Suryaa.co.in

Andhra Pradesh

హజ్ యాత్ర అడ్వాన్స్ డిపాజిట్ గడువు పెంపు

– నవంబర్ 11 కు చివరి గడువు పొడిగింపు
– మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్

అమరావతి: దేశవ్యాప్తంగా హజ్ -2025 యాత్ర అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి చివరి తేదీని కేంద్ర హజ్ కమిటీ పొడిగింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

హజ్-2024లో తాత్కాలికంగా ఎంపిక చేయబడిన యాత్రికుల అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని రూ.1,30,300/- 21.10.2024 నాటి సర్క్యులర్ నెం.10 ప్రకారం 31.10.2024లోపు జమ చేయాల్సి ఉందన్నారు. అయితే అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని డిపాజిట్ చేసే తేదీని మరింత పొడిగించమని దేశంలోని వివిధ రాష్ట్ర హజ్ కమిటీలు, వివిధ సంస్థలు మరియు వ్యక్తుల నుండి అభ్యర్థనలు కేంద్ర హజ్ కమిటీకి వెళ్లాయని తెలిపారు.

కేంద్ర హజ్ కమిటీకి వచ్చిన వివిధ అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ హజ్ మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి చివరి తేదీగా నవంబర్ 11వ తేదీ ( 11.11.2024 23:59 గంటల) వరకు పొడిగించబడి నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు.

LEAVE A RESPONSE