– చంద్రబాబును కలిసిన మంత్రి రాజా గన్మెన్ల బాధితురాలు
– పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చిన బాబు
అమరావతి: కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ పార్టీ కార్యాలయం లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ను కలిశారు. తన బిడ్డ వైద్యం కోసం తన ఆస్తి అమ్ముకునే విషయం లో మంత్రి దాడిశెట్టి రాజా మనుషులు, గన్మెన్ లు తనకు అడ్డుపడిన విషయాన్ని వివరించారు. CMO అధికారులు కూడా తనకు న్యాయం చేయలేదని చెప్పారు.
కన్నబిడ్డ ఆరోగ్యం కోసం గత కొంత కాలంగా పోరాడుతున్న ఆరుద్ర..తన గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గతంలో ఆత్మహత్యాయత్నం చేశారు. న్యాయం కోసం నిరసనలు చేస్తే తమ కుటుంబంపై పిచ్చివాళ్లమనే ముద్ర వేసి నరకం చూపిస్తున్నారంటూ చంద్రబాబు వద్ద ఆరుద్ర వాపోయింది. పార్టీపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని చంద్రబాబు ఆమెకు హామీ ఇచ్చారు.