Suryaa.co.in

Andhra Pradesh

ఆటోన‌గ‌ర్ లో లెటెస్ట్ టెక్నాల‌జీ హిట్ బూత్ ఏర్పాటు కి కృషి

– ఎంపి కేశినేని శివ‌నాథ్
– ఎంపిని క‌లిసిన‌ మోటార్ పెయింట‌ర్స్ అసోసియేష‌న్ నాయ‌కులు

విజ‌య‌వాడ : ఆటోమొబైల్ రంగంలో వున్న పెయింట‌ర్స్ కి అండ‌గా వుంటాన‌ని, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌ట‌మే కాకుండా, ప‌లు పెయింట్స్ కంపెనీల‌తో మాట్లాడి ఆటోన‌గ‌ర్ లో లెటెస్ట్ టెక్నాల‌జీ హీట్ బూత్ లు ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ చెప్పారు.

ది ఆటో మొబైల్ టెక్నిషియ‌న్ అసోసియేష‌న్ (ఎ.టి.ఎ) మాజీ అధ్య‌క్షులు గొల్ల‌పూడి నాగేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ మోటార్ పెయింట‌ర్స్ అసోసియేష‌న్, ది విజ‌య‌వాడ మోటారు స్ప్రే పెయింట‌ర్స్ వెల్ ఫేర్ అసోసియేష‌న్ నాయ‌కులు, స‌భ్యులు గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో బుధ‌వారం ఎంపి కేశినేని శివనాథ్ ను క‌లిశారు.

వారి స‌మ‌స్య‌ల‌ను ఎంపి కేశినేని శివ‌నాథ్ అడిగి తెలుసుకున్నారు. ప్ర‌తి ఏడాది లారీలు బ్రేక్ ఇన్స్పెక్ష‌న్ కి వెళ్లిన‌ప్పుడు పెయింటింగ్ వేయించుకుని రావాల‌నే విధంగా నిబంధ‌న తీసుకువ‌స్తే…పెయింట‌ర్స్ కి ప‌నులు వుంటాయ‌ని తెలిపారు. పెయింట‌ర్స్ అసోసియేష‌న్స్ నాయ‌కులు స‌మ‌స్య‌ల‌పై ఎంపి కేశినేని శివ‌నాథ్ సానుకూలంగా స్పందించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో ఆటోన‌గ‌ర్ కి పూర్వ వైభ‌వం రానుంద‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ మోట‌ర్ పెయింట‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ వి.వీర‌చారి, చైర్మ‌న్ కె.వెంక‌ట‌కృష్ణ‌, సెక్ర‌ట‌రీ ఎస్.కె.ఖాజా, వైస్ ప్రెసిడెంట్ సురేష్, కోశాధికారి ప‌గ‌డాల సురేష్‌, ది విజ‌య‌వాడ మోటారు స్ప్రే పెయింట‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ డి.వి.ఆంజ‌నేయులు, సెక్ర‌ట‌రీ ఎస్.నారాయ‌ణ, ఎల‌క్ట్రిక‌ల్ అసోసియేష‌న్ వైస్ ప్రెసిడెంట్ కొడూరు ఆంజ‌నేయులు, సెక్ర‌ట‌రీ జాస్తి సురేష్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE