Suryaa.co.in

Telangana

ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ నిబంధనల ప్రకారమే ఫామ్ హౌస్

  • ఫిలిం యాక్టర్లతో కేటీఆర్ కు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు
  • కేసీఆర్ ను మించిన పెద్ద తుగ్లక్ కేటీఆర్
  • కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: వారం రోజులుగా కేటీఆర్, అతని మనుషులు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రజల సమస్యలు చూపేందుకు v6 ఛానెల్ ను స్థాపించాము. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా ఆగకుండా, తెలంగాణ కల్చర్ చూపించింది v6 ఛానల్. కాళేశ్వరం, మిషన్ భగీరధ లో జరిగిన అక్రమాలు, లోపాలను v6, వెలుగు పేపర్లు చూపించాయి.
కేసీఆర్, కేటీఆర్ ఈ రెండు సంస్థలను బ్యాన్ చేయాలని చూసినా ప్రజల నుండి ఉన్న ఆదరణతో ఏమి చేయలేకపోయారు. బి ఆర్ ఎస్ హయాంలో v6, వెలుగుకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకండా వివక్ష చూపారు. మీడియా హౌస్ ను అణగదొక్కాలని చాలా ప్రయత్నాలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల టైం లో నాపై ఈడి రైడ్స్ చేయించారు. మేము తప్పు చేయలేదని మా డబ్బులు మాకు ఇచ్చారు. ఎవరిదో చూపించి నా ఫామ్ హౌస్ అని చెప్తున్నారు. కేసీఆర్ ను మించిన పెద్ద తుగ్లక్ కేటీఆర్. మేము కొన్నప్పుడే మా ఫామ్ హౌస్ కు కాంపౌండ్ వాల్ ఉంది. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ నిబంధనల ప్రకారమే మా ఫామ్ హౌస్ ఉంది.

సొంత చెల్లెను గెలిపించుకోలేని కేటిఆర్ లీడర్ ఎలా అయితడు? ఫిలిం యాక్టర్లతో కేటీఆర్ కు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు. V6 ఛానెల్ కు v6 బిజినెస్ సొల్యూషన్స్ కు తేడా తెలియని కేటీఆర్. V6 బిజినెస్ సొల్యూషన్ అనేది బెంగుళూరులో ఉంది. దాని డైరెక్టర్లు, స్థాపకులు ఎవరో తెలుసుకోకుండా ఆరోపణలు చేసిండు. V6 కి ,v6 బిజినెస్ సొల్యూషన్ కి ఎలాంటి సంబంధం లేదు.

వి6 పేరు కనబడగానే అవగాహన లేకుండా అడ్డగోలుగా మాట్లాడిండు. ఆరోపణలు చేసే వాళ్ళు గూగుల్లోకి వెళ్లి చూసి తెలుసుకోండి. కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు. కేటిఆర్ కు నా సవాల్…నా పై చేసిన ఆరోపణలు నిరూపించు. దమ్ము, ధైర్యం ఉంటే ఏం చేస్తారో చేయండి. నా సంస్థలు అన్ని ఎక్కడ తప్పులు లేకుండా నడిపిస్తున్న. 2019 తరువాత టి ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా చాలా కీలకంగా పని చేశాను. వారిని గద్దె దించే వరకు వ్యతిరేకంగా పని చేశాను…ప్రశ్నించాను.

LEAVE A RESPONSE