– మంత్రి పొన్నం ప్రభాకర్
గాంధీ భవన్: టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిందని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడం పై చర్చించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఉపాధ్యక్షుడు అలామ్ ఖాన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఓటు చోరీ కి సంబంధించినా అంశాల పై రాహుల్ గాంధీకి మద్దతుగా కార్యక్రమాలు తీసుకోవడం… పీసీసీ అధ్యక్షుడు సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టంబర్ 15 న కామారెడ్డి లో వారికి అభినందన సభ ఉంటుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు కి అభినందనలు చేస్తూనే బీసీ డిక్లరేషన్ జరిగిన కామారెడ్డి కేంద్రంగా బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ల పై ప్రభుత్వం తీసుకున్న చర్యల పై వివరిస్తామని, బీజేపీ కడుపుల్లో కత్తులు పెట్టుకొని రిజర్వేషన్లు అడ్డుకుంటున్న అంశాల పై ప్రజలకు వివరిస్తామని తెలిపారు. కాగా, ఎఐసిసి ఇంచార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్ లు ఆ సమావేశంలో పాల్గొన్నారు.