Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగుల సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయి

– ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహదారు..యన్ చంద్రశేఖర్ రెడ్డి
రాజంపేట ఏన్జీవో హోమ్ లో ఉధ్యోగులతో ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు యన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అడగకుండానే 27% మధ్యంతర భృతి ఇచ్చి న ఘనత గౌరవ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది ప్రస్తుతం పెండింగ్ లోఉన్న పి అర్సీ ,డి.ఏ ,సిపియస్ ,కాంట్రాక్టు ఉధ్యోగులు రెగ్యులరైజ్ ,అవుట్ సోర్సింగ్ ఉధ్యోగులు భద్రత వున్న అన్ని సమస్యలపై ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి గారు సానుకూలంగా ఉన్నారని త్వరలోనే పరిస్కరిస్తారని తెలియజేశారు.
ఏపిఏన్జీవో అసోసియేషన్ లో 35 సంవత్సరాల సేవచేశానని ఉధ్యోగులు సమస్యలపై పూర్తి అవగాహన ఉందని గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి నాకు ప్రభుత్వ సలహాదారు (ఉధ్యోగులు సంక్షేమం) ఇచ్చి నందులకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.అన్ని ఉధ్యోగసంఘాల నుండి వచ్చే సమస్యలను ప్రభుత్వం నకు ముఖ్యమంత్రి గారికి ,ప్రజా ప్రతినిధులకు తెలియజేసి ఉధ్యోగులు కు న్యాయం చేస్తానని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉధ్యోగులు పక్షిపాతిగా అన్ని డిమాండ్ల ప్రభుత్వం త్వరలోనే పరిస్కరిస్తాది.మనంకూడా రాష్ట్ర ప్రభుత్వం నకు అన్ని విధాల సహయ సహకారాన్ని అందించాలన్నారు.
నేను ప్రభుత్వం నకు ఉధ్యోగులకు వారధిగా ఉంటూ ఉధ్యోగులు డిమాండ్లను త్వరలోనే ముఖ్యమంత్రి నెరవేరుస్తారని తెలియజేశారు.ఉధ్యోగులు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ,పోస్టల్ బ్యాలెట్ అందరూ ఇవ్వాలని ఓటు వేయలేని వారిని ఓటు వినియోగించుకొనేవిధంగా చూడాలి ముఖ్యమంత్రి గారు ఉధ్యోగులు సమస్యలు అన్ని పరిస్కరాఅవుతాయి కావున వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి అందరూ మద్దతు గా నిలబడి రాజంపేట లో 15 వతేది జరిగే మున్సిపల్ ఎన్నికల లో వైఎస్సార్ పార్టీ కి ఓట్లు వేసి గెలిపించాలన్నారు .
ప్రభుత్వ సలహ దారు యన్ చంద్రశేఖర్ రెడ్డి ని ఘనంగా సన్మానించిన వైఎస్సార్ జిల్లా ,రాజంపేట ఏన్జీవో నాయకులు. ఈకార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు ,ఏన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.ప్రసాద్ యాదవ్ ,జిల్లా కార్యదర్శి డి.రవికుమార్ ,కడప బిల్డింగ్ సోసైటి అధ్యక్షుడు యల్ కొండారెడ్డి రాజంపేట అధ్యక్షుడు యస్.వి.రమణ ,గౌరవ అధ్యక్షుడు ఓ.వి.శివారెడ్డి ,కార్యదర్శి వి.చంద్రశేఖర్ రెడ్డి ,జిల్లా కార్యవర్గం నిత్యా పూజయ్య ,బాలపుల్లయ్య,కోడూరు అధ్యక్షుడు ఓబులేసు, ట్రెజరర్ సిద్దరామయ్య ,ఏన్జీవో కోశాధికారి వరదయ్య ,సహ అధ్యక్షుడు యస్.రామాంజులు, యన్.హరిప్రసాద్ ,విజయకుమారి ,ఏన్జీవో నాయకులు ఉధ్యోగులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE