Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకు మతి భ్రమించింది… అందుకే పిచ్చి వాగుడు

-వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ తానే కట్టాడంట
-ఎయిర్‌పోర్టుకు భూసేకరణ చేస్తే, వైయస్సార్‌ నిర్మించాడట
-మహా నగరాలతో అమరావతిని పోలుస్తున్నాడు
-సొల్లు కబుర్లతో ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం
-వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని)

తాడేపల్లి: ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కొడాలి నాని ఇంకా ఏం మాట్లాడారంటే..:
చంద్రబాబు సిగ్గులేని మాటలు:
అమరావతి మీద ఒక పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ, దాని తోక పార్టీలు ఆవిష్కరించాయి. హైదరాబాద్‌ను తానే కట్టానని, తాను మొదలు పెట్టిన వాటిని ఎవరూ ఆపలేదని ఆ సమావేశంలో చంద్రబాబు అన్నారు.
చంద్రబాబుకు పిచ్చి పరాకాష్టకు చేరింది. హైదరాబాద్‌ను చంద్రబాబు నిర్మించడం మొదలు పెట్టారా? ఆయన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి, 1995 సెప్టెంబరు 1న సీఎం అయినప్పుడు హైదరాబాద్‌ నగరం లేదా? ఆయన నగర నిర్మాణం మొదలు పెట్టడం ఏమిటి? దాన్ని వైయస్సార్‌గారు పూర్తి చేయడం ఏమిటి? చంద్రబాబుకు కనీసం సిగ్గు శరం లేదు.

మతి భ్రమించి పిచ్చి వాగుడు:
హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయానికి తాను భూసేకరణ చేస్తే, వైయస్సార్‌ దాన్ని కట్టాడని చంద్రబాబు అన్నాడు. నిజానికి ముఖ్య నగరాల శివార్లలో పెద్ద విమానాశ్రయాలు నిర్మించాలని నిర్ణయించిన కేంద్రం, ఆనాడు భూసేకరణ చేయాలని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరాయి.
మరి ఇక్కడ చంద్రబాబు భూసేకరణ చేస్తే, బెంగళూరు, చెన్నైలో కూడా ఆయనే సేకరించాడా? అన్నీ తానే నిర్మించానని చెబుతున్న చంద్రబాబుకు మతి పూర్తిగా భ్రమించింది. ఒకడే ఒకడు సినిమా డైరెక్టర్‌ కూడా తనను స్ఫూర్తిగా సినిమా తీశాడని పిచ్చి వాడిలా అన్నాడు. వినేవాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెబుతాడు. పగటి వేషగాడి మాదిరిగా పిచ్చి వాగుడు. చంద్రబాబుకు మతి భ్రమించి పిచ్చి వాగుడు వాగుతున్నాడు.

పిచ్చి ఎక్కి.. పిట్టలదొర:
ఇక్కడ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు ప్రచారం చేసిన గ్రాఫిక్స్‌ను కంటిన్యూ చేయాలా? నీ మాదిరిగా రెండేళ్లకోసారి గ్రాఫిక్స్‌ మారుస్తూ చూపాలా? నీ వారసుడిగా ఆయన ఆ పని చేయాలా?
చంద్రబాబుకు పిచ్చి ఎక్కి, పిట్టలదొరగా మారి, ప్రజలను మోసం చేసి, అమరావతి రైతులను వెన్నుపోటు పొడిచి, ఈ రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టి, మరోసారి మోసం చేయొచ్చన్న దురాలచనతో మళ్లీ అధికారం పొందొచ్చు అని 2019 ఎన్నికల్లోకి వస్తే, ఆయన ఒక మోసగాడని ప్రజలు తేల్చి చెప్పారు. మమ్మల్ని మోసం చేశావు అని చెప్పి ప్రజలు ఆయనను లాగి గూబ మీద కొడితే, 23 సీట్లకు పరిమితం అయ్యాడు. అయినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు.
అమరావతిని మహా నగరం కింద దేశంలో అన్ని ముఖ్య నగరాలు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై. హైదరాబాద్‌లను దాటించి, మొదటి స్థానంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నించాడట. సిగ్గుందా అలా మాట్లాడడానికి?
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయింది. స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో ఉన్న మహానగరాలు అప్పటి మద్రాస్, బాంబే, కలకత్తానే కదా. ఢిల్లీ రాజధానిగా ఎదిగిన తర్వాత అది పెద్ద నగరంగా నిల్చింది. ఆ తర్వాత మిగిలిన నగరాలు నిల్చాయి. హైదరాబాద్‌ కూడా ఒక మహానగరంగా నిల్చింది. దేశంలో 29 రాష్ట్రాలు, పలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 75 ఏళ్ల తర్వాత కూడా, అంతకు ముందు కూడా 5 ముఖ్య నగరాలు కాకుండా, ఏ నగరం ఆ స్థాయికి ఎదిగిందో చెప్పండి.

గ్రాఫిక్స్‌తో రైతులకు ఆశలు:
చంద్రబాబు గ్రాఫిక్స్‌ చూపి, అమరావతి రైతులకు ఆశలు చూపి, ఆశల పల్లకి ఎక్కించి, మంచి పంటలు పండే భూములను తీసుకున్నాడు. వారిని మభ్య పెట్టాడు. అందుకు హైదరాబాద్, సైబరాబాద్, కోకాపేట అంటూ ఏవేవో కబుర్లు చెప్పాడు. హైదరాబాద్‌ను తానే నిర్మించానని చెప్పి, ఇక్కడి రైతుల పొలాలు తీసుకుని వారిని మభ్య పెట్టాడు. నగరం కోసం దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.
పెద్ద పెద్ద రోడ్లు, లేఅవుట్లు పూర్తి చేస్తే, ఒక ఎకరంలో కనీసం సగం పోతుంది. అంటే మొత్తం 32 వేల ఎకరాల్లో నికరంగా మిగిలేది కేవలం 16 వేల ఎకరాలు మాత్రమే. అందులోనే రైతులకు ప్లాట్లు ఇవ్వాలి. 1250 గజాల చొప్పున ఇవ్వాల్సి ఉంది. అవన్నీ పోతే మిగిలేది 6 వేల ఎకరాలు మాత్రమే. దాంట్లోనే సింగపూర్‌ కంపెనీతో పాటు, పలు సంస్థలకు వందల ఎకరాల భూములు కేటాయించగా, ప్రభుత్వానికి మూడు, నాలుగు వేల ఎకరాలే మిగిలింది. దాన్ని ఎకరం 4 కోట్లు, 5 కోట్లకు అమ్మితే వచ్చేది ఎంత? మరి అలాంటప్పుడు 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నగరాన్ని ఎలా కడదామనుకున్నాడు.

దాని వల్ల ఎందరికి ప్రయోజనం?:
రాష్ట్రంలోని 5 కోట్ల మందిని అనాధలను చేసి, అన్ని సంపదలను గాలికి వదిలేసి, రాష్ట్ర సంపదను మొత్తం తెచ్చి ఒకే దగ్గర ఖర్చు పెడితే, దాని వల్ల నిజంగా ఎంత మంది లబ్ధి పొందుతారు. అక్కడ భూములు ఇచ్చిన 29 గ్రామాలకు చెందిన రైతులకు తప్ప. అంటే 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు తప్ప.
అలా ఒకే చోట రాష్ట్ర సంపదను మొత్తం ఖర్చు చేస్తే, మిగిలిన చోట్ల ఒక్క అభివృద్ధి పని కూడా చేయకపోతే, రాష్ట్రమంతా దివాళా తీయదా?
ఇవాళ శ్రీలంక ఎలా పతనమైందో అందరికీ తెలుసు.

పాదయాత్రలతో కోట్లు:
ఫోర్‌ ట్వంటీ, దుర్మార్గుడు అయిన చంద్రబాబు, అమరావతి అని చెప్పి ఒక గ్రాఫిక్‌ రిలీజ్‌ చేసి, అక్కడి రైతులను మోసం చేసి, వారి పొలాలన్నీ తీసుకుని, 5 ఏళ్లు ఒక్క పని కూడా చేయకుండా సొల్లు కబుర్లు చెప్పాడు. ఏమన్నా అంటే తాత్కాలిక సచివాలయం. తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పి కట్టి, ఏదీ పూర్తి చేయకుండా వదిలేశాడు.
అలా రైతులను మోసం చేసిన చంద్రబాబు, ఇవాళ పాదయాత్ర అని చెప్పి రైతులను రోడ్ల వెంట తిప్పుతున్నాడు. తిరుపతి–1 పాదయాత్ర. దాని వల్ల రూ.100 కోట్లు వచ్చాయి. అవన్నీ చంద్రబాబుకు ఇచ్చారు.
ఇప్పుడు అమరావతి నుంచి అరసవెల్లి వరకు యాత్ర అంటున్నారు. దాని వల్ల కూడా మరో రూ.100 కోట్లు వస్తాయి. అవి కూడా చంద్రబాబుకు ఇస్తారు.

మహానగరాలతో అమరావతికి పోలిక!:
దేశంలో మహా నగరం ఢిల్లీ. అది గ్రేటర్‌ నగరం. అక్కడ ఏకంగా 72 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఢిల్లీ మహా నగరానికి 72 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అదే విధంగా ముంబై నగరానికి 39 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇక కోల్‌కత్తాకు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో 24 మంది ఎమ్మెల్యేలు. చెన్నై 29 మంది ఎమ్మెల్యేలు. బెంగళూరులో కూడా దాదాపు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఆ మహా నగరాలన్నింటిలో కనీసం 25 మంది ఎమ్మెల్యేలతో పాటు, పలు కార్పొరేషన్లు ఉంటాయి. కానీ మనకు ఇక్కడ అమరావతిలో ఉన్నవి ఎన్ని నియోజకవర్గాలు. తాడికొండ నియోజకవర్గంలో అయిదారు మండలాలు ఉన్నాయి. దాదాపు 29 గ్రామాలు.
ఇలాంటి రాజ«ధాని ప్రాంతాన్ని, ఆ మహా నగరాలతో పోల్చి, వారికి ఆశలు కల్పిస్తున్న ఫోర్‌ ట్వంటీ చంద్రబాబును ఏమనాలి? ఒక మండలంలో ఉన్న గ్రామాలను ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌తో పోలుస్తాడు. దాదాపు 30 నియోజకవర్గాలు ఉన్న నగరం ఎక్కడ? 29 కుగ్రామాలు ఉన్న అమరావతి ఎక్కడ?

ఆ నగరాలది 100 ఏళ్ల చరిత్ర:
ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తే, మహా నగరంగా అభివృద్ధి చెందుతుంది?.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా నగరాలకు ఎన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్‌కు 400కు పైగా ఏళ్ల చరిత్ర ఉంది. కానీ ఈ ఫోర్‌ ట్వంటీ ఏం మాట్లాడుతున్నాడు. తాను మొదలుపెడితే, జగన్‌ ఆపేశారని, లేకపోతే అమరావతి ముంబై మాదిరిగా మారేదని సొల్లు కబుర్లు చెబుతున్నాడు.

ఇప్పుడు ఎందుకీ యాత్ర?:
ఇప్పుడు పాదయాత్ర ఎందుకు తలపెట్టారు? అక్కడి వారిని రెచ్చ గొట్టడానికి తప్ప. అక్కడ అల్లర్లు జరిగితే, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు తాత కూడా పుట్టక ముందే హైదరాబాద్‌ నగరం ఉంది. ఆయన ఆ నగరాన్ని కట్టడం ఏమిటి?
వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. చంద్రబాబు ఆ ప్రాంతాల వారిని రెచ్చగొట్టడం కోసం చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఆయన మాయలో పడొద్దని అందరినీ కోరుతున్నాను.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
అప్పుడు అలా.. ఇప్పుడిలా!:
చంద్రబాబు సీఎంగా ఉంటే, ఎవరి పాదయాత్రకు అనుమతి ఉండదు. చివరకు ఆనాడు జగన్‌ కూడా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. ఆనాడు కిర్లంపూడి నుంచి అమరావతికి పాదయాత్ర చేస్తానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోరితే, చంద్రబాబు అనుమతి ఇవ్వలేదు. తమను బీసీల్లో కలపాలని ఆయన పాదయాత్ర తలపెట్టినా, ఆనాడు చంద్రబాబు ఎందుకు అనుమతి ఇవ్వలేదు. ఆయన కోర్టుకు పోయినా అనుమతి రాలేదు.
ఇవాళ పోలీసులు అనుమతి ఇవ్వకపోతే, వెంటనే కోర్టుకు వెళ్తారు. గంటలో అనుమతి వస్తుంది. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉంటే, ఆయన అనుమతి ఇవ్వడు. కోర్టుకు వెళ్లినా అనుమతి రాదు. కానీ ఇప్పుడు విచిత్రంగా కోర్టుకు పోగానే గంటలో అనుమతి వస్తుంది. దీని వెనక మర్మం ఏమిటన్నది ఎవరికీ తెలియదు.

పిచ్చి ఆరోపణలు:
జగన్‌ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఆయన వల్ల వ్యవస్థలు దెబ్బ తిన్నాయని చెప్పడానికి విపక్షాలకు ఎక్కడా అవకాశం ఉండడం లేదు. అందుకే ఢిల్లీలో ఎక్కడో లిక్కర్‌ కుంభకోణం జరిగితే, పనికిమాలిన చంద్రబాబు, ఆయనకు ఎప్పుడూ అండగా ఉండే, పచ్చ మీడియా, దాన్ని మా భారతమ్మకు ఆపాదిస్తున్నారు. జగన్‌గారు, ఆయన భార్య ఢిల్లీకి వెళ్లి, లిక్కర్‌ కుంభకోణానికి పాల్పడతారా? అసలు ఏమైనా అర్ధం ఉందా?
ఏ దిక్కు మొక్కు లేని చంద్రబాబు పక్క రాష్ట్రానికి వెళ్లి అడుక్కోవాలి. తమకు వైన్‌షాప్‌లు ఇవ్వాలని కేసీఆర్‌ను, స్టాలిన్‌ను అడుక్కోవాలి. అసలు మాకేం ఖర్మ. ఢిల్లీకి వెళ్లి ఎందుకు అడుగుతాం? మా రాష్ట్రంలో పోలిస్తే, ఢిల్లీ ఎంత? అక్కడి మద్యం అమ్మకాలు ఎంత? జగన్‌, ఆయన భార్య ఢిల్లీకి వెళ్లి, అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? పనికి మాలిన దద్దమ్మలు. చవటలు.
భారతమ్మ ఫోటో పెట్టి, గంటలు గంటలు చర్చలు పెడుతున్నారు.
మాకు హెరిటేజ్‌ ఉంది. అక్కడ లిక్కర్‌ అమ్ముకుంటామని, ఈ ఫోర్‌ ట్వంటీ అడుక్కోవాలి.

జగన్‌ నిలువెత్తు నిప్పు:
జగన్‌ నిలువెత్తు నిప్పు. ఆయనకు ఒక్క అవ లక్షణం కూడా లేదు. ఆయనలో తప్పు పట్టాలని ఈ ఎల్లో మీడియా ఎంతో ప్రయత్నించింది. కానీ ఏం చేయలేక, ఇప్పుడు ఢిల్లీలో లిక్కర్‌ స్కామ్‌లో ఆయన పేరును, ఆయన భార్యకు ఆపాదిస్తున్నారు.
వైయస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు జగన్‌గారు అవినీతికి పాల్పడ్డారా? ఆయన లక్ష కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టి, అన్యాయంగా జైలుకు పంపారు. కానీ ఆయనను సీఎం కాకుండా ఆపగలిగారా? జగన్‌ని భ్రష్టు పట్టించాలని ఈ ఫోర్‌ ట్వంటీ, దిక్కు మాలిన ఎల్లో మీడియా నిరంతరం ప్రయత్నిస్తోంది.

పనికి మాలిన మాటలు:
జగన్‌గారి పనై పోయిందని, మళ్లీ తాను సీఎం అవుతానని చంద్రబాబు అంటున్నాడు. ఏమిటి ఆయన అయ్యేది. కనీసం ఎమ్మెల్యే కూడా కాడు. జగన్‌ పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన పనికి మాలిన çపప్పు లోకేష్‌ కూడా జగన్‌పై విమర్శలు చేస్తున్నాడు. అసలు ఆయనకు ఉన్న అర్హత ఏమిటి? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో గెలవడు. ఆయన కొడుకు మంగళగిరిలో గెలవడు.
420 చంద్రబాబు. ఎన్టీ రామారావు కూతురు భర్త. అదే ఆయనకు ఉన్న అర్హత. 210 లోకేష్‌. పనికి మాలిన ఫోర్‌ ట్వంటీ కొడుకు. కొందరు ఆడవారిని నా నియోజకవర్గానికి పంపించి, నన్ను తిట్టిస్తున్నారు. ఆ పని నేను చేయలేనా?

దమ్ముంటే అసెంబ్లీకి రమ్మనండి:
పనికిమాలిన యనమల రామకృష్ణుడు అంటున్నాడు. అసెంబ్లీ సమావేశాలు 20 రోజలు జరపాలంట. మేము రెడీ. ఆయనను చంద్రబాబుతో మాట్లాడమనండి. చంద్రబాబును అసెంబ్లీకి తీసుకు రమ్మనండి. లేనిపోని ఆరోపణలు చేసి, వాకౌట్‌ చేయకుండా సభలో ఉండమనండి. ఏడవొద్దని చెప్పండి. అన్నీ చర్చిస్తాం.
మీకు సభకు వచ్చే ధైర్యం లేదు. ఎంతసేపూ వాకౌట్‌ చేసి, బయట మాట్లాడడం, దిక్కు మాలిన ఎల్లో మీడియాలో చర్చలు పెట్టడం. అదే వారి పని అని మాజీ మంత్రి కొడాలి నాని వివరించారు.

LEAVE A RESPONSE