– కోలంకలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి సుభాష్
కాజులూరు : దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సుభాష్ శ్రీకారం చుట్టారు.
గ్రామాల పరిశుభ్రత, పారిశుధ్యం కోసం ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన 5 ట్రాక్టర్లు, ట్రక్కులు మంత్రి స్వయంగా ప్రారంభించి ఆయా పంచాయతీలకు అందజేశారు. మండలంలోని కోలంక, శీల, మంజేరు, కుయ్యేరు, దుగ్గుదూరు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేశారు. రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వెల్లడించారు. నియోజకవర్గానికి మరిన్ని నిధులు త్వరలో మంజూరు కానున్నాయని పేర్కొన్నారు.
రూ. 85 లక్షలతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
కోలంక గ్రామంలో ఆర్ అండ్ బి పరిధిలో రూ. 85 లక్షల అంచనాతో నిర్మించనున్న సీసీ, బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సుభాష్ శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో రూ.8 లక్షలతో నూతనంగా నిర్మించిన త్రాగునీరు పైపులైను, పంపు హౌస్, అలాగే రూ.2.80 లక్షలుతో ఏర్పాటుచేసిన త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ ను మంత్రి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి జె. రాంబాబు, డిప్యూటీ ఎంపీడీవో లు చక్రపాణి, ఎం సత్యనారాయణమూర్తి, ఆరడబ్ల్యూఎస్ ఏ ఈ, కాజులూరు మండల టిడిపి అధ్యక్షులు చవ్వా కుల నారాయణమూర్తి( డాక్టర్ బాబు) జనసేన అధ్యక్షులు బొండా వెంకన్న, సర్పంచ్ గుబ్బల మౌనిక నాగరాజు, సెక్రటరీ ఎస్ చంద్రశేఖర్, ఏపీవో వెంకటలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పద్మ రూప, ఆర్ అండ్ బి ఏ ఈ ప్రసన్న, ఎలక్ట్రికల్ ఏఈ వీర్రెడ్డి, చుండ్రు వీర్రాజు చౌదరి, వనుం వీరబ్రహ్మం, దంతులూరి వంశీ, దాట్ల బుచ్చిబాబు, మేడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, డీసీ విజయ గోపాల్ రాజు, వంశీ రాజు, బొండా రామకృష్ణ, కోలంక సొసైటీ అధ్యక్షులు, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.