-జగన్ వైపే జనం మొగ్గు
-వెల్లడించిన జాతీయ సర్వే
-పోలవరం టూర్లంటూ కోట్లధనం దుర్వినియోగం చేసిన చంద్రబాబు
ఎంపీ విజయసాయిరెడ్డి
ఇండియా టీవీ దేశ్ కి ఆవాజ్ పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 లోక్సభ స్థానాలను, 133 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని ప్రకటించిందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు అన్నారు. రాబోయే 20 నెలల్లో వైఎస్ఆర్ సిపి చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం ప్రచారంతో 150కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని ఆయన అన్నారు. పలు అంశాలపై ఆయన ఆదివారం ట్విట్టర్ వేదికగా స్పందిచారు.
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు మరో ఛాన్సిస్తే పోలవరం పూర్తి చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందని, 14 ఏళ్లు సీఎంగా ఉండి పోలవరం గట్లపై గడ్డి కూడా పీకలేకపోయడని మండిపడ్డారు. అదికారంలో ఉండగా ప్రతి సోమవారం పోలవరం టూర్లువేసి కోట్లు ప్రజాధనాన్ని లూటి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల కాలంలో 95% హామీలు నెరవేర్చిన వైఎస్ఆర్ సీపీపైన…… అసలు మేనిఫెస్టోను అమలు చేయకుండా, పార్టీ వెబ్ సైట్ నుండి తొలగించిన తెలుగుదేశంపార్టీ విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు.
ముందే పూర్తయిన కృష్ణానది రిటైనింగ్ వాల్
కృష్ణా నది ముంపు నుంచి రక్షణకు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తలపెట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయిందని ఆయన వెల్లడించారు. అనుకున్న దానికంటే ఆరు నెలల ముందే రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసి తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరూపించారని చెప్పారు.