-వైసీపీ పేటీఎంకి అసలు ఇండిగో ఇష్యూ లో ఆకు, పువ్వు తెలియదు
జీవితంలో ఎయిర్పోర్ట్ మొహం చూడని వాడు కూడా మాట్లాడుతున్నాడు.. ఒకసారి ఫ్లైట్ ఎక్కనోడు కూడా రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని వాగటమే.
మాట్లాడే మందకి ..మరీ ముఖ్యంగా వైసీపీ పేటీఎం గాళ్లకి అసలు ఇండిగో ఇష్యూ లో ఆకు, పువ్వు తెలియదు.. వాగేయడమే.. రాజీనామా చేసేయాలి అని గోల చేయడమే
* * *
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాణికుల సేఫ్టీ కోసం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) అనే పాలసీను 2024 జనవరిలో తీసుకొచ్చింది.ఈ కొత్త రూల్స్ వలన అప్పటిదాక విజయవాడ కోదాడ సర్వీసుల్లా తిరిగే ఎయిర్లైన్స్ అన్ని వాటి పైలట్స్ కి రెస్ట్ అవర్స్ నైట్ ల్యాండింగ్స్ లో మార్పులు వచ్చాయి..
Fdtl రూల్ రాకముందు వారానికి 36 గంటలు రెస్ట్ అవర్స్ గా ఉంటే కొత్త రూల్స్ వలన 48 గంటల కంటిన్యు రెస్ట్ అవర్స్ ఇవ్వలసి వస్తుంది.అంటే వారంలో 5 రోజులు మాత్రమే పైలట్ డ్యూటీ లో ఉంటాడు. దీనితో పాటు నైట్ డ్యూటీ & ల్యాండింగ్స్ లో కూడా మార్పులు చేసింది.
పాత రూల్స్ ప్రకారం నైట్ అంటే 12am-5am గంటల మధ్య టైం గా ఉండేది దీనివలన నైట్ డ్యూటీ టైమ్ పైలట్ ల మీద తక్కువగా ఉండేది..నైట్ ల్యాండింగ్ మీద కూడా లిమిట్ అనేది అంతగా ఉండేది కాదు..కానీ కొత్త రూల్స్ ప్రకారం నైట్ టైమ్ ను 10pm -6am గా మార్చారు.. దీని వలన పైలట్స్ నైట్ డ్యూటీ టైమ్ ఎక్కువ అవ్వడం..నైట్ ల్యాండింగ్ ను కూడా వారానికి 2 సెక్టర్లు గా తగ్గించడం జరిగింది. ఇదో పెద్ద డ్రా బ్యాక్ అయ్యింది ఇండిగో కి..
పైలట్ రెస్ట్ అవర్స్ లో కూడా డ్యూటీ కి డ్యూటీ కి మధ్యన పాత రూల్స్ ప్రకారం 10 గంటలుగా ఉండేది ఇన్క్లూడింగ్ ట్రావెల్ టైమ్.. కొత్త రూల్స్ ప్రకారం డ్యూట్ కి డ్యూటీ కి మధ్యన 12 గంటలు స్ట్రిక్ట్ గ్యాప్ పెట్టారు.
ఈ రూల్స్ అన్ని ఒక రోజులో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయలేదు.. ఫేజ్ వైస్ గా ఎయిర్లైన్స్ ను రూల్స్ ను ఇంప్లిమెంట్ చేయడానికి అలెర్ట్ చేస్తూనే ఉంది.. జూన్ 2025 లో పైలెట్ రెస్ట్ రూల్స్ ను ఇంప్లిమెంట్ చేసింది.. ఈ డిసెంబర్ మొదటికి నైట్ డ్యూటీ అవర్స్ నైట్ ల్యాండింగ్ రూల్ ను ఇంప్లిమెంట్ చేయడానికి డెడ్ లైన్ పెట్టింది.
దేశంలో ఉన్న అన్ని ఎయిర్ లైన్స్ కొత్త రూల్స్ ప్రకారం తమ స్టాఫ్ ను పెంచుకోవడం తమ స్టాఫ్ డ్యూటీస్ అడ్జస్ట్ చేసుకోవడం చేశాయి.. ఒక్క ఇండిగో మాత్రమే చేయలేదు.. రోజుకి 2200 ఫ్లైట్స్ నడిపే ఇండిగో ఎయిర్లైన్స్ సడన్ గా చేతులు ఎత్తేసింది..
ఈ టోటల్ ఎపిసోడ్ లో సివిల్ ఏవియేషన్ మినిష్టర్ గా రామ్మోహన్ నాయుడు తప్పు 1% కూడా లేదు. ఇండిగో చేసిన తప్పుకి రామ్మోహన్ నాయుడిని అనటం సునకానదమే.. పేరుకు గొప్ప కేంద్ర మంత్రి పదవి కానీ దాని బడ్జెట్ 2400 కోట్లు.. స్టేట్ లో ఏ మంత్రి శాఖ బడ్జెట్ అయినా అంతకంటే ఎక్కువే ఉంటుంది.
38ఏళ్ల వయసులో కేంద్ర మంత్రిగా ఉన్నా చాలా సాదా సీదా గా ఉండే వ్యక్తి తాను. సిక్కోలు నుండి వెళ్ళిన కుర్రోడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు అని సంతోషించక పోగా.. ఆకాశంలో తప్ప ఎప్పుడూ విమానం మొహం కూడా చూడని వేలిముద్ర బ్యాచ్ కూడా, అతన్ని విమర్శించడం చూస్తుంటే.. పార్లమెంట్ లో జగన్ బ్రతుకును తన వాక్పటిమతో దేశ వ్యాప్తం చేశాడనే కడుపు మంట కనపడుతుంది.
– రాజావెంకటాద్రి తలపనేని