Suryaa.co.in

Andhra Pradesh

తెలుగుదేశం ప్రభుత్వంలోనే మహిళల ఆర్థికాభివృద్ధి

– బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ

బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా నేడు బాపట్ల పట్టణం లోని వెంగళ విహార్, బాపట్ల మండలం స్టువర్ట్ పురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు.

అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో స్వర్ణ యుగం రావాలంటే తెలుగుదేశంపార్టీతోనే సాధ్యం మన్నారు. మిమ్మల్ని నా తోబుట్టువుగా భావించి ఇలా పసుపు కుంకుమ ఇచ్చి మీ ఆశీస్సులు కోసం వచ్చాను.. నన్ను ఆశీర్వదించి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

తెలుగుదేశం ప్రభుత్వం లో మహిళల ఆర్థికాభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు, డ్వాక్రా రుణాలు అమలు చేశారు. రేపు తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా శక్తి తో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతారు. సంక్షోభం లో కూరుకుపోయిన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత, విజన్ నేడు చాలా అవసరం.. మరలా ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది.

ఈ వైసీపీ ప్రభుత్వం లో కరెంట్ చార్జీలు, చెత్త పన్ను వేయడంతో పాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నిఅంటాయి.ఓటు తోనే వారికి తగిన బుద్ధి చెప్పాలి.వచ్చే ఎన్నికల్లో ప్రజల సంపూర్ణ మద్దతుతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం. ఈ అరాచక వైసీపీ ప్రభుత్వం నిలిపేసిన అన్న క్యాంటీన్ లను, సంక్షేమ పథకాలు అన్నింటినీ తిరిగి అందిస్తామని ప్రజలకు భరోసా ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బాపట్ల పట్టణంను అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదని నరేంద్ర వర్మ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE