Home » పాఠశాలలకు అందించే గుడ్లు, చిక్కీల్లో నాణ్యత ఉండాలి

పాఠశాలలకు అందించే గుడ్లు, చిక్కీల్లో నాణ్యత ఉండాలి

• సమగ్ర శిక్షా ఎస్పీడీ మరియు ఎండీఎం డైరెక్టర్ బి.శ్రీనివాసరావు
– లోకేష్ ఆగ్రహంతో రంగంలోకి దిగిన అధికారులు

విజ‌య‌వాడ: మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు అందించే గుడ్లు, చిక్కీలు నాణ్యత కూడినవి ఇవ్వాలని, పాడైనవి అందిస్తే తగు చర్యలు తీసుకోబడతాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు మరియు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి.శ్రీనివాసరావు సరఫరాదారులను ఉద్దేశిస్తూ అన్నారు. శుక్రవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథక అధికారులు, గుడ్లు, చిక్కీల సరఫరాదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆటంకం కలగకుండా గుడ్లు, చిక్కీలు అందించాలన్నారు. పెండింగ్ ఉన్న బిల్లులు అతి త్వరలో చెల్లిస్తామని తెలియజేశారు. గుడ్లు, చిక్కీలు సరఫరాలో నాణ్యత పరిశీలించడానికి ‘క్వాలిటీ చెకింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎండీఎం అడిషనల్ డైరెక్టర్ ఆర్.ఎస్.గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply