Suryaa.co.in

Telangana

అయ్యప్ప దీక్షా దారులకు సదుపాయాలు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : అయ్యప్ప దీక్షలు చేపట్టి, శబరిమల యాత్రను నిర్వహించే భక్తులకు వివిధ సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ లోని దత్తాత్రేయ దేవాలయంలో అయ్యప్ప భక్తులకు స్థానికుడు సమ్మెట కిరణ్ నిర్వహిస్తున్న అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా312A8623 అయన మాట్లాడుతూ వివిధ సంఘాలు, సంస్థలు ఔదార్యంతో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయని, మానవ సేవే మాధవ సేవగా పరిగణించడం హర్షనీయమని పేర్కొన్నారు. ఆలయం ప్రాంగణంలో ఈ సందర్భంగా మొక్కలు నాటారు. దత్తాత్రేయ దేవాయలం ఛైర్మన్ దత్తు గుప్త, రామాలయం చైర్మన్ నోముల ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE