-తడిసిన, మొలకెత్తిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం
-పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
విజయవాడ: రైతులపై చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని, చంద్రబాబు డ్రామాలను ప్రజలెవరూ నమ్మరని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం గిట్టుబాటు అందించి కొనుగోలు చేస్తుందన్నారు. సీఎం వైయస్ జగన్ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారని, పంటనష్ట అంచనాలు రూపొందుతున్నాయన్నారు. ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతు నుంచి కొనుగోలు చేస్తున్నామన్నారు. వ్యవసాయం దండగ అన్న రైతు ద్రోహి చంద్రబాబు అని, ఓటమి భయంతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.