– దొంగలకు ఈనాడు రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు, లోకేష్ మద్దతా..?
– మహిళల మాన, ప్రాణాలతో చెలగాటమాడే వారికి మీరు అండగా ఉంటారా?
– అరాచకవాదులకు అండగా నిలుస్తామని దమ్ముంటే మీ మీడియాలోనే ప్రకటనలు ఇవ్వండి
– ఆ వార్త ఫై ఈనాడు రామోజీకి మంత్రి జోగి సవాల్
– ఆ వార్త నిజమైతే, నేను రాజీనామా చేస్తా.. మరి మీరు ఈనాడు బాధ్యతలు వదులుకుంటారా..?
– అయ్యన్న, ఆయన కొడుకు అదే బాపతు…
– రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్
చింతకాయల విజయ్ ఓ అరాచక వాది
టీడీపీకి చెందిన ప్రబుద్ధుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులకు, ఈనాడు రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, టీవీ5 నాయుడుకి రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్యం వ్యవస్థ విలువలు వర్తించవా ?. తప్పుడు పనులు చేసేవారిని గట్టిగా మందలించాలనో, తప్పుడు వ్యవహారాలు సృష్టించి రాసేవారిపై చర్యలు తీసుకోవాలని మీకు అనిపించదా?, తప్పుడు వ్యవహారాలు సృష్టించేవారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడుకు ఏనాడూ అనిపించదా? తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఐ-టీడీపీ వెబ్‌సైట్‌ను పర్యక్షించే చింతకాయల విజయ్ ఒక అరాచకవాది. మహిళల మాన, ప్రాణలకు సంబంధించి వెబ్సైట్లో పోస్టింగ్‌లు పెడితే విచారణ నిమిత్తం ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని అతని నివాసానికి వెళితే.. దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు.
చింతకాయల విజయ్‌పై దాడి చేయడానికి వెళ్లారని, ఇంట్లో సోదాలు చేశారంటూ.. టిడిపి, ఎల్లో మీడియా గగ్గోలు పెడుతున్నారు. దొంగ ఇంటికి, తప్పుడు పనులు చేసేవాళ్ల ఇళ్లకు పోలీసులు వెళతారు? దుర్మార్గమైన, అరాచకవాదుల ఇళ్లకు ఎందుకు వెళతారనేది చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణా, టీవీ5 నాయుడులు సమాధానం చెప్పాలి.
తప్పు చేయకుంటే గోడదూకి ఎందుకు పారిపోతాడు?
– చింతకాయల విజయ్… మహిళల మాన, ప్రాణాలకు భంగం కలిగించాడు. వారిని కించపరుస్తూ పోస్టింగ్‌లు పెట్టడం సమంజసమేనా? కాబట్టే చర్యలు తీసుకునేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. నిజంగానే చింతకాయల తప్పు చేయకుంటే ఎందుకు గోడదూకి పారిపోతాడు?
మన ఇళ్లల్లోనూ మహిళలు ఉన్నారు కదా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మనసున్న ఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాం. మేం ఏనాడు దుర్మార్గపు క్రీడకు ఒడిగట్టం. మా నాయకుడు మాకు అలాంటి నడవడిక నేర్పించారు.
చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ని సూటిగా అడుగుతున్నా. ఇలాంటి అరాచకవాదుల్ని మీ అఫీషియల్ వెబ్సైట్ ఐ-టీడీపీలో పెట్టుకుని అన్యాయమైన పోస్టింగ్‌లు పెట్టించవచ్చా? మీకు కూతుర్లు, కోడళ్లు ఉన్నారు కదా? అదే పని ఎవరైనా చేస్తే, మీ మనసుకు ఎలా ఉంటుంది.
ఏమీ చేయలేని సన్నాసులు, అసమర్థులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.తప్పు చేసిన వ్యక్తిని సమర్థిస్తూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ మీ ఎల్లో పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వార్తలు ప్రచురించడం దుర్మార్గపు చర్య.
పారిపోయిన దొంగకు మద్దతు ఇస్తారా? అతడికి మద్దతు ఇస్తూ వార్తలు రాస్తారా? దొంగ కాబట్టే గోడ దూకి పారిపోయాడు. విజయ్ మనిషిగా పుట్టి ఉంటే తానేమీ తప్పు చేయలేదని భావిస్తే, మీడియా ముందుకు రావాలి.తాను ఏ తప్పూ చేయకపోయినా, సీఐడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పమనండి. తప్పుడు వార్తలు సృష్టిస్తూ, మహిళల శీలాన్ని శంకించేవిధంగా పోస్టింగ్‌లు పెడితే అలాంటి వ్యక్తిని ప్రోత్సహించాలా? దుర్మార్గపు పనులు చేసే వ్యక్తికి అండగా ఉంటారా? ఇదా మీ నాయకత్వం.
కొడుకులకు మంచి చెప్పండి బాబూ..!
చింతకాయల విజయ్ తండ్రి అయ్యన్నపాత్రుడు విషయానికి వస్తే.. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. అక్రమ కట్టడాన్ని కూల్చివేసేందుకు పొక్లెయిన్ తీసుకువస్తే గోడదూకి పారిపోతాడు. కొడుకు కూడా అదే బాపతు. పారిపోయిన తండ్రీకొడులకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ సపోర్టు చేయడం సిగ్గుచేటు.
వీళ్లకు మద్దతుగా పనికిమాలిన దుష్ట చతుష్టయం పేపర్లు, టీవీలు.భాద్యతాయుతమైన తండ్రిల స్థానంలో ఉన్న మీరు కొడుకులకు మంచి చెప్పండి. మీకే బుద్ధి లేదు… నోరు తెరిస్తే బూతులే. ఇప్పటికీ భాష మార్చుకోరే.. నా కొడుకు, నీ కొడుకు అంటూ వెకిలి వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడుకు, అయ్యన్నకు తమ పుత్రరత్నాల మీద నమ్మకం పోయిందేమో? ప్రజాస్వామ్యంలో మహిళలను గౌరవించడం ఆనవాయితీ. వారికి ప్రాధాన్యత ఇచ్చి… వారికి అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తూ 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ, వారి ప్రతిష్టను పెంచుతూ ముందుకు వెళుతున్నారు ముఖ్యమంత్రి జగన్ గారు . ప్రతి మహిళలోనూ అమ్మను చూసేలా… మా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తున్నారు.
మహిళలను కించపరుస్తూ రాక్షసానందం పొందుతున్నారు.తప్పు చేసినవారిని పోలీసులు అరెస్ట్ చేయడం తప్పా? అలాంటి వారిపై చర్యలు తీసుకోవడాన్ని మీరు అంగీకరించరా?
ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో మీ కుటుంబాలపైనే వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టరా?
వైయస్సార్ సీపీ ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటుంది. మేము అలాంటి పోస్టింగ్‌లు పెట్టం. మా నాయకుడు మాకు అలాంటి కుసంస్కారం నేర్పేలేదే?మా అధినేత జగన్ అమ్మను, మహిళలను గౌరవిస్తారు. అక్కచెల్లెమ్మలకు, అవ్వా తాతలను, అమ్మలను అందలం ఎక్కిస్తున్నారు. జగన్ మాకు సంస్కారంతో పాటు, బాధ్యతగా ఎలా ఉండాలో నేర్పించారు.
చంద్రబాబు వత్తాసు పలకడం సిగ్గుచేటు
తప్పు చేసిన చింతకాయల విజయ్‌కు చంద్రబాబు నాయుడు వత్తాసు పలకడం సిగ్గుచేటు. ఈ ఘటనకు బాబే బాధ్యత తీసుకోవాలి. ఇటువంటి దారుణమైన పోస్టింగులకు నారా లోకేష్ సమాధానం చెప్పాలి.మరోవైపు తప్పు చేసిన వ్యక్తులను సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు రాయడం సిగ్గుచేటు.
మహిళలకు వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టి వారి హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వ్యక్తులపై పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలి.
ఇలాంటి అరాచకవాదుల్ని చూస్తూ వదిలేస్తే.. కొన్ని వందలు, వేలమంది అరాచకవాదులు తయారవుతారు. దుర్మార్గపు చర్యలకు పాల్పడేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా, రాజ్యాంగ స్పూర్తిని నిట్టనిలువునా చీల్చే ఇలాంటి అరాచకవాదుల్ని అరెస్ట్ చేయాల్సిందే. మహిళలను కించపరిచేలా, వారి మాన,ప్రాణాలకు భంగం కలిగించేలా పోస్టింగ్‌లు పెడితే సహించేది లేదు.
చింతకాయల విజయ్ను.. చంద్రబాబు నాయుడు, లోకేష్, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు సమర్థిస్తే … దొంగలను సమర్థిస్తున్నామని రామోజీరావు, దొంగల్ని ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, అరాచకవాదులకు అండగా ఉంటామని టీవీ5 నాయుడు…దొంగల్ని, అరాచకవాదుల్ని, అక్కు పక్షులను మా పార్టీలో అందలం ఎక్కిస్తున్నామని చంద్రబాబు నాయుడు పత్రికల్లో ప్రకటన ఇవ్వండి.అందరి కుటుంబాల్లో మహిళలు ఉన్నారు. వారిని గౌరవించే సంస్కృతి నేర్చుకుంటే బాగుపడతారు. మహిళలను గౌరవించడం లేదు కాబట్టే మీరు మట్టి కొట్టుకుపోతున్నారు.
ఈనాడు రామోజీకి సవాల్..
ఈరోజు ఈనాడు దినపత్రికలో ‘గృహ నిర్మాణ శాఖలో వసూలు రాజా’ అనే వార్తను ప్రచురించారు. ఈనాడు దినపత్రిక అధిపతి చెరుకూరి రామోజీరావును సూటిగా ప్రశ్నిస్తున్నా. పేపరు ఉంది కదా అని, ఏది పడితే అది, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మీరు మీ పత్రికలో రాయగలరు. అయితే ఆ వార్తలోని వాస్తవాలను నిరూపించే దమ్ము రామోజీరావుకు ఉందా…?
ఈనాడులో ఇంతపెద్ద ఎత్తున ప్రచురించిన ఆవార్తలో ఎలాంటి వాస్తవం లేదు, అదొక అభూతకల్పన, శుద్ధ అబద్ధం. – నీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా.. ఈ వార్తను నిరూపించే సత్తా నీకుందా అని సూటిగా అడుతున్నాను.
నేను దమ్ము, ధైర్యంతో చెబుతున్నా. ఇందులో ఒక్క రూపాయి అవినీతికి పాల్పడితే.. నా మంత్రి పదవిని త్యజించడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ఛాలెంజ్ ను రామోజీరావు స్వీకరించాలి. దీనిపై చర్చించేందుకు నేను ఎక్కడికి రావడానికి అయినా సిద్ధంగా ఉన్నాను.
ఈ వార్త నిజం కాకపోతే నువ్వు ఈనాడు గ్రూప్ సంస్థలకు రాజీనామా చేయగలవా? రాజీనామా చేసి నీ వారసులకు ఆ పదవి అప్పగించగలిగే సత్తా నీకుందా రామోజీరావు?
పేపరు ఉందని కదా అని పనికిమాలిన వార్తలు రాయడం సరికాదు. ఏదో ఒకటి సృష్టించి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారు.
చింతకాయల వెనుక బాబు ఉన్నా జైలుకు వెళ్తాడు
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
టీడీపీ అధికార వెబ్సైట్ ఐ-టీడీపీలో మహిళలను కించపరిచేలా పెట్టిన పోస్టింగ్‌లను చూస్తే .. చంద్రబాబు నాయుడు ఈ చర్యలను ప్రోత్సహించినట్లే. దీనివెనక చంద్రబాబు ఉంటే చింతకాయల విజయ్‌తో పాటు బాబు కూడా జైలుకు పోవడం ఖాయం.