నాలుగు అంతస్తుల్లో 29,548 చదరపు అడుగుల్లో నిర్మించబడిన ఈ కార్పొరేట్ స్థాయి భవనం, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడింది. జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక అంతస్తుతో పాటు, రెండంతస్తుల్లో కలిపి 250 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్, తదితరులకు ప్రత్యేక గదులు ఈ భవనంలో కలవు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ వల్ల, జర్నలిస్టుల సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. త్వరలో మీడియా అకాడమీ భవనం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించబడుతుందని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.