– వేసిన రాళ్లు పోయాయి.. ముళ్ల కంప మరలా పెరుగుతోంది
– మాకు న్యాయం లేదు. అక్కడ రైతులకు గ్యారంటీ లేదు
– రాజధాని అమరావతి రైతుల్లో మనో వేదన
– ఓ సీనియర్ జర్నలిస్ట్ ఆవేదన…
2015 జనవరి ఒకటోతేదీ నుండి పూలింగు ప్రక్రియ ప్రారంభమైన సమయంలో అక్కడి రైతులకు ప్రభుత్వం హామీలు గుప్పించింది. పూలింగు నిబంధనలూ విడుదల చేసింది వాటిల్లో రైతులకు ఇస్తామన్నవి, చేస్తామన్నవి ఏమిటనేది ఒకసారి పరిశీలిస్తే…గతంలో పూలింగుకు ఇచ్చిన వారికి ముళ్ల చెట్లతో నిండిన వారి భూములు కనిపిస్తున్నాయి…తప్ప ప్లాట్లు చేతికిరాలేదు.
చట్టప్రకారం రిజిస్టర్ చేసినా ఫలానాది నా ప్లాటు అని చెప్పుకునే అవకాశం లేదు… ఇటీవల ముళ్ల చెట్లు తొలగించినా మరలా మొలిచాయి…చెట్ల పీకివేత సమయంలో యంత్రాలు తిరగడంతో చాలాచోట్ల సరిహద్దు రాళ్లు కూడా లేకుండా పోయాయి.
అమరావతి రాజధాని నగర భూ సమీకరణ చట్ట 2015 ఉత్తర్యు నెంబరు 1 తేదీ 1.1.2015 ప్రకారం రైతులకు ఇచ్చిన హామీలు ఏమిటి వాటి అమలు ఇప్పటికి ఎలా ఉంది అనే అంశాలు చూస్తే …
2015 జనవరి ఒకటో తేదీన నేలపాడు గ్రామంలో పూలింగు ప్రక్రియ ప్రాంభించారు. భూ సమీకరణ కింద తీసుకునే భూమిని సెక్షన్ 38, 53 కింద ప్రభుత్వం తమకు తోచిన వారికి కేటాయించుకు హక్కు కల్పించారు. ప్రస్తుతం :రైతులకు లేవుట్లు అభివృద్ధి చేయకపోయినా సుమారు 60 సంస్థలకీ 880 ఎకరాలపైన కేటాయించారు.
వాటిల్లో విట్, ఎస్ఆర్ఎం, అమృత వంటి సంస్థలకి అనుమతి ఇచ్చారు. మినహా రైతుల భూముల అభివృద్ధికి ఇవ్వలేదు. కనీసం ఇళ్లు నిర్మించుందామన్నా ప్లాను ఇవ్వని పరిస్థితి. 2015 నుండి 2019 వరకూ ఇదే పరిస్థితి ఉంది. 2019 తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులని చెప్పడంతో అక్కడ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిది.
సెక్షన్ 9.5(ఏ) ప్రకారం తాగునీటి సరఫరా, వర్షపునీటి, మురుగునీటి కాలువలు, చెత్త నిర్వహణ, నీటి రీసైకిల్ వంటివి చట్టంలో పొందుపరిచారు.
ప్రసుత్తం : సెక్రటేరియట్‌కు, కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్లేందుకు, రాజధానిలో పనులు చేస్తున్నామని చెప్పేందుకు వీలుగా రోడ్లు నిర్మించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఇందులో భాగమే. చాలా చోట్ల రోడ్లు పాడైపోయాయి. ఇప్పటికీ గ్రామాల్లో మురుగునీటి నిర్వహణ సరిగా లేదు. శానిటేషన్ కార్మికులను నియమించినా వారికి జీతాలు కూడా రావడం లేదు. ఉన్న వాటికే నిర్వహణ లేకపోతే కొత్తవి కల్పించాలనే ఆలోచన సిఆర్డిఏ మర్చిపోయింది. అదేమంటే నిధులు లేవని తెలిపింది.
వైద్య ఆరోగ్య సేవలు కల్పిస్తామని హామీఇచ్చారు.
ప్రస్తుతం : వేల కోట్ల విలువైన భూములు రైతులు ఇచ్చారని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు 0.001 శాతం వెచ్చించి అంటే ఒక కోటి ఖరీదు చేసే చిన్న ఆస్పత్రి నిర్మించలేదు. ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రాలను దాదాపు మూలనపడేశారు. ఒకటీ అరా సేవలు మినహా చిన్నపాటి అనారోగ్యం వస్తే ఒకపూట ఉంచి వైద్యం కల్పించేందుకు రాజధాని గ్రామాల పరిధిలో బెడ్లు లేదు.
అదేమంటే డబ్బులు వచ్చాయిగా గుంటూరో, విజయవాడో వెళ్లి చూపించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు వారి అవసరాల కోసం ఏర్పాటు చేసే ఉచిత మెడికల్ క్యాంపులు తప్ప ప్రభుత్వం నేరుగా ఏర్పాటు చేసిందేమీ లేదు. ఇప్పుడు రాయపూడిలో చిన్నపాటి వైద్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.
9.6(a) ప్రకారం రెసిడెఁ్షయల్, నాన్ రెసిడెన్షియల్, సెమీ పబ్లిక్ ప్రాంతాలుగా విభజిస్తామని హామీ ఇచ్చారు.
కొత్తగా ఏర్పాటైన ప్లాట్లలో సెక్షన్ 14 ప్రకారం రోడ్లు, లైటింగ్, ఇతర సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. విచిత్రం ఏమిటంటే రైతులు ఇచ్చిన భూములు వారి భూముల సరిహద్దులను మర్చిపోయారు. ఇప్పుడు రెండోవిడత ముళ్ల చెట్లు పెరుగుతున్నాయి. పైగా గ్రామాల్లో ఉన్న ఇళ్లకే ప్లానింగ్ అనుమతులు ఇవ్వడం లేదు.
షెడ్యూలు 2లో
a. భూములు అభివృద్ధి చేస్తాము. లాటరీ పద్ధతిలో భూములు కేటాయిస్తారు.
ఇది కూడా అన్యాయమే.ఈ నిబంధనను ఇటీవల సవరించారు. 2024లోజిఓ మార్చి కమిషనర్ నేరుగా కేటాయించే విధంగా మార్పు చేశారు. దీనికోసం 20.9.2024న జిఓ ఎంఎస్ నెంబరు 92 జారీ చేశారు. దీని ప్రకారం కొత్త పూలింగు ఏరియాలో కమిషనర్ ఆయనకు ఇష్టం వచ్చిన విధంగా కేటాయించే హక్కు పొందారు.
e. ల్యాండ్ పూలింగు ఓనర్షిప్ సర్టిఫికెట్లు తొమ్మిది నెలల్లో ఇస్తామన్నారు. ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు.
f.12 నెలల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాల్సి ఉంది. 11 ఏళ్ల తరువాత కూడా అభివృద్ధి మాట పక్కన బెడితే ఇప్పటికీ ప్లాట్లు ఇస్తూనే ఉన్నారు.
g..మూడేళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. ఇవ్వలేదు. ఇప్పటికీ ముళ్లతుప్పలు ఉన్నాయి ఇటీవల కోట్లాది రూపాయలు(36)తో తొలగిస్తే మరలా మొలిచాయి. 36 కోట్లను రూ.44 కోట్లకు పెంచాలని ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ప్రతిపాదన పెడితే ప్రస్తుతానికి తిరస్కరించారు. అన్ని బిల్లులు వచ్చిన తరువాత ఆమోదించుకునే అవకాశం ఉంది. ముళ్ల తుప్పల తొలగింపు సమయంలో చాలా చోట్ల గతంలో వేసిన సర్వే రాళ్లు పీకేశారు.
రిహద్దు రాళ్లు చెదిరిపోయాయి.
షెడ్యూల్ 2(ii) ప్రకారం అన్ని గ్రామాల్లోనూ శ్మశానవాటికల సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఇది ప్రతి మనిషీ చివరి సంస్కారం గౌరవంగా జరగాలని కోరుకుంటారు. కానీ రాజధానిలో అంతకకుముందున్నవే తప్ప కొత్తగా సదుపాయాలు కల్పించిదేమీ లేదు. ఉన్నవాటిల్లోనూ పంచాయతీలే సదుపాయాలు కల్పించాయి మినహా సిఆర్డిఏ ఏర్పాటు చేసిందేమీ లేదు.
అంటే ఈ ప్రాంతంలో భూములిచ్చిన రైతులు చివరి రోజుల్లో కూడా గౌరవంగా అంత్యక్రియలునిర్వహించుకునే పరిస్థితి కూడా సిఆర్డిఏ కల్పించలేదు. అదేమంటే ప్లానుకు అడ్డం అని చెప్పి ఉన్న శ్మశానాలను(గుర్తులను) పీకి పక్కనబడేశారు. ఒక్క చోటే ఆదునిక సదుపాయాలు కల్పించారు.
షెడ్యూలు 3
(ii). గ్రామ స్థలాల్లో ఉండే వారికి ధృవీకరణ సర్టిఫికెట్లు ఇస్తాము. అందరికీ ఇవ్వలేదు ఇళ్లు లేనివారికి ఇళ్లు నిర్మించి ఇస్తాము. అర్హలందరీ ఇళ్లు అందలేదు చాలా చోట్ల తుప్పలు మొలిచి ఇప్పుడు పనులు చేసేందుకు వచ్చిన ఇతర రాష్ట్రాల వారికి, భద్రత డ్యూటీల్లో ఉండే పోలీసులకు తాత్కాలిక నివాసాలకు కేటాయించారు.
(e). పేదలకు స్వయం ఉపాధి కోసం వడ్డీ లేకఁండా రూ.25 లక్షల వరకూ రుణాలు ఇస్తామని తెలిపారు. ఒక్కరికంటే ఒక్కరికీ ఇవ్వలేదు. రాజదాని ప్రాంతంలో అలా పొందిన వారు ఎవరైనా ఉంటే చెబితే తాము సంతోషిస్తామని రైతులు చెబుతున్నారు.
(iii)
a.2014 డిసెంబర్ 8 నాటికి పూలింగు ప్రకటిత గ్రామాల్లో ఉండేవారందరికీ వైద్య సదుపాయాలు కల్పిస్తాము.
b. వృద్ధాశ్రమాలు నిర్మిస్తాము.
c.ఎన్టిఆర్ క్యాంటీన్లు పెడతాము.
d.365 రోజులు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తాము.
e. నైపుణ్య శిక్షణా కేంద్రాలు స్టైఫండ్‌తో కలిపి శిక్షణ ఇస్తాము. వీరిలో కౌలుదారులు, వ్యవసాయ కార్మికఁలు, ఇతర అవసరం ఉన్న వారికి ఈ సదుపాయం కల్పిస్తాము.
వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు కాలేదని రైతులు చెబుతున్నారు.
ప్రసుత్తం రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. భూములిచ్చింది గాక 11 సంతవ్సరాల నుండి ప్రభుత్వాలతో పోరాడుతున్నాము. అధికారులతో మాటలు పడుతున్నాము. అదే బాధ వారిఁ వెంటాడుతోంది.
ఒకప్పుడు మా ఇంటిముందుకొచ్చి భూములు ఇవ్వాలని బతిమిలాడిన అధికారులు ఇప్పుడు కార్యాలయాలకు వెళితే కూర్చోమని కూడా అనడం లేదు. కమిషనర్‌ను కలవాలంటే కనీసం గంటన్నర నుండి రెండు గంటలు ఒక్కోసారి ఉదయం నుండి సాయంత్రం వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పైగా పెట్టే గ్రీవెన్స్‌కు వెళ్లి సమస్యలు చెప్పుకోవాలంట. భూములిచ్చి తమ బాధలు చెప్పకునేందుకు కార్యాలయం చుట్టూ తిరగాలి. పరిష్కరిస్తే పరిష్కరిస్తారు లేకపోతే లేదు.
రైతులకఁ భూములు అభివద్ధి చేసి ఇవ్వడానికి ఇష్టపడని ప్రభుత్వం డెవలప్మెంట్ పేరుతో, కన్వెన్షన్ సెంటర్లు, పెద్ద పెద్ద హోటళ్లు, వ్యాపారవేత్తల భవనాలు కట్టుకునేందుకు అనుమతులు ఇచ్చేస్తోంది.
మరి రైతులు ఏం పాపం చేశారని వారికి న్యాయం చేయడం లేదు. 2014 డిసెంబరు 8వ తేదీ నుండి పూలింగు ప్రక్రియను, రాజధానిని పరిశీలిస్తున్న ఒక జర్నలిస్టుగా నా అభిప్రాయం అదే. అక్కడి రైతులకు న్యాయం జరుగుతుందా ?
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్టు
9010099208