటే…
ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రలో కీలక అడుగులు
భారీగా సొంత బస్సులు కొనుగోలుకు నిర్ణయం
2736 కొత్త బస్సులు కొనుగోలుకు సీఎం వైయస్ జగన్ గ్రీన్‌సిగ్నల్
రూ.572 కోట్ల అంచనాతో 1500 కొత్త డీజిల్ బస్సులు
జీసీసీ మోడల్లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు
200 డీజిల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్పు
కర్ణాటక తరహాలో 15 మీటర్ల అంబానీ బస్సులు
తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో త్వరలోనే ఒప్పందాలు