– వైఎస్సార్సీపీ కార్పొరేటర్
ఏలూరు నగర మేయర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైకాపా కార్పొరేటర్ ఆరోపించారు.మేయర్ వైకాపా పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో, అధిష్టానం చర్యలు తీసుకుంటుందని కార్పొరేటర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీ సభ్యుల మధ్యే విభేదాలు నెలకొన్నాయి. నగర మేయర్ నూర్జహాన్, ఆమె భర్త పెదబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైకాపా కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కార్పొరేషన్ చట్టంలో లేకపోయినా ముందస్తు అనుమతుల పేరుతో సుమారు రూ.5 కోట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కౌన్సిల్లో ఉన్న సభ్యుల్ని పట్టించుకోవటం లేదని.. ఇది సరికాదని చెప్పినా పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగం తేలిన రోజు మేయర్‌పై ముఖ్యమంత్రి కచ్చితంగా చర్యలు తీసుకుంటారని ఉమామహేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు.