ఎన్నికల కమిషన్ (ECI) దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు SIR (Special Intensive Revision) తదుపరి దశకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ కీలక దశ ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంస్థ రాష్ట్రాలకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది.
దేశంలోని 17 రాష్ట్రాలు ,5 కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు ECI ప్రత్యేకంగా లేఖ పంపింది. ఇందులో ఓటర్ జాబితాల సమగ్ర పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పుల అప్డేట్, డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్ల తొలగింపు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. ఫీల్డ్ స్థాయి అధికారుల సమన్వయం, బూత్ లెవల్ ఆఫీసర్ల శిక్షణ, టెక్నాలజీ ఆధారిత డేటా వెరిఫికేషన్ కూడా ఈ దశలో ప్రధానంగా ఉండనున్నాయి.
SIR అంటే ఏమిటి?
Special Intensive Revision అనేది సాధారణ ఓటర్ జాబితా అప్డేట్ కంటే మరింత విస్తృతమైన ప్రక్రియ. ఇందులో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరించడం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లు తొలగించడం, 18 ఏళ్లు పూర్తిచేసుకున్న కొత్త ఓటర్లను చేర్చడం జరుగుతుంది. ఎన్నికల ముందు ఓటర్ డేటాబేస్ ఖచ్చితత్వాన్ని పెంచడమే దీని ప్రధాన లక్ష్యం.
ఇప్పటివరకు SIR పూర్తయిందని చెప్పబడుతున్న రాష్ట్రాలు
📍 బీహార్ (Bihar)
📍 అస్సాం (Assam) – ముందస్తు దశలు ముగిసినట్లు సమాచారం
📍 కేరళ (Kerala) – కొన్ని దశలు పూర్తి
ప్రస్తుతం SIR కొనసాగుతున్న రాష్ట్రాలు
📍 పశ్చిమ బెంగాల్ (West Bengal)
📍 తమిళనాడు (Tamil Nadu)
📍 ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)
📍 మధ్య ప్రదేశ్ (Madhya Pradesh)
📍 రాజస్థాన్ (Rajasthan)
📍 గుజరాత్ (Gujarat)
📍 ఛత్తీస్గఢ్ (Chhattisgarh)
తదుపరి దశలో భాగంగా పేర్కొన్న రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు :
ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా & నగర్ హవేలీ ,దమన్ & దీయూ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, లడఖ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఢిల్లీ (NCT), ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్.
రాజకీయంగా కూడా ఈ ప్రక్రియకు ప్రాధాన్యం పెరుగుతోంది.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే SIR పూర్తి కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. తాజా దశ పూర్తయితే ఎన్నికల ముందు ఓటర్ లిస్టులు మరింత శుద్ధి అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అధికారులు వేగంగా సన్నాహాలు ప్రారంభించాలని ECI స్పష్టంగా సూచించింది.
– ఉపద్రష్ట పార్ధసారధి