Suryaa.co.in

Andhra Pradesh

వరద సాయంపై జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలు!

• సీఎం చంద్రబాబు కలెక్టరేట్ లోనే ఉండి శ్రమించారు
• బాధితులకు రూ. 139.75 కోట్ల వరద సాయం పంపిణీ
• సివిల్ సప్లయిస్ ద్వారా ఆదనంగా 63.60 కోట్ల విలువైన బియ్యం, సరుకుల పంపిణీ
• మొత్తంగా కలిపి రాష్ట్ర ప్రభుత్వం 203. 3 కోట్లు వరద సాయంగా వ్యయం
• ఈ వాస్తవాలు చూడని జగన్ రోతపత్రిక
• వరదసాయం పేరుతో 534 కోట్లు మింగేశారంటూ తప్పడు రాతలు
• కోటి 14 లక్షల భోజన ప్యాకెట్లకు 54.5 కోట్లు ఖర్చు చేస్తే రూ.368 కోట్లు అవినీతి చేశారని రోత రాతలు
• మంచినీళ్ల బాటిళ్ల కు మొత్తంగా ఖర్చు పెట్టింది కేవలం రూ.11 కోట్ల 22 లక్షలు
• రూ. 26 కోట్లు ఖర్చు దోచేసారంటూ జగన్ ముఠా విష ప్రచారం
• శానిటేషన్ లో రూ. 51 కోట్లు దుబారా చేశారంటున్న జగన్ ముఠా
• అసలు మొత్తంగా ఖర్చు చేసింది రూ.18 కోట్లు
• వినూత్నంగా డ్రోన్లను వినియోగించి లక్ష 23 వేల ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయించింది చంద్రబాబు సర్కార్.
• అర్బన్ కంపెనీ లాంటి సంస్థలతో ఒప్పందం చేసుకుని నీట మునిగి పాడైన వివిధ గృహోపకరణాలు, 10 వేలకు పైగా గ్యాస్ స్టవ్ లను ఉచితంగా బాగు చేయించిన ఘనత చంద్రబాబుదే..
• 25 కిలోల బియ్యంతో పాటు 6 రకాల నిత్యావసరాలను బాధిత కుటుంబాలకు గడప గడపకు పంపిణీ
• జగన్ రెడ్డి వలే ఎగ్ ఫవ్ లకు రూ. 3.5 కోట్లు
• సర్వే రాళ్లపై బొమ్మలు వేయడానికి రూ. 700 కోట్లు
• రంగులకు 3 వేల కోట్లు, సొంత ప్రతికకు అడ్వటైజ్ మెంట్లు అని రూ. 500 కోట్లు
• ఇలా మొత్తంగా రూ. 5 వేల కోట్లు విలాసాలకు, ప్రచార పిచ్చికి దుబారా చేసే నైజం ఎన్డీయే ప్రభుత్వానిది కాదు
• నేటి వరకు సొంత నిధులతో ఒక్క వాటర్ బాటిల్ కూడా వరద బాధితులకు అందించని జగన్ రెడ్డి..
• సెప్టెంబర్ 4వ తేదీన కేవలం కోటి రూపాయలు వరద సాయాన్న ప్రకటించారు
• నేటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వని చరిత్ర నీదికాదా జగన్ రెడ్డి?
• తాడేపల్లి ప్యాలస్ లో వరద సాయం పేరుతో వసూళ్లకు తెగబడి నీ ఖాజానా నింపుకొంటున్న విషయం వాస్తవం కాదా?
• నిప్పులు చెరిగిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

మంగళగిరి: వరద సాయంపై జగన్ ముఠా.. తన రోత ప్రతికను అడ్డుపెట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… విజయవాడలో కృషానది వచ్చిన వరదలు, కుండపోతగా కురిసిన వర్షాల వల్ల దాదాపు 12 లక్షల క్యూసెక్కుల వరదనీరు కృష్ణానది రావడం భయాందోళనలు కలిగించింది. ఆ సమయంలో వారి కష్టాన్ని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని ఆదుకోవడం కోసం కలెక్టరేట్ లోనే ఉండి 24 గంటలు అధికారులతో మాట్లాడతూ వారిని అప్రమత్తం చేసి, తగిన సూచనలు చేస్తూ ఆదేశాలిచ్చారు.

వయస్సును కూడా లెక్కచేయకుండా.. సెక్యూరిటీ సిబ్బంది వారిస్తున్నా.. పట్టించుకోకుండా మోకాలు లోతు నీళ్లలో పర్యటించడమే కాకుండా జేసీబీలు ఎక్కి, ట్రాక్టర్లు, పడవలు ఎక్కి, అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఆయన వరద నీళ్లలో ఏకరకంగా తిరిగారో ప్రపంచం మొత్తం చూసింది. ’యస్ దటీజ్ చంద్రబాబు నాయుడు‘. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకు కంటి మీద నిద్ర ఉండదు..ఇంటికి వెళ్లడానికి కూడా ఇష్టపడరు. ఆ కష్టాలు తీరే వరకు వారి దగ్గరే ఉంటారు అనేది రుజువైంది.

చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరును చూసి ప్రజలే ముఖ్యమంత్రి మన కోసం రేయనక పగలన కష్టపడుతున్నారని ఇంటింటికి వెళ్ళి వాళ్లకు సాయం అందించి వారికి ధైర్యం చెప్పారన్నారు. ఆ రోజున కష్టాల్లో ఉన్న లక్షల మందికి అన్ని రకాలుగా అంటే భోజనం, మంచినీళ్లు, పాలు, ఫ్రూట్స్, బియ్యం, నిత్యావసర సరుకులు లాంటి సదుపాయాలు చేసి ఆదుకుంది. కాని గత ఐదేళ్లలో ఏ ప్రజలు కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి ఎన్నడూ బయటకు రాని ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. చొక్కా కూడా నలగకుండా , ప్యాంటుకు రవ్వంత బురద అంటకుండా గాల్లో చెక్కర్లు కొట్టిన ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన రోత పత్రిక లో రాసిన రాతలు, ఎంత నిసిగ్గుగా పచ్చి అబద్దాలు రాయడం ఎంత దారుణం!

నష్టపోయిన కుటుంబాలకు జిల్లా యంత్రాంగం ద్వారా ఖర్చు చేసిన మొత్తం వరద సాయం విలువ రూ. 139.75 కోట్లు. దీనికి సివిల్ సప్లయిస్ వారు ఆదనంగా 63.60 కోట్ల విలువైన బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మొత్తంగా కలిపి రాష్ట్ర ప్రభుత్వం 203. 3 కోట్లు.. (139.7 + 63.6 కోట్లు) వరదసాయంగా ఖర్చు చేశారు. భోజనాలకు 368 కోట్ల ఖర్చు.. అదే విధంగా మంచి నీళ్ల బాటిళ్ల కు రూ.26 కోట్లు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు రూ.23 కోట్లు అంటూ ఇష్టానుసారం తప్పుడు లెక్కలు కూడా రాయడం ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. వారి సొంతంగా వారు ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు.. జగన్ రెడ్డి వచ్చారు… అరగంట సేపు మీడియా ముందు షో చేశాడు వెళ్ళిపోయారు.. కనీసం వాటర్ ప్యాకెట్ అయిన జగన్ రెడ్డి తన చేతుల మీదుగా ఆ రోజు కష్టాల్లో ఉన్న ప్రజలకు అందించాడా అని ప్రశ్నిస్తున్నా.

వైసీపీ నాయకులు ఎవరైనా ఇదిగో మేం ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వానికి సహకారంగా ప్రజలకు మావంతు సాయం మేమేం చేస్తాం అని ఏ వైసీపీ నాయకుడైనా ఇంటింటికి వెళ్లాడా.. గతంలో చంద్రబాబు నాయుడు అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఆ రోజున చార్ థామ్ యాత్రలో చిక్కుకు పోయిన వారిని క్షేమంగా ఇంటికి తీసుకు వచ్చినటువంటి వ్యక్తి.. అంతేకాకుండా రాష్ట్రంలో ఎటువంటి విపత్తు సంభవించినా చంద్రబాబు ముందుండి అంటే .. గోదావరి వరదలొచ్చినప్పుడు జగన్ రెడ్డి ఏమైనా వరదల్లో తిరిగాడా … కానీ, ఆ రోజు స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఆయనతో పాటు బోట్లలో సీనియర్ నాయకులు వెళుతుంటే ఒక పడవ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆయనా సరే వారందరిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చి ప్రజల దగ్గరకు మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా వెళ్లాలని చెప్పి ప్రాణాలకు తెగించి పని చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు.

అన్నమయ్య ప్రాజెక్టు కట్టు తెగిపోయినప్పుడు ఎక్కడున్నాడండీ జగన్ రెడ్డి.. అందరి కంటే ముందుగా వెళ్లింది చంద్రబాబు నాయుడు. సహాయాన్ని అందించింది ఎన్టీఆర్ ట్రస్టు… అలా అన్ని రకాలుగా సాయాన్ని అందించుకుంటూ వస్తే.. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఏం చేశారు.. ఏరకంగా ప్రజలకు సాయాన్ని అందించారు. చేసేది చేయకపోగా చేసిన వాళ్లపై విషపు రాతలా.. అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియజేయడానికి మీడియా ముందుకు వచ్చాం. ప్రజలకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది.. ఎంత సాయం చేసింది.. అనేది పూర్తిగా అంకెలతో సహా మీకు అందిస్తాం..

జగన్ ముఠా మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు.. భోజనాలకు రూ.368 కోట్ల ఖర్చంటా.. అని రోత రాతలు రాశారు. అసలు మొత్తం వరద సాయానికి సంబంధించి సివిల్ సప్లయిస్ ద్వారా అందించిన సరుకులు కాకుండా మిగతా ఖర్చు అంతా కలిపి రూ.139 కోట్ల 75 లక్షలు. కాని వీళ్లు రాసింది రూ. 534 కోట్లు బొక్కేశారంటూ విష ప్రచారం చేస్తున్నారు.. అసలు వాస్తవాలోకి వెళితే ఫుడ్ ప్యాకెట్ల కోసం ఖర్చు పెట్టింది రూ.57 కోట్ల 45 లక్షలు. మొత్తంగా కోటి 14 లక్షల 90 వేల 410 ప్యాకెట్లకు ఖర్చు చేసింది. ఒక్కొక్క ప్యాకెటుకు రూ.50 లు చెల్లించింది ప్రభుత్వం. ఈ తప్పుడు పత్రికలో రాసింది రూ. 368 కోట్లు అని రాశారు. మంచినీళ్ల బాటిళ్ల కోసం 500ఎంఎల్ బాటిల్స్ 80 లక్షల బాటిల్స్ సరఫరా చేశాం.. ఒక్కొక్క బాటిల్ రూ.7 చొప్పున.. మొత్తానికి 5 కోట్ల 60 లక్షలు వ్యయం చేశాం.

లీటర్ వాటర్ బాటిల్స్ కు 43 లక్షల 25 వేల 796 ఖర్చు చేయగా .. ఒక్కొక్క వాటర్ బాటిల్ ఖర్చు రూ. 13లు చొప్పున రూ. 5 కోట్ల 62 లక్షలు ఖర్చు జరిగింది. 500ఎంఎల్ కాని, లీటర్ వాటర్ బాటిల్ కి ఖర్చు పెట్టింది రూ.11 కోట్ల 22 లక్షలు. దానికి వాటర్ బాటిల్ పేరుతో రూ.26 కోట్లు మింగేశారంటూ రాశారు. అలాగే శానిటేషన్ కు రూ.51 కోట్లు దోచేశారని అంటూన్నావ్.. అసలు ఖర్చు చేసింది రూ. 18 కోట్ల 34 లక్షలు.. అదే విధంగా అగ్గిపెట్టెలకు, కొవ్వొత్తులకు నయా పైసా ఖర్చు చేయకపోతే రూ. 23 కోట్లు అవినీతి చేశారని దుష్పప్రచారం చేస్తున్నారు.

దేశ చరిత్రలో డ్రోన్ల సాయంతో వరద సాయం అందించడం చూశామా ఎక్కడైనా..? సీఎం మొట్టమొదటిసారి డ్రోన్లు ఉపయోగించి వరద సాయన్ని అందించారు. చాలా మంది అశ్చర్యానికి గురయ్యారు. డ్రోన్ల ద్వారా 1,23,751 ప్యాకెట్లు (బీస్కెట్లు, వాటర్, మిల్క్) పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇళ్లలో సామన్లు నష్టపోయిన ప్రజలకు అర్బన్ కంపెనీలతో జత కట్టి ఉచిత సర్వీసు అందించారు. నువ్వు గతంలో చేసిన సహయం ఏంటో తెలుసా.. మీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నీటమునిగిన ఇళ్లకు సుమారుగా రూ.2000 నుంచి రూ.4000 వరకు అందజేశావ్.. అదే చంద్రబాబు ప్రభుత్వం నీట మునిగిన ఇళ్లకు రూ.25000లు.. అంటే నువ్వు ఇచ్చిన దాని కంటే ఐదు, ఆరు రేట్లు అదనంగా ఇచ్చాం. నిత్యావసర సరుకులు సంబంధించి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కేజీ కందిపప్పు ఇలా ఆరు రకాల నిత్యావసర సరుకులు సరఫరా చేశాం.

మీలా నాలుగు బంగాళ దుంపలు, నాలుగు టామోటాలు ఇవ్వలేదు. ఎంఎస్ఎంఈలకు రూ.50,000 నుంచి రూ.1,00,000 ఇచ్చాం.. నువ్వు పైసా కూడా ఇవ్వలేదు. చేనేతలకు నువ్వు ఇచ్చింది రూ.10,000, మేం ఇచ్చింది రూ.25000. తోపుడు బండ్లు నువ్వు ఎటువంటి పరిహారం ఇవ్వలేదు.. మేం కొత్త వాటిని ఇచ్చాం. దెబ్బతిన్న ప్రతి ద్విచక్ర వాహనానికి కూడా రూ.3000లు ఇచ్చాం. ఆటోలకు రూ.10,000 ఇచ్చాం.. నువ్వు ఒక పైసా ఇచ్చావా..? ఈ విధంగా చూస్తే నువ్వు చేసిన దానికి చంద్రబాబు 10 రేట్లు ఎక్కువ చేస్తున్నారు. ఇవన్నీ అందుకుంటున్న ప్రజలందరూ కూడా ఇది కదా మంచి ప్రభుత్వం అంటే.. అని అనుకుంటున్నారు. ప్రజలు ఇంటికి పిలిచి మరి ధన్యవాదాలు తెలుపుతున్నారు.

అసలు మీరు దోచుకున్నది చూస్తుంటే ఎగ్ ఫవ్ లకు 3.5 కోట్లు, సచివాలయాలకు, బిల్డింగ్ లకు రంగులు అంటూ రూ.3 వేల కోట్లు, సర్వే రాళ్లపై జగన్ రెడ్డి బొమ్మల వేయడానికి రూ.700 కోట్లు, రుషికొండపై ప్యాలెస్ లో టబ్బులకు, కమోండ్లకు చేసిన ఖర్చు రూ.600 కోట్లు, నీ రోత పత్రికలో అడ్వర్టైజ్ మెంట్లు అని రూ. 500 కోట్లు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు పాస్ పుస్తకాలపై మీ బొమ్మ వేసుకోవడానికి రూ.13 కోట్లు, తాడేపల్లి లో నీ లగ్జరీకోసం రూ.15 కోట్లు, ఎగ్ ఫవ్ లకు రూ.3 కోట్ల 60 లక్షలు, మద్యం షాపులో ఎలుకలు పట్టడానికైన ఖర్చు కోటిన్నర, జగన్ రెడ్డి పర్సనల్ టూర్స్, విలాసాల కోసం అయిన ఖర్చు రూ.4 వేల 878 కోట్లు జగన్ రెడ్డి ఖర్చు పెట్టావ్ ..ఈ రోజు మాపై నిందలు వేస్తావా? మేం నిజాయితీగా పారదర్శకంగా ఇలాంటి కార్య్రకమాలు చేస్తే తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను మభ్య పెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తావా.. ఎప్పుడైనా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్లావా నువ్వు.. నీ చేతితో ఏమైనా పరిహారం అందించావా?

జగన్ రెడ్డి కోటి సాయం ప్రకటించి.. అది భారీగా ప్రకటించానని అదీ ఆయన పార్టీ ముఖ్యనేతలతో చర్చించి ఇస్తానన్నాడు… జగన్ రెడ్డిసాయం ప్రకటించింది సెప్టెంబర్ 4 న.. ప్రకటించిన కోటి రూపాయలలో కనీసం వెయ్యి రూపాయలన్నా ఇచ్చారా.. వేల కోట్లు దిగమింగి ఊరుకోప్యాలెస్ కట్టుకున్న నువ్వు కోటి రూపాయలు వ్యక్తిగతంగా కాకుండా పార్టీ తరుపున ఇస్తానన్నావ్.. మళ్లీ తాడేపల్లిలో చెక్కులు తీసుకున్నావ్ … వచ్చిన డబ్బంతా ఏమి చేస్తున్నావ్… వరద సాయం పేరుతో కూడా వసూళ్లు చేస్తున్నావ్ కదా.. ఇదిగో ఈ జిల్లా నాయకుడు ఇంత డబ్బు ఇచ్చాడు.. ఆదిగో ఆ జిల్లా నాయకుడు అంత డబ్బు ఇచ్చాడు.. అని చెప్తున్నావ్ కదా.. ఏమి చేశావ్ అ డబ్బంతా.. చిన్న పిల్లల కిడ్డీ బ్యాంకు కూడా వదలట్లేదు కదా జగన్ రెడ్డి నువ్వు.. చంద్రబాబు చెంతకు వచ్చిన ప్రతి రూపాయి ప్రతి రోజు పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం కదా.. ఇన్ని కోట్ల రూపాయలు బాధితుల అకౌంట్ లోకి వేస్తున్నాం.. ఇంత ఖర్చు చేశాం.. ప్రతి రోజు పారదర్శకంగా మొత్తం ప్రజల ముందు పెడుతున్నాం.. నువ్వు ఏమి చేస్తున్నావ్ జగన్ రెడ్డి.. తమరు ప్రకటించిన కోటి రూపాయలకే దిక్కు లేదు.. మళ్లీ కలెక్షన్ కింగ్ లాగా కలెక్షన్ మొదలు పెట్టావ్.. దీని బట్టి నువ్వు వరద సాయం పేరుతో ఇంకా మింగుతున్నావ్ అని అర్థమవుతుంది. ఖర్చు చేయాల్సింది కనీసం ఒక్క రూపాయి నీ జేబు నుంచి ఖర్చు చేయకుండా. విజయవాడ వచ్చిన రోజు నీళ్లలో కాలు పెట్టావా..?

అరగంట సేపు మీడియా ముందు హడావుడి చేసి వెళ్లిపోయావ్.. ప్యాంట్ బురద అంటాకుడదు అనే కదా.. మీకు రెడ్ కార్పెట్లు కావాలి కదా.. మీరు కష్టాల్లో ఉన్న ప్రజలను అదుకోడానికి ఏర్పాట్లు ఘనంగా చేయాలి కదా.. మీకు రెడ్ కార్పెట్లు వేయటం మా వల్ల కాదు.. చూశాం గతంలో.. పంట నష్టాన్ని పరిశీలించేందుకు రైతన్న వద్దకు వెళ్లేందుకు పొలం గట్టు వరకు రెడ్ కార్పెటు.. పొలం గటు వద్ద పెద్ద టెంట్.. ఆయనకు ఎండ తగలకూడదు మరి.. సుకుమారుడు.. అందులోనే బ్యారీకేడు.. బురద అంటకుడదు.. రైతన్న ఆ బురదలోనే కష్టాపడి పండించాలి కదా.. రైతన్న చేయి పట్టుకోరు.. భూజం మీద చేయి వేయరు.. అయ్యా మాకు సాయం చేయండి అని రైతన్న దూరం నుంచే అడగలంటా.. ఈయనేమో టెంట్ కింద నిలబడి వెకిలి నవ్వు నవ్వుతాడు అంటా.. కష్టాల్లో ఉన్నవారికి చూసిన కూడా వెకిలి నవ్వు నవ్వటమే కదా పని.. ఏ రోజు అయిన ఆ బాధను అర్థం చేసుకున్నావా…? సీఎంగా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే రెండు వారాల తరువాత బ్యారికేడ్ ఏర్పాటు చేయించుకుని ప్రజల వద్ద వెళ్లే నువ్వా మాట్లాడేది.

అసలు బ్యారీకేడ్ లకు, పరాదలకు ఎన్ని కోట్లు వృథా చేశావో..? ఈ రోజు సీఎంగా ఉన్న చంద్రబాబు రాత్రి పగలూ తేడా లేకుండా బురద నీటిలో ప్రజలకు భరోసా కల్పించారు.. ఆయన కూడా ఇంట్లో కూర్చోని అధికారులతో పనులు చేయించొచ్చుగా.. అలా కాదని నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. నేను వెళ్లాల్సిందే.. అంటే సెక్యూరిటీ సిబ్బంది వద్దంటున్న కూడా రోజుకి 10-12 గంటలు ఆయన జేసీబీ ఎక్కి.. నీళ్లలో తిరిగిన వ్యక్తి సీఎం చంద్రబాబు.. అటువంటి వ్యక్తి మీద నింద ఆరోపరణలా..? ఆయన మీద మీరు తప్పుడు రాతలు రాసేది..? సహాయంలో కూడా చంద్రబాబు వినూత్నంగా ఆలోచన చేశారు.

బ్యారీకేడ్లు, పరాదాలు కట్టుకుని తిరిగితే ప్రజల మనోభావాలు ఏమి అర్థమవుతాయి మీకు.. ప్రతి దానికి కూడా లెక్క రాసుకుంటూ వచ్చి నిత్యావసర సరుకులు కాకుండా 139.75 కోట్లు ఖర్చు పెడితే.. దానికి తప్పుడు రాతలా..? రేషన్ సరుకులు కోసం రూ.63 కోట్లు ఖర్చు చేశాం. అన్ని కలిపిన కూడా రూ.203.3 కోట్లు అయితే.. రూ.536 కోట్లు మింగేశారు.. అంటూ రాతలు రాసుకోవడమా..? మనం కొంత చేసి అడిగితే న్యాయం.. వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేని మీరా అడిగేది..? అసలు అడిగే హక్కు ఎక్కడిది..? దేనికి ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుని, స్పెషల్ ఫ్లైట్లో తిరగడం.. మీరు విలాసాల కోసం పేదవాడు కష్టాల్లో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టాలేరా..? పార్టీ తరపున ఏ రోజున కూడా రూపాయి ఖర్చు చేయని మీరు ఎందుకు ఫోటోలు వేసుకోవడం..? ఎన్టీఆర్ పేరుతో ఆయన బిడ్డలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.

నువ్వు నీ తండ్రి పేరు మీద ఒక్క రూపాయి అయిన ఖర్చు చేసి ఎలాంటి సేవ కార్యక్రమాలు చేసిన దాఖలాలు ఉన్నాయా..? దానికి మనస్సు రాదు.. చేతిలో తప్పుడు మీడియా ఉండి కాబట్టి, ఏది పడితే అది తప్పుడు రాతలు రాసేయడం.. అందుకే వస్తవాలు ప్రజల ముందు ఉంచుతున్నాం. చంద్రబాబు పారదర్శకంగా నిజాయితీతో, నిబద్ధతతో కష్టాల్లో ఉన్న ప్రజలను అదుకోవాలనే ఒక సంకల్పంతో పగలు, రాత్రి కష్టపడి అదుకున్నారు. వరదలు వచ్చిన ప్రాంతాల్లో రికార్డు సమయంలో మంత్రి నారాయణ, ఇతర మంత్రులందరూ కూడా ప్రతి డివిజన్ లో శానిటేషన్ కానీ, డ్రైన్లు శుభ్రం చేయడం కానీ, రోడ్డు శుభ్రం చేయడం కానీ, నీళ్లు తొడివేయడం కానీ అందరూ కలిసికట్టుగా పని చేశారు. బురద నీళ్లల్లో ఇంటిఇంటికి తిరిగాం.

శానిటేషన్ కోసం రూ.51 కోట్లు అని రాసుకున్నారు. కానీ, అయింది మాత్రం 18.34 కోట్లు.. 18 కోట్ల విలువ కనిపిస్తుంది.. రండి, సింగ్ నగర్.. ఛాలెంజ్ చేస్తున్న రండీ వెళ్దాం.. ఈ రోజు అక్కడి పరిస్థితులు పరిశీలిద్దాం.. బయట నుంచి ఎవరైనా వచ్చి పరిశీలిస్తే నిజంగా ఈ ప్రాంతంలో వరద వచ్చిందా.. అనే రీతిలో పని చేశారు. కళ్ల ముందు బాగు కనిపిస్తుంటే.. పిచ్చ వాగుడు.. పిచ్చ రాతలు.. జగన్ రెడ్డి ముఠా చేస్తున్న అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మకండి.. సీఎం చంద్రబాబు మీద నమ్మకంతోనే స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా సీఎం సహాయ నిధికి చిన్నారుల నుంచి పెద్ద వయస్సు వారి వరకు ముందుకు రూ.500-600 కోట్లు విరాళాలు వచ్చాయి.

జగన్ రెడ్డిలా రూ.5000 కోట్లతో జల్సాలకు, విలాసాలకు, తన ప్యాలెస్ లకు ప్రభుత్వం సొమ్మును చంద్రబాబు ఏనాడూ ఖర్చు చేయలేదు.. అ రకంగా వేల కోట్ల రూపాయాలు తన బొమ్మల పిచ్చికి, రంగుల పిచ్చికి, తన విలాసాలకు ఖర్చు చేసిన వ్యక్తి ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందా.. లేదా.. అనేది ఒకసారి అలోచన చేసుకోవాలి.. అర్హత లేదు కాబట్టే 151 నుంచి 11కి తీసుకువచ్చారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనే దానిపై దృష్టి పెట్టండి.. అలాగే వరద బాధితుల కోసం ప్రకటించిన కోటి రూపాయాలను అందజేసేలా చూడాలి.

LEAVE A RESPONSE