Suryaa.co.in

Andhra Pradesh

జీతాలకోసం ఉద్యోగులు గవర్నర్ ని కలవడం, దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనం

– అప్పులుపుడితే తప్ప, జీతాలివ్వలేని స్థితిలో ముఖ్యమంత్రి ఉంటే, తక్షణమే ఆయన పదవికి రాజీనామాచేయాలి.
• రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జన్సీ వచ్చింది అనడానికి ఈ ఘటనే నిదర్శనం.
• చెదపట్టిన గుమ్మంలా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి తయారైంది.
• ఈ ప్రభుత్వంలో ఉద్యోగసంఘం నేతలే సంతోషంగా ఉన్నారు… ఉద్యోగులకే ఏడుపే మిగిలింది.
• ఆప్కాస్ పరిధిలోని లక్షమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరెక్ట్ గా జీతాలిస్తున్నట్టు ప్రభుత్వం నిరూపిస్తే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామాచేస్తాను
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

ఉద్యోగులు జీతాలకోసం గవర్నర్ ని కలవడం అనేది దేశచరిత్రలో బహుశా ఇదేతొలిసారి అని, అప్పులుపుడితే తప్ప ప్రభుత్వం నడిచే పరిస్థితి, ఉద్యోగులకు జీతాలు అందని స్థితి ఉం టే, ముఖ్యమంత్రి తక్షణమే తనపదవికి రాజీనామాచేయడం మంచిదని టీడీపీఎమ్మెల్సీ పరు చూరి అశోక్ బాబు స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

సమ్మె చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి?
“ఉద్యోగసంఘం నేత రాష్ట్ర గవర్నర్ ని కలవడం, రాష్ట్ర ఆర్థికపరిస్థితి దిగజారిందనడానికి నిదర్శనం. ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇప్పించాలని, రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇప్పించాలని ఉద్యోగసంఘాలు గవర్నర్ ని కోరాయి. ఉద్యోగసంఘాలు గవర్నర్ ని కలవడం అనేది సాధారణమే. కానీ జీతాలకోసం గవర్నర్ ని కలవడం దేశంలో ఇదే తొలిసారి. ప్రభు త్వం స్పందించకుంటే ఏప్రియల్ లో సమ్మె చేస్తామన్నారు.. సమ్మె చేసినా ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి? అసలు ఉద్యోగసంఘాలను నమ్మి ఉద్యోగులు వస్తారా? గతంలో వారిని నమ్మించి మోసగించారు కదా! ఉద్యోగసంఘాలు, ఉద్యోగులకు మధ్య అభిప్రాయబేధాలు సృష్టించి, ప్రభుత్వం పబ్బంగడుపుకుంటోంది. ఉద్యోగసంఘాల్ని బెదిరించి, వేధించి ప్రభుత్వం ఉద్యోగుల్ని నియంత్రిస్తోంది. ఉద్యోగసంఘాల్ని విడదీసి, కొత్త సంఘాలను సృష్టించి, ఉద్యోగ సంఘాల నేతలను ప్రలోభపెడుతూ, ప్రభుత్వం నెట్టుకొస్తోంది. ఈ పద్ధతి ఎన్నాళ్లు అమలు చేస్తారో చూడాలి.

ముఖ్యమంత్రికి చేతకాకపోతే, తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలి
జనవరి జీతాలు ఫిబ్రవరి నెల్లోకూడా ఇవ్వలేమని, ఇప్పటికే ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు. అప్పులు పుడితేనే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తోంది. రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జన్సీ వచ్చింది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. చెదపట్టిన గుమ్మంలా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి తయారైంది. కేంద్రప్రభుత్వం రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై సమీక్షించి, వెంటనే ఒక నిర్ణయానికి రావాలి. 7వేలకోట్ల డీఏలు ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాలి ఉంది. గతం లో పీఆర్సీ సందర్భంలో ఉద్యోగులకు రూ.2,500కోట్లు ఇవ్వాల్సి ఉందని, మార్చి 2022 నాటికి ఇస్తామని ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికీ ఆ బకాయిలు ఇవ్వలేదు. జీపీఎఫ్ అడ్వా న్స్ లు కూడా ఇవ్వని ప్రభుత్వం, వాటినికూడా వాడుకుంది. రాష్ట్రప్రభుత్వం రూ.480కోట్లు వాడుకుందని కేంద్రమే చెప్పింది.

ఈ ప్రభుత్వానికి హక్కులపై ఉన్న అవగాహన బాధ్యతలపై లేదు. అలవెన్సుల విషయంలో పోలీస్ శాఖ కన్నీళ్లు పెట్టుకుంటోంది. చాలామంది పోలీసు లు వారిజీతాల్లో 25శాతం సొమ్ముని టీ.ఏ, డీ.ఏలకు ఖర్చుపెడుతున్నారు.ఈ ప్రభుత్వంలో ఉద్యోగసంఘాలు సంతోషంగా ఉన్నాయికానీ, ఉద్యోగులకు మాత్రం ఏడుపే మిగిలింది. గతప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి 50జీవోలు ఇచ్చింది. ఉద్యోగాలభర్తీ, పీఆర్సీ, ఇతర త్రా ప్రయోజనాలన్నీ నెరవేర్చింది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు చేస్తాన న్నాడు. తరువాతేమో దానిగురించి తెలియక చెప్పామని నాలుక మడతేశాడు. ముఖ్యమం త్రికి చేతగాకపోతే తక్షణమే రాజీనామా చేయాలి. ఆ పని చేయకపోతే రాష్ట్రమే మునిగి పోతుంది.
ఆప్కాస్ లోని ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కరెక్ట్ గా ప్రతినెలా జీతాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం నిరూపిస్తే, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం పెట్టేవారికి బిల్లులు చెల్లించడంలేదు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వడంలేదు. కరోనాసమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన వైద్యులు, నర్సులకు హై కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప, ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు. ఆప్కాస్ లోని లక్షమంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఈ ప్రభుత్వం ఏనాడైనా కరెక్ట్ గా జీతాలు ఇచ్చిందా? ఇచ్చినట్టు నిరూపిస్తే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను. ఉద్యోగసంఘాల సమన్వయంతో ప్రభు త్వానికి సంబంధంలేదు. ప్రభుత్వం చేయాల్సింది సకాలంలో జీతాలు, ఇతరత్రా ప్రయోజ నాలు ఉద్యోగులకు కల్పించడం. గతప్రభుత్వంలో చీటికిమాటికి ఉరికి ఉరికి రోడ్లపైకి వచ్చిన ఉద్యోగసంఘాలు ఇప్పుడేమయ్యాయి? టీచర్లను వేధిస్తున్నా, ఉపాధ్యాయఖాళీలను భర్తీ చేయకపోయినా, సీపీఎస్ రద్దుచేయకున్నా, డీఏలు ఇవ్వకపోయినా ఉద్యోగసంఘం నేత లు నోరెత్తరు. 01-07-2023 కి కొత్త పీఆర్సీ ప్రకటించాలి. గతంలో పీఆర్సీ డ్యూ డేట్ కంటే ముందే పీఆర్సీ కమిషన్ వేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఉద్యోగసంఘాల్లోని అనైక్యత ప్రభుత్వానికి కలిసొస్తుంది. కొత్త పీఆర్సీ కమిషన్ ఎవరు వేయాలి.. డీఏ బకాయిలు, జీపీఎఫ్ ఎవరిస్తారు .. సీపీఎస్ రద్దు సంగతేంటి? ఎన్.పీ.ఎస్ ట్రస్ట్ కు ఉద్యోగులు, ప్రభుత్వం కట్టాల్సిన రూ.3వేలకోట్లపై అధికారిక సమాచారం ఉంది. ఆసొమ్ము ఈ ప్రభుత్వం ఎప్పుడు కడుతుంది? ఇలాంటి అనేకప్రశ్నలు సమాధానంలేకుండా మిగిలిపోతున్నాయి. ఇప్పటికైనా ఉద్యోగసంఘం నేతలంతా స్వప్రయోజనాలు వదిలేసి ఒక వేదిక పైకి వచ్చి, సాధారణ ఉద్యోగులందరికీ న్యాయంచేయాలి.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని వారు కొత్తగా పోలీస్ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తున్నారు? రేపు కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చినవారికి జీతాలివ్వకపోతే వారి పరిస్థితేంటి?
గతంలో శ్రీలంక పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు పాకిస్థాన్ లో అంతకంటే దారుణమైన పరిస్థితులున్నాయి. త్వరలో దాన్నిమించిన దుస్థితి ఏపీలో వస్తుంది. ముఖ్యమంత్రి ఆర్థిక విధానాలే రాష్ట్ర ఆర్థికపరిస్థితి విచ్ఛిన్నానికి కారణం. ఆర్థికమంత్రి ఎవరికీ అందుబాటులో ఉండడు. ఆర్థికశాఖ కార్యదర్శులు ఏమీ చెప్పరు. ఉద్యోగులు వారిసమస్యలపై ఎవర్ని అడగాలి? కేంద్రప్రభుత్వం ఇచ్చే డీఏ ఆధారంగా రాష్ట్రప్రభుత్వాలు డీఏలు ప్రకటిస్తుంటాయి. ఏపీప్రభుత్వం ఇంతవరకు ఒక్క డీఏ ప్రకటించలేదు. గతంలో బీహార్ లో జీతాలు అంద లేదని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఏపీ ఆస్థానంలో నిలిచింది. ఏపీ ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం దృష్టిసారించాలి. అప్పులు పుట్టకపోతే ప్రభుత్వం నడవని పరిస్థితే ఉంటే, కేంద్రం తక్షణమే రాష్ట్రప్రభుత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే ఉద్యోగులు ప్రభుత్వం కాళ్లుపట్టుకోవాలని మంత్రి అంటున్నారు. ఉద్యోగులు సమాజంలో భాగంకాదా? ఉద్యోగుల జీతాలకు ఎక్కువ అవుతోంది.. ప్రజలకు సంక్షేమం అందించలేక పోతున్నామని పాలకులు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వం 6,500 పోలీస్ ఉద్యోగా లకు నోటిఫికేషన్ ఇస్తే, 5లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన వారికి జీతాలు ఇవ్వకపోతే వారి పరిస్థితి ఏమిటి? ఏటా డీఎస్సీ ఇస్తామని, జాబ్ క్యాలెండర్ తో ప్రభుత్వ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఎందుకు చెప్పారు? ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీల న్నీ నేడు గారడీ మాటలగానే మిగిలిపోయాయి. మోసంచేసే వ్యక్తి ముఖ్య మంత్రి అయితే ఇలానే ఉంటుంది. గతంలో చాలా అంశాలపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి చీవాట్లు తిన్న ది. దేశంలో ఏ ఫ్రభుత్వంపై లేనన్ని కోర్టుధిక్కరణ కేసులు జగన్ ప్రభుత్వంపై ఉన్నాయి. కోర్టుకేసులపేరుతో విచ్చలవిడిగా ప్రజాధనం దుర్వినియోగం చేయడం ప్రభుత్వానికి అల వాటు అయింది” అని అశోక్ బాబు ఎద్దేవాచేశారు.

LEAVE A RESPONSE