Suryaa.co.in

Telangana

ఈటెల రాజేందర్ బీసీ దొర

– ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్తారో ,బీ ఆర్ ఎస్ లోకి వస్తారో తెలియదు
– అసహనం తో ఈటెల సైకోగా మారారు
– హుజురాబాద్ అభివృద్ధి పై ఈటెల తో బహిరంగ చర్చకు సిద్ధం
– నేను ఏ ఒక్కరిని కులం పేరు తో దూషించలేదు
– ముదిరాజ్ బిడ్డను తిట్టినట్టు ఎవరైనా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
– ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిన్న అనేక అసత్య ఆరోపణలు చేశారు. మీడియా అంటే నాకు ప్రత్యేక గౌరవం. ఇద్దరు ముగ్గురు ఈటెల రాజేందర్ మీడియా బ్రోకర్లు నా పైన సీఎం కేసీఆర్ పైనా మంత్రి హరీష్ రావు పైనా కట్టు కథలు ప్రచారం చేస్తున్నారు. కొన్ని యూ ట్యూబ్ చానళ్ళు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ఓ యూ ట్యూబ్ ఛానల్ కెమెరా మన్ ను బంధించానని ,కులం పేరు తో దూషించానని తప్పుడు ప్రచారం చేశారు.ఆ కెమరామెన్ మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లారు. సీసీ టీవీ ఫుటేజ్ లో ఉంది.

ఈటెల రాజేందర్ బీసీ దొరలా వ్యవహరిస్తున్నారు.నేను ముదిరాజ్ లకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు. ఈటెల సొంత ఊర్లో నేను ముదిరాజ్ లకు ఎక్కువ చేశానా ఈటెల మేలు చేశారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు సిద్ధం.నేను ఏ ఒక్కరిని కులం పేరు తో దూషించలేదు.

నేను ఏ కార్యక్రమం మొదలు పెట్టినా పెద్దమ్మ దేవత ను తలుచుకునే చేస్తా.హుజారాబాద్ నియోజకవర్గం లోని ఏ ముదిరాజ్ ను అడిగినా నా గురించి గొప్పగా చెబుతారు.స్థానిక ఎమ్మెల్యే గా ఈటెల రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో ఎందుకు పాల్గొనలేదు ? హుజురా బాద్ లో జరుగుతున్న అభివృద్ధిని గణాంకాలతో సహా వివరిస్తా..నియోజక వర్గాన్ని బీ ఆర్ ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఈటెల చేసిన ఆరోపణలు ఖండిస్తున్నా.

18 వేల కు పైగా దళిత కుటుంబాలకు 18 వందల కోట్ల రూపాయలతో దళిత బంధు పథకాన్ని అమలు చేశాం.దళిత బంధు అమలు కావడం లేదని ఈటెల సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. హుజురాబాద్ అభివృద్ధి పై ఈటెల తో బహిరంగ చర్చకు సిద్ధం.హుజురాబాద్ అంబెడ్కర్ విగ్రహం దగ్గర చర్చకు సిద్ధం.

ఈటెల స్థాయి కన్నా నా స్థాయి ఎక్కువే ..స్థాయి తక్కువ అని చర్చ నుంచి పారిపోవద్దు. ప్రతి సర్వే హుజురాబాద్ లో బీ ఆర్ ఎస్ గెలుస్తుందని చెబుతోంది. బీ ఆర్ ఎస్ ను ఎందుకు వీడానా అని ఈటెల ప్రతి రొజూ మధన పడుతున్నారు. ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్తారో ,బీ ఆర్ ఎస్ లోకి వస్తారో తెలియదు. మ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈటెల హుజురాబాద్ లో తట్టెడు మన్నైనా తీశారా? ఈటెల ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు.

మంత్రిగా ఈటెల హుజురాబాద్ కు ఏమి చేయలేదు. మంత్రిగా గంగుల కమలాకర్ కరీంనగర్ కు ఎంతో చేస్తున్నారు ..మానేరు రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు.గంగుల తో పోల్చుకుంటే మంత్రిగా ఈటెల హుజురాబాద్ లో ఏమి చేయలేదు.జమ్మికుంట నాయిని చెరువు సుందరీకరణకు కూడా ఈటెల ప్రయత్నించ లేదు. ముదిరాజ్ బిడ్డను తిట్టినట్టు ఎవరైనా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.

పేద మీడియా ప్రతినిధులను ఆదుకున్న ఘనత నాదే తప్ప ఈటెల ది కాదు. ఈటెల కు ఎంత సేపు సానుభూతి రాజకీయమే కావాలి. ఈటెల చేసిన అరాచకం లో నాది పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు.అసహనం తో ఈటెల సైకోగా మారారు. ఈ సారి ఈటెల కు డిపాజిట్ కూడా దక్కదు.రాసి పెట్టుకోండి ..వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ తో ఈటెల ఓడిపోబోతున్నారు.

ఈటెల కన్నా సీనియర్ ఉద్యమ కారుడు మా నాన్న సాయినాథ్ రెడ్డే . హుజురాబాద్ లోని మా ఇంట్లో టీ ఆర్ ఎస్ జెండా పుట్టింది. ఈటెల పెట్టిన ఇబ్బందుల వల్లే మా నాన్న అపుడు టీ ఆర్ ఎస్ కు దూరమయ్యారు. ఈటెల పార్టీ ని వీడగానే మేము సొంత గూటికి వచ్చాము

LEAVE A RESPONSE