విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థాను ములయన్ జి
ప్రతి ఒక్కరూ దేశభక్తి.. జాతీయత కలిగి ఉండాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థాను మలయన్ గారు అన్నారు. వీర సావర్కర్ దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు.
భారతదేశ స్వాతంత్ర సమరయోధులు వినాయక్ దామోదర్ సావర్కర్ 140 వ జయంతిని విశ్వహిందూ పరిషత్ ఘనంగా నిర్వహించింది. ఆదివారం భాగ్యనగర్ లోని కాచిగూడలో గల సావర్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి స్థాను మలయన్ గారు మాట్లాడారు. దేశం కోసం వీర సావర్కర్ చేసిన పోరాటం నేడు ప్రతి భారతీయుడు తెలుసుకోవాలన్నారు. ఆంగ్లేయులు విధించిన అతి భయంకరమైన శిక్షణ అనుభవించి దేశం కోసం పోరాడిన మహనీయుడు సావర్కర్ అని కొనియాడారు.
అండమాన్ జైల్లో క్రూరమైన శిక్షణ విధించినా ఈ మాత్రం వెరవకుండా పోరాడిన మహనీయుడు సావర్కర్ అన్నారు. సావర్కర్ పుస్తకం చదవాలని.. లేదంటే సావర్కర్ సినిమా చూడాలని ఆయన ప్రజలకు సూచించారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు పండరీనాథ్ , జగదీశ్వర్ , పగుడాకుల బాలస్వామి, శివరాములు, పిట్ల స్వామి, వెంకట్ తదితరులు హాజరై సావర్కర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.