– ఓడిపోయి ఇంట్లో కూర్చున్నా వదిలిపెట్టను. దోపిడీ చేసిన ప్రతి రూపాయి కక్కిస్తా
– నేను సైదాపురంపోయి అక్రమ మైనింగ్ ఆపలేదంట..మంత్రిగా ఆయన ఆపకుండా గాడిదలు కాస్తున్నాడా
– వరదాపురంలో దోచుకున్నది చాలక ఇప్పుడు మరుపూరులో దుకాణం మొదలుపెట్టాడు
– నాపై నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు. దమ్ముంటే విచారణ జరిపించి చేతనైంది చేసుకో
– కొలిదిబ్బ గిరిజన కాలనీలో ఉన్న 200 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసిన సోమిరెడ్డి
– తోటపల్లి గూడూరు మండలం పేడూరులో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం సందర్భంగా మీడియాతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
– తెలుగుదేశం – జనసేన ఆధ్వర్యంలో కార్యకర్తలు నరుకూరు సెంటర్ నుండి పేడూరు వరకు బైక్ ర్యాలీ ద్వారా సోమిరెడ్డికి ఘన స్వాగతం
పేడూరులో పర్యటించిన సందర్భంగా ఏ వీధిలో చూసినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో నేను చేసిన అభివృద్ధే కనిపిస్తోంది.పేడూరు నుంచి చింతోపు లింక్ రోడ్డు అయినా, పేడూరు మీదుగా కాకుపల్లి రోడ్డు అయినా, ఇలా ఏ రోడ్డు అయినా మేం చేసినవే. కాకాణి చేసిందేమైనా ఉందంటే వైసీపీ అధికారంలోకి రాగానే చెరువులను ధ్వంసం చేయడం. మట్టి, గ్రావెల్ ను అమ్ముకోవడం, ఇప్పుడు తెల్లరాయి తవ్వుకోవడం.
పొదలకూరు మండలం వరదాపురంలో 2 మైన్లలో దోచుకున్న వందల కోట్లు చాలక మరుపూరులోని క్వారీపై పడ్డాడు.సైదాపురంకి నేను పోయి అక్రమ మైనింగ్ ఆపలేదని నోటికొచ్చినట్టు కూస్తున్నాడు. మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏం చేస్తున్నాడు. ఆయనకు సిగ్గుంటే పొదలకూరు మండలంలో జరుగుతున్నది అక్రమ మైనింగ్ కాదని స్టేట్మెంట్ ఇవ్వమనండి. నేను సైదాపురంలో 14 మంది బ్రోకర్లను పెడితే మంత్రిగా నువ్వేం చేస్తున్నావ్. గాడిదలు కాస్తున్నావా?
అక్రమ మైనింగ్ తో ఓ వైపు వందల కోట్లు దోచుకుంటూ మరోవైపు గిరిజనుల వద్ద ఇంటి నిర్మాణం పేరుతో రూ.60 వేలు చొప్పున వసూళ్లకు తెరలేపాడు. ఒక్క పొదలకూరు మండలంలోనే నెలకు రూ.300 కోట్లు దోచుకుంటున్నాడు. ఇక చిల్లకూరు మండలంలో సిలికాకు, సైదాపురంలో క్వార్ట్జ్ దోపిడీకి లెక్కేలేదు. బినామీల పేరుతో కాకాణి చేసిన భారీ భూకుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చి, ఆ దోపిడీ బండారాన్ని కూడా బయటపెడతా. సర్వేపల్లిలో 5300 ఎకరాలు పేదలకు పంపిణీ చేస్తున్నానని ప్రకటించాడు. 3200 ఎకరాలకు లెక్కలు చూపాడు. మిగిలిన 2 వేల ఎకరాలు ఏమైపోయాయి?
కాకాణికి నిజాయతీ ఉంటే ఆ రెండు వేల ఎకరాలను ఎవరికి పంపిణీ చేశారో వివరాలు బయటపెట్టాలి. ఆయన పుటకే కుంభకోణాలమయం.నిద్ర లేచి దోపిడీల్లో మునిగితేలుతూ తిరిగి నన్ను తిట్టడానికి సిగ్గుందా? కాకాణి గోవర్ధన్ రెడ్డికి దమ్ముంటే నాపై ఆరోపణలు చేయడం కాదు. వాటిని నిరూపించి కేసులు పెట్టుకోమనండి.చెరువుల్లో మట్టి ఎత్తేసేవాళ్లు, ఎంపెడా లోన్లను కాజేసినోళ్లతో నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడిస్తావా?
సర్వేపల్లిలో జరుగుతున్న ఘోరాలన్నింటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. త్వరలోనే నీకు శుభం కార్డు వేస్తున్నారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తర్వాత కూడా నువ్వు చేసిన దోపిడీని ఉపేక్షించే ప్రసక్తే లేదు.వాటాలు వేసుకుని అక్రమ మైనింగ్ తో ప్రజల సొత్తు వందలకోట్లు దోచేస్తున్న నీతో పాటు నీకు సహకరిస్తున్న అధికారులందరినీ కోర్టు మెట్లు ఎక్కిస్తా.
వరద సహాయంతో కూడా కాకాణి నీ చేతి వాటం చూపిస్తున్నావు కదయ్యా. 2015 లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను M.L.C గా ఉన్నా , అప్పుడు ఇలాగే వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, జిల్లా అంతటా కులమతాలకు అతీతంగా 4000 నగదు,20 కేజీలు బియ్యం పంపిణీ చేసాము.
ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారం 1000 వేలు నగదు,40 కేజీల బియ్యం పంపిణీ చేయాలి. ఇది చేయకపోగా మునపటి 4000/- కూడా తగ్గించి 2500 ఇస్తున్నారు,అంటే కాక తెల్ల రేషన్ కార్డు లో ఒక్కరు ఉంటే 1000/-లు, ఇద్దరు ఉంటే 2000/- లు,ఆ పైన ఉంటే 2500/- రూపాయలు అంట ఇది నీ బతుకు కాకాణి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రావూరి రాధా కృష్ణమ నాయుడు,మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సోమిరెడ్డి రేవంత్ రెడ్డి, కోడూరు శ్రీనివాసులు రెడ్డి, ముత్యాల శ్రీనివాసులు, రఘుబాబు,గూడూరు నారాయణ, శ్రీహరి, పంది రాధా కృష్ణ, గండవరపు సోమశేఖర్ రెడ్డి, నిమ్మల రమేష్,శేఖర్, మండల తెలుగు మహిళ ఉప అధ్యక్షురాలు సుస్మిత రెడ్డి, రాధాకృష్ణ, బద్వేలి రాజేష్, నవీన్, సంగారి శ్రీనివాసులు, కుడుముల రవి, ఆలపాక విజయ్, రాజా,అన్నం హరికృష్ణ, జనసేన మండల అధ్యక్షులు సందీప్, కాళ్తిరెడ్డి శ్రీను, శరత్ బాబు,నడమల రవి, సతీష్, అన్నం నవీన్, జయసుధ,వినోద్ మండల, గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.