-వేరే దేశాల్లోనైతే రేవంత్ చేసిన తప్పుకు ఉరి శిక్షలు వేసే వారు
– బీ ఆర్ ఎస్ వి రాష్ట్ర సదస్సు లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి . జగదీష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ పై కుట్రలు చేస్తున్నారు. రేవంత్ చంద్రబాబు మోడీ లు కలిసి వచ్చినా కేసీఆర్ ను ఏం పీక లేరు.ఇంటి దొంగలు తెలంగాణ నీళ్లు తెలంగాణ కు దక్కకుండా చేస్తున్నారు.
విద్యార్ధి ఉద్యమాలే అనేక సందర్భాల్లో ప్రజలకు హక్కులు సాధించి పెట్టాయి. ఇందిరా గాంధీని దించింది విద్యార్ధి ఉద్యమాలే. విద్యార్థులు ఆందోళన బాట పడితే ఆపడం ఎవరి తరం కాదు. కంచె గచ్చి బౌలి భూముల విషయం లో విద్యార్థులు పట్టుదలతో పోరాడి విజయం సాధించారు. బంగ్లాదేశ్ లో ప్రధానిని పదవి నుంచి దించింది విద్యార్ధి ఉద్యమమే
రేవంత్ రెడ్డి గురుకులాల్లో వంద మంది విద్యార్థుల చావుకు కారణమయ్యారు.రేవంత్ రెడ్డి యే విద్యాశాఖ మంత్రి కూడా. వేరే దేశాల్లోనైతే రేవంత్ చేసిన తప్పుకు ఉరి శిక్షలు వేసే వారు. గురువు చంద్రబాబు లాగే శిష్యుడు రేవంత్ రెడ్డి లేని గొప్పలు చెప్పుకుంటున్నారు. కాళేశ్వరం మేడిగడ్డ లో చిన్న లోపం ఏర్పడితే ఎన్ డి ఎస్ ఏ ను పంపించి విశయం పెద్దది చేసింది మోడీయే.
కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవి తో సంతోషపడితే తెలంగాణ వచ్చేదా ? విద్యార్ధి లోకం కేసులకు భయపడుతుందా ? విద్యార్ధి సమస్యలపై బీ ఆర్ ఎస్ వి ఉద్యమించాలి. గోదావరి జలాలు రాజకీయ సమస్య కాదు .మన బతుకు దెరువు సమస్య. బనక చర్ల తో తెలంగాణ కు నష్టం కనుక విద్యార్థులు కూడా పోరాడాల్సిందే. అక్రమంగా అరెస్టులు చేస్తే విద్యార్థులు పోలీస్ స్టేషన్ కు చీమల దండులా కదలాలి.