కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎకనామిక్ సర్వే–2026లో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పథకంలను ప్రత్యేకంగా ప్రశంసించింది.
ఈ నివేదిక ప్రకారం.. 2014లో తెలంగాణలో సాగునీరందే భూముల విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుగా ఉండగా, 2023 నాటికి అది 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని వెల్లడించింది.
కేవలం తొమ్మిదేళ్ల కాలంలోనే సుమారు 90 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చారిత్రాత్మక మార్పు తీసుకువచ్చిందని ఎకనామిక్ సర్వే స్పష్టం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి విస్తరణతో పాటు, మిషన్ కాకతీయ పథకం ద్వారా వేలాది చెరువుల పునరుద్ధరణ జరిగి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు రైతులకు స్థిరమైన నీటి భద్రత లభించిందని సర్వే పేర్కొంది.