– ఏప్రిల్ 5న మలిదశ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక
– ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు
ప్రభుత్వం నుండి ఉద్యోగులకు అందవలసిన ఆర్థిక, ఆర్దికేతర అంశాల సాధన కోసం ఉద్యోగుల పోరాటం కొనసాగుతుందని ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగ పోరాట కార్యాచరణ లో భాగంగా ఉద్యోగులకు ఉద్యమ కార్యాచరణ పై అవగాహన కోసం పర్యటనలలో భాగంగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్, ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ని విజయవాడ లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నకు ప్రత్యేక అతిధి గా ఆహ్వానించారు.
బొప్పరాజు వెంకటేశ్వర్లు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం సందర్శించి ఉద్యమ కార్యాచరణ లో భాగంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న ఉద్యోగులను కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటించ వలసిన పరిస్థితులు, ఉద్యమ కార్యాచరణ అమలు పై వివరం గా అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా వాడుకున్న ఉద్యోగుల డబ్బులు చెల్లించకపోవడం, ఉద్యోగులకు చట్ట ప్రకారం చెల్లించాల్సిన అన్ని రకాల అరియర్సు, లీవ్ ఎన్ క్యాష్ మెంట్లు, మెడికిల్ రీయింబర్స్ మెంటు బిల్లులు, డిఏ బకాయిలు, కొత్తగా ఇవ్వాల్సిన డిఏలు తధితర ఆర్దికపరమైన అంశాలుతో పాటు ప్రభుత్వమే హామీ ఇచ్చిన సిపియస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపుదల తదితర ఆర్ధికేతర అంశాలు పరిష్కరించేలా చూడనందున ఈ ఉద్యమ కార్యచరణను కొనసాగిస్తున్నామన్నామని స్పష్టం చేశారు.
ఈ నెలాఖరు వరకు ఏపిజెఏసి అమరావతి ఆద్వర్యంలో చేపట్టదలచిన మర్చి 9వ తేదీ నుండి ఏప్రిల్-5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, తేదిః17 & 20 తేదిలలో (రెండు రోజులు) ఉద్యమానికి మద్దతుకోరుతూ అన్నీ ప్రభుత్వ కార్యాలయాల సందర్శన కార్యక్రమాలు గూర్చి, ఈనెల 21 నుండి రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఉద్యోగులు వర్కుటూరూల్, 27వ తేదీన కారుణ్య నియామకాలు పొందని కుటుంబాల ఇండ్ల సందర్శన తదితర ఆందోళన కార్యక్రమాలు గూర్చి ఉద్యోగులకు వివరించి అందరూ స్వచ్చందం గా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అవగాహన కల్పించారు.
అప్పటికి మా న్యాయమైన ఆర్ధిక, అర్ధికేతర సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఏప్రిల్ 5న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి మలిదశ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు తో పాటు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి మురళీకృష్ణ నాయుడు , వీఆరోఓ సంఘ రాష్ట్ర నాయకుడు ఏ సాంబశివ రావు ,ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ ఈశ్వర్ ,ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవరపల్లి శ్రీనివాస్, కార్యదర్శి బత్తిన రామకృష్ణ, ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి ,అసోసియేట్ ప్రెసిడెంట్ , కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిఇంత్యాజ్ పాషా, ఉపాధ్యక్షుడు యన్. శ్రీనివాస మూర్తి, రవీంద్ర నాథ్ , కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు ఆనంద్ ,విజయవాడ డివిజన్ అధ్యక్షుడు చింతకాయల అప్పారావు , రాష్ట్ర తదితరులు పాల్గొన్నారు.