-సాగు నీరిచ్చి మేం సిరులు పండించాలనుకుంటే…జగన్ రక్తం పారిస్తున్నాడు
-కోస్తాంధ్రలో టీడీపీ హయాంలో ప్రాజెక్టులపై రూ.21,442కోట్ల ఖర్చు
-నాలుగేళ్లలో వైసీపీ ఖర్చు రూ.4,375కోట్లే…ప్రాజెక్టులు ఎలా పూర్తి అవుతాయి.
-కాలువల నిర్వహణ కూడా చేయలేని ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుందా?
-ఉత్తరాంధ్రలో వైసీపీ దోచేసిన రూ.40 వేల కోట్లతోఅన్ని ప్రాజెక్ట్ లు పూర్తి చేయవచ్చు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
అమరావతి:- రాష్ట్రంలో సాగునీటి రంగానికి జగన్ తీరని ద్రోహం చేశాడు. అసమర్థ సిఎం కారణంగా సాగునీటి ప్రాజెక్టులు అన్ని అటకెక్కాయి. ఉత్తరాంధ్రలోని వంశధార, నాగావళి, ఇటు గోదావరి, కృష్ణా, పెన్నా నదులతో పాటు, మొత్తం రాష్ట్రంలోని 69నదుల్ని అనుసంధానంచేస్తే, ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే అగ్రస్థా నంలో నిలుస్తుంది అని చంద్రబాబు నాయుడు అన్నారు. కోస్తాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్ పై గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…
ఉత్తరాంధ్రలోని నదుల అనుసంధాన ప్రక్రియే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి
వంశధార, నాగావళి కింద చంపావతి, గోస్తా, శారద, వరాహా, తాండవ, ఏలేరు వంటి అనేక ఉపనదులు ఉన్నాయి. వీటన్నింటి అనుసంధానానికి టీడీపీ ప్రభుత్వం ప్రణా ళికలు వేసింది. వంశధార నుంచి హీరమండలం అక్కడినుంచి నాగావళిని అనుసంధా నించడం ఒకటైతే, వంశధార నుంచి నేరుగా వరదకాలువద్వారా మహేంద్రతనయ, బా హుదా నదిని కలపడం. ఉత్తరాంధ్రలోని అన్ని నదుల అనుసంధాన ప్రక్రియే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. తూర్పుగోదావరి నుంచి విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదలవుతుంది. రాష్ట్రానికి అత్యంతకీలకమైన పోలవరంప్రాజెక్ట్ లో భాగమైన పురు షోత్తమపట్నం ఎత్తిపోతల పూర్తిచేసి ఏలేరుకు నీళ్లు తీసుకెళ్లాం. గోదావరి నీటిని ఉత్త రాంధ్రకు తీసుకెళితే, ఆ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది.
నిన్న రాయలసీమ సాగునీటిప్రాజెక్ట్ లపై మాట్లాడితే, చీఫ్ సెక్రటరీ హడావిడిగా సమీ క్ష చేశాడు. ముఖ్యమంత్రికి తీరికలేదు. ఇరిగేషన్ మంత్రి ఆంబోతులా అరుస్తాడు తప్ప ఏమీ తెలియదు. ఈ సంవత్సరాంతానికి 5 ప్రాజెక్టులు ప్రారంభిస్తామంటున్నారు. ఉత్తుత్తి సమీక్షలతో ఒరిగేదేంలేదు. ప్రాజెక్టులవద్దకు వెళ్లిచూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.
నేను మొత్తం ప్రాజెక్టుల స్థితిగతుల్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా, ఎప్పుడు ఎంతెంత పనులు జరిగాయో, ఎంతశాతం పూర్తయ్యా యో ప్రజలముందు ఉంచాను. రాష్ట్ర సాగునీటి రంగం, ప్రాజెక్ట్ ల నిర్మాణంపై సమాధా నంచెప్పండి. చెప్పలేకపోతే మీకు అధికారంలో కొనసాగే అర్హతలేదు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినట్టు ప్రవర్తి స్తున్నారు.
కోస్తాంధ్ర ప్రాజెక్ట్ లపై టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు. 2014-19 మధ్యన రూ.21,442కోట్లు ఖర్చు. వైసీపీ వచ్చాక 2019-23 మధ్య పెట్టిన ఖర్చు రూ.4,375కోట్లు. దీనిపై ఏం సమాధానం చెబుతారు?
కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల వివరాలు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి
మొత్తం ఆయకట్టు 8లక్షల ఎకరాలు, 30లక్షల మందికి తాగునీరు
టీడీపీ హయాంలో రూ.13కోట్లు ఖర్చుపెట్టాం. వైసీపీ రూ.780కోట్లు కేటాయించినట్టు పేపర్లపై చూపించి, అరకొరగా రూ.5కోట్లు ఖర్చుపెట్టారు. అతి ముఖ్యమైన ఈ ప్రాజెక్ట్ ని ఇలా చేసినందుకు సిగ్గుగాలేదా? మా పార్టీ నేత అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర గురించి రోజూ మాట్లాడేవాడు.
వంశధార ఫేజ్- 2
ప్రాజెక్ట్ ఫేజ్-1 పూర్తయింది.
మొత్తం ప్రాజెక్ట్ పరిధిలోని ఆయకట్టు 2,55,510 ఎకరాలు.
టీడీపీప్రభుత్వం రూ.871కోట్లు ఖర్చుపెడితే, ఈ ప్రభుత్వం రూ.352కోట్లు ఖర్చుపెట్టిం ది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణపరిస్థితి గడువు పెంచడం, తేదీలు మార్చడం. 2021 ఆగస్ట్, 2022 ఆగస్ట్, 2023 జూలై ఇప్పటికీ ఇలా మూడుతేదీలు మార్చారు. ఫలితం ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం.
సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ నిర్మాణం మొత్తం ఆయకట్టు 2,10,000ఎకరాలు. టీడీపీప్రభుత్వం రూ.236కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసింది. 2003లో టీడీపీప్రభుత్వమే శంఖుస్థాపన చేసింది. తిరిగి 2015లో నేనే ప్రాజెక్ట్ ప్రారంభించాను. అక్కడక్కడ మిగిలిపోయిన కొద్దిపాటి ప నుల్ని వైసీపీప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది.
రూ.56కోట్ల ప్రజలసొమ్ముని నీళ్లపా లు చేసింది. ప్రాజెక్ట్ లో నీళ్లున్నాయి..వాటిని కాలువలద్వారా పొలాలకు ఇవ్వలేకపో యారు. విజయనగరం జిల్లాకు ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం. తోటపల్లి బ్యారేజీ లో మిగిలిన అరకొర పనులుపూర్తిచేయలేని, అక్కడి మంత్రి ఏదేదో మాట్లాడుతుంటాడు.
మహేంద్ర తనయ ఆఫ్ షోర్
మొత్తం ఆయకట్టు 25,000 ఎకరాలు
టీడీపీప్రభుత్వం రూ.553కోట్లు ఖర్చుపెడితే, వైసీపీ ప్రభుత్వం పెట్టింది కేవలం రూ.9 కోట్లు. ఐదేళ్లు అవుతోంది, కానీ ప్రాజెక్ట్ లో 5శాతం పనిజరగలేదు.
రైవాడ రిజర్వాయర్
మొత్తం ఆయకట్టు 21,344 ఎకరాలు.
టీడీపీ రూ.30కోట్లు ఖర్చుపెడితే, వైసీపీ రూ.4కోట్లు ఖర్చుపెట్టింది. నాలుగేళ్లలో ఎక్కడా అంగుళం పని జరగలేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపేయడంతో, పనులు ఆపేసి వెళ్లిపోయారు. కాలువలు బాగుచేయకపోవడంతో, చివరి ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి.
తారకరామతీర్థ సాగర్
ఉమ్మడి రాష్ట్రంలో నేనే ప్రారంభించాను.
మొత్తం ఆయకట్టు 24,000ఎకరాలు. టీడీపీప్రభుత్వం రూ.103కోట్లు ఖర్చుపెట్టింది.
వైసీపీ రూ.56కోట్లు పెట్టినా పనులన్నీ నత్తనడకనే సాగుతున్నాయి. భూసేకరణ జాప్యం చేశారు. కాలువల ఆధునికీకరణకు నిధులివ్వలేదు. రిజర్వాయర్లో పెరిగిన పిచ్చిచెట్లను తొలగించలేకపోయారు.
హీరమండల రిజర్వాయర్
మొత్తం ఆయకట్టు 10,000ఎకరాలు
టీడీపీప్రభుత్వంలో 74శాతం పనులు పూర్తిచేశాం
నాలుగేళ్లుగా వైసీపీ తేదీలు మారుస్తుంది తప్ప, ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పలేని దుస్థితి.
పురుషోత్తమ పట్నం పోలవరం ఎడమకాలువ
మొత్తం ఆయకట్టు 2.15లక్షల ఎకరాలు
టీడీపీహాయాంలో రూ.1,578కోట్లు ఖర్చుపెట్టాం.
17 టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్ కు తరలించాం.
వైసీపీప్రభుత్వం రూ.126కోట్లు ఖర్చుపెట్టి, ప్రాజెక్ట్ ను ట్రిబ్యునల్ ముందు నిలిపింది. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ప్రాజెక్ట్ లను ట్రిబ్యునళ్ల ముందు నిలిపి, ప్రభుత్వం చో ద్యం చూస్తోంది. ప్రాజెక్ట్ ల వివాదాల్ని పరిష్కరించడంలేదుగానీ, తనసొంతకేసులు వాదించుకోవడానికి మాత్రం జగన్ వేలకోట్ల ప్రజలసొమ్ము తగలేస్తున్నాడు.
పట్టిసీమ ఎత్తిపోతల
13లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాం. ఇక్కడవాడిని నీటికి బదులుగా 120టీఎం సీల నీరు శ్రీశైలంలో నిల్వచేసి, ఆ నీటిని రాయలసీమకు తరలించాము. పులివెందుల కు కూడా నీళ్లిచ్చాం. పట్టీసీమ నీటితో సీమలో నేడు సిరులు పండుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.1600కోట్లు ఖర్చుపెట్టాం. 263 టీఎంసీల నీటిని పొలాలకు తరలించి, 40వేల కోట్ల విలువైన పంటఉత్పత్తులు సాధించాం.
తాడిపూడి
మొత్తం ఆయకట్టు 2.15లక్షల ఎకరాలు
టీడీపీ రూ.96కోట్ల ఖర్చుపెడితే, వైసీపీ రూ.27కోట్లు ఖర్చుపెట్టింది.
ప్రస్థుతం పనులన్నీ నిలేసి, తూర్పుగోదావరి జిల్లా రైతాంగానికి తీరని అన్యాయం చేశారు. ఎన్.జీ.టీలోని వివాదాల్ని పరిష్కరించలేకపోయారు.
పుష్కర లిఫ్ట్
మొత్తం ఆయకట్టు 1,85,000ఎకరాలు
టీడీపీహాయాంలో రూ.140 కోట్లు ఖర్చుపెట్టాం
వైసీపీ రూ.54కోట్లు ఖర్చుపెట్టి, కాంట్రార్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పనులు ఆపేసింది.
163 గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ ను ప్రశ్నార్థకంగా మార్చింది.
చింతలపూడి లిఫ్ట్
మొత్తం ఆయకట్టు 1,75,000ఎకరాలు
టీడీపీహయాంలో రూ.2,289కోట్లు ఖర్చుపెట్టాం
వైసీపీ రూ.650కోట్లు వెచ్చించి, నిధులులేవని భూసేకరణ నిలిపేసింది.
కృష్ణా-పశ్చిమగోదావరి రైతులకు లబ్ధికలిగించే లిఫ్ట్ ను గాలికి వదిలేసింది. నాగార్జున సాగర్ ఎడమకాలువ తెలంగాణ నుంచి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, నందిగా, మైలవరం, తిరువూరుకు వెళ్తుంది. 30టీఎంసీల నీళ్లురావాలి. ఒక్కసారి కూడా రాలేదు. ఆ ఇబ్బందులు అధిగమించడానికే చింతలపూడి లిఫ్ట్ ఏర్పాటుచేశాం.
పులిచింతల ప్రాజెక్ట్
మొత్తం ఆయకట్టు 13లక్షల ఎకరాలు
టీడీపీప్రభుత్వంలో రూ.1174కోట్లు ఖర్చుపెట్టాం
వైసీపీ రూ.40కోట్లు పెట్టి గేట్లు కొట్టుకుపోయేలా చేసింది. ప్రాజెక్ట్ గేట్లకు గ్రీజు కూడా రాయలేని ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వమేనా?
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్
మొత్తం ఆయకట్టు 4.60లక్షల ఎకరాలు. దీన్ని నేనే ప్రారంభించాను.
టీడీపీప్రభుత్వం రూ.1414కోట్లు ఖర్చుపెట్టింది
మేం వచ్చేనాటికి ప్రాజెక్ట్ మొత్తం అస్తవ్యస్తంగా ఉంది, కాంట్రాక్టర్లు మొండికేశారు.
వారిని దారిలోపెట్టి, ఒకటన్నెల్ పూర్తిచేశాం. నీళ్లిచ్చే సమయానికి ఈ ప్రభుత్వం వచ్చి, పనులన్నీ ఆపేసింది. కేంద్ర గెజిట్ లో వెలిగొండప్రాజెక్ట్ లేకపోతే, ఈ ప్రభుత్వం నోరెత్త లేదు. ఉమ్మడి ప్రకాశంజిల్లా నేతలు ఢిల్లీకివెళ్లి పోరాడారు.
వైసీపీ రూ.953 కోట్లు పెట్టింది. అధికారంలోకి వస్తానే ప్రాజెక్ట్ ను పూర్తిచేస్తామన్నారు. నాలుగేళ్లు అయింది.. ఏది? వెలుగొండ టన్నెల్లో తవ్విన మట్టిని శ్రీశైలం కొండల్లో పోస్తు న్నారు. దానివల్ల ప్రాజెక్ట్ లో సిల్ట్ పెరిగి జరిగే నష్టమే ఎక్కువ. దయచేసి ఇలాంటి పను లు చేయవద్దని చెబుతున్నా.
గుండ్లకమ్మ రిజర్వాయర్
మొత్తం ఆయకట్టు 80వేల ఎకరాలు
టీడీపీ హాయాంలో రూ.81కోట్లు ఖర్చుపెట్టాం
వైసీపీ రూ.22కోట్లు ఖర్చుపెట్టి, నిర్వహణను పట్టించుకోకపోవడంతో గేట్లు కొట్టుకుపో యాయి. అడ్డగోలుగా ఇసుకతవ్వేయడంతో మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడే పరిస్థితి.
సంగం బ్యారేజ్
మొత్తం ఆయకట్టు 3లక్షల ఎకరాలు
టీడీపీహయాంలో రూ.88కోట్లు ఖర్చుపెట్టాం. ప్రాజెక్ట్ ని 80శాతం పూర్తిచేశాం.
వైసీపీ వచ్చాక రూ.116కోట్లు పెట్టి, మిగిలినపనులు నాలుగేళ్లలో పూర్తిచేసింది. నిర్మాణానికి పెట్టిన ఖర్చు కంటే ప్రచారానికే ఎక్కువ పెట్టారు
నెల్లూరు బ్యారేజ్
మొత్తం ఆయకట్టు 2 లక్షల ఎకరాలు.
టీడీపీహాయాంలో రూ.80కోట్లు ఖర్చుచేసి, 90శాతం పనులు పూర్తిచేశాం.
వైసీపీ మిగిలిన పదిశాతంపనులు చేయడానికి రూ.67కోట్లు ఖర్చుపెట్టింది.
కృష్ణా డెల్టా ఆధునికీకరణ
టీడీపీహాయాంలో రూ.1239కోట్లు ఖర్చుపెట్టాం
వైసీపీ వచ్చాక రూ.204కోట్లు ఖర్చుపెట్టింది. ఆధునికీకరణ పనులు ఆపేయడంతో, ఇప్పటికీ లక్షలఎకరాల్లో నీటి ఎద్దడే. ఇదీ పరిస్థితి. ప్రాజెక్టుల్లో గుర్రపుడెక్క తీయడం లేదు. ఇరిగేషన్ మంత్రి సొంతనియోజకవర్గం సత్తెనపల్లిలో రైతులే చందాలు వేసుకొని కాలువలు బాగుచేసుకున్నారంటే పరిస్థితి ఎంతదారుణంగా ఉందో అర్థంచేసుకోండి.
గోదావరి డెల్టా ఆధునికీకరణ
టీడీపీ ప్రభుత్వం రూ.813కోట్లు ఖర్చుపెడితే, వైసీపీ రూ.123కోట్లు వెచ్చించింది.
గేట్లు సరిగా లేవు..అన్నీ లీకవుతున్నాయి. కొన్ని గేట్లు తుప్పుపట్టాయి. డ్రెయిన్ల నిర్వహణ పట్టించుకోకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదు.
గోదావరి కృష్ణా పెన్నా ఫ్లడ్ నియంత్రణ
టీడీపీ రూ.701కోట్లు ఖర్చుపెట్టింది. వైసీపీ వచ్చాక రూ.80కోట్లు పెట్టింది.
వరదనీటిని నియంత్రణకు చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేశారు. కాలువగట్లను బలోపేతంచేయకపోవడంతో పంటపొలాలు నీళ్లపాలవుతున్నాయి. పోలవరం ప్రధాన కుడికాలువలో మట్టిని గట్లకు వేయాల్సిన ఈ దొంగలు, దాన్ని అమ్ముకున్నారు. దాని వల్ల నీళ్లు పొలాల్లోకి, గ్రామాల్లోకి వెళ్లే దుస్థితి. ఇదీ ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టుల నిర్వహణ.
గోదావరి పెన్నా నదుల అనుసంధానం
ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గోదావరి నీటిని వైకుంఠపురం వద్దకు తీసుకెళ్లి, అక్కడి నుంచి పల్నాడుజిల్లా నకరికల్లులోని నాగార్జునసాగర్ ప్రధాన కుడికాలువకు నీటిని తరలించ డానికి మా ప్రభుత్వంలో టెండర్లు పిలిచాం. ఇదిపూర్తయితే సముద్రం పాలయ్యే 130టీఎంసీల గోదావరినీరు పెన్నానదికి, ఈ నీటిని చింతలపూడి నుంచి వచ్చే మరో 30టీఎంసీలు, శ్రీశైలం నుంచి మరో 130టీఎంసీలు, పట్టిసీమ నంచి మరో 120 టీఎంసీలు కలిపి మొత్తం 300టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించవచ్చు. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ ను కూడా నాశనంచేశారు.
నాలుగేళ్లు నిద్రపోయారు.. ఇప్పుడులేచి ఉద్ధరిస్తామంటున్నారు.
నిన్న చీఫ్ సెక్రటరీ హడావిడిగా సమీక్ష చేశాడు. గతంలో ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పినట్టే 5నెలల్లో 5ప్రాజెక్టులు పూర్తిచేస్తామని కట్టుకథలు చెప్పాడు.
వెలిగొండ ప్రాజెక్ట్, అవుకు టన్నెల్, వంశధార-నాగావళి అనుసంధానం,
గొట్టా బ్యారేజ్ రిజర్వాయర్, హంధ్రీనీవా ఫేజ్ – 2 పూర్తిచేస్తామంటున్నారు.
నేను మాట్లాడితే ఈ సీ.ఎస్. (చీఫ్ సెక్రటరీ) బయటకు వచ్చాడు. ముఖ్యమంత్రి, మంత్రులకు చేతగాక, సీ.ఎస్ ను పంపించారు.
మొత్తం ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో 198ప్రాజెక్టులు ప్రీక్లోజర్ చేశారు.. వాటిలో కోస్తాంధ్ర ప్రాజెక్టులు 96 ఉంటే, రాయలసీమలో 102 ఉన్నాయి. ఎందుకు ప్రీక్లోజర్ చేశారో, మరలా ఐదేళ్లకు టెండర్లు పిలవమని ఎందుకు చెప్పారో సమాధానం చెప్పండి.
ఎవరి హాయాంలో ఏ ప్రాజెక్ట్ నిర్మాణం ఎంతెంత పూర్తయింది
వంశధార ఫేజ్ -2 : టీడీపీహాయాంలో 79శాతం వైసీపీ హాయాంలో కేవలం 10శాతం (నాలుగేళ్లలో 21శాతం చేయలేకపోయారు.
తోటపల్లి బ్యారేజ్ : టీడీపీహాయాంలో 80శాతం, వైసీపీ కేవలం 3శాతం పనులుచేసింది.
పుష్కర లిఫ్ట్ : టీడీపీ 97శాతం పూర్తిచేసింది. వైసీపీ నాలుగేళ్లలో 1శాతం చేసింది
తాటిపూడి లిఫ్ట్ : టీడీపీహాయాంలో 68 శాతం చేశాం.. వీళ్లు 20శాతం చేశారు.
మద్దువలస స్టేజ్ -2 : టీడీపీ 72.6 శాతం పూర్తిచేస్తే, వైసీపీ కేవలం 6శాతం చేసింది.
నెల్లూరు బ్యారేజ్ : టీడీపీహాయాంలో 74 శాతం పూర్తయితే, వీళ్లు 23శాతం చేశారు.
పెన్నాడెల్టా ఆధునికీకరణ : టీడీపీ 89 శాతంపూర్తిచేస్తే, వైసీపీ కేవలం 2శాతం.
నాగావళి ఫ్లడ్ : టీడీపీహాయాంలో 46 శాతం పూర్తయితే, వైసీపీ 10శాతం చేసింది.
టీడీపీప్రభుత్వం పూర్తిచేసిన మొత్తం ప్రాజెక్టులు : 23.
32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాం.
నాలుగేళ్లలో వైసీపీ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు.
1. చిన్నసానఎత్తిపోతల పథకం – శ్రీకాకుళం జిల్లా
2. తోటపల్లి రిజర్వాయర్ – విజయనగరం జిల్లా
3. శారదానది ఆనకట్ట – విశాఖపట్నం
4. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల – తూర్పుగోదావరి
5. పట్టిసీమ – పశ్చిమగోదావరి
6. పోగొండ రిజర్వాయర్ – పశ్చిమగోదావరి
7. ఎర్రకాలువ ఆధునికీకరణ – పశ్చిమగోదావరి
8. కొండవీటి వాగు – గుంటూరు జిల్లా
9. పెదపాలెం ఎత్తిపోతల పథకం – గుంటూరు జిల్లా
10. కే.ఎల్.రావు పులిచింతల ప్రాజెక్ట్ – గుంటూరు
11. గుండ్లకమ్మ కొరిశపాడు ప్రాజెక్ట్ – ప్రకాశం జిల్లా
12. కండలేరు ఎడమకాలువ – నెల్లూరుజిల్లా వీటితో పాటు మొత్తం 23ప్రాజెక్టులు పూర్తిచేశాం. వైసీపీ హాయాంలో కొత్తగా ఒక్కప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టలేదు. ఒక్క ప్రాజెక్ట్ పూర్తిచేయలే దు. అదనంగా నాలుగేళ్లలో ఒక్కఎకరాకు నీరివ్వలేదు. అసమర్థుడు ముఖ్యమంత్రి అయితే ప్రాజెక్టులు అయినా, ప్రజలైనా ఇదే పరిస్థితి.
మేం నీళ్లిచ్చి సిరులు పండించాలనుకుంటే, వీళ్లు రక్తం పారిస్తున్నారు. రౌడీయిజం కాపాడుతుంది అనుకుంటున్నారు. ప్రజలు తిరగబడితే అదే రౌడీయిజం మిమ్మల్ని దహిస్తుంది.
విశాఖపట్నం కేంద్రంగా ఈ నాలుగేళ్లలో ఉత్తరాంధ్రలో రూ.40వేలకోట్లు దోచుకున్నారు. అదే 40వేలకోట్లతో ఉత్తరాంధ్రలోని అన్నిప్రాజెక్టులు పూర్తిచేసి, మొత్తంభూములకు నీళ్లు ఇవ్వవచ్చు. ఉత్తరాంధ్ర మంత్రులుదోపిడీలో, అవినీతిలో భాగస్వాములు అయ్యా రుగానీ, ప్రజలమేలుకోసం ప్రాజెక్టులనిర్మాణంలో భాగంకాలేకపోయారు.
నాలుగేళ్లలో రాష్ట్రంపై రూ.10లక్షలకోట్ల అప్పులు వేశారు. మీ పాపాల్ని భవిష్యత్ తరాలు మోయాల్సిన దుస్థితి తీసుకొచ్చారు.
నాలుగేళ్లలో ప్రజలకు, రాష్ట్రానికి ఏంచేశారంటే సమాధానంలేదు. ఖనిజసంపద ఏమైం ది? భూములు, ప్రభుత్వఆస్తులు ఏమయ్యాయి? పెంచినపన్నులవల్ల వచ్చే ఆదాయం ఎటుపోతోంది? నిత్యావసరాలధరలుపెంచారు. పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో ఎక్కడా లేని విధంగా పెంచారు.ఇసుక అమ్ముకుంటున్నారు. కల్తీమద్యంతో ప్రజలప్రాణాలు తీస్తున్నారు. ఇన్నిచేస్తూ సిగ్గులేకుండా డబ్బులేదంటారా? నాలుగేళ్లలో రాష్ట్రంపై 10 లక్షలకోట్ల అప్పులభారం మోపారు. ఒక్కో రైతుకుటుంబంపై రూ.2.45లక్షల అప్పు వేశారు.
ప్రజలకు, రాష్ట్రానికి మంచిచేయడానికి డబ్బులు లేవంటారు..మరి మీపొట్టలు బాగానే పెరిగాయిగా! 5 ఏళ్లలో మీరుచేసిన ద్రోహానికి రాబోయే 10, 20ఏళ్లపాటు భవిష్యత్ తరాలు అప్పులు చెల్లించాలి. సంపదసృష్టికి నీరే కీలకమనే సత్యాన్ని విస్మరి రించారు.”అని మండి పడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.