• ఆళ్లగడ్డ నియోజకవర్గం రామచంద్రపురం కెసి కెనాల్ రైతులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం.
• సాగునీటి అవసరాలకు కర్నూలు-కడప కెనాల్ నుంచి నీరు వినియోగిస్తున్నాం.
• మా గ్రామం కాల్వ చివరిలో ఉండటంతో సరిగా నీరందక పంటలు ఎండిపోతున్నాయి.
• మాకు సమీపాన ఉన్న కుందూ నది నుంచి పరీవాహక గ్రామం కలుగొట్ల గ్రామం వద్ద కెసి కెనాల్ కు అనుసంధానం చేసినట్లయితే 30గ్రామాల రైతులకు సాగునీరు అందుతుంది.
• మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యను పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్ అధికారంలోకి వచ్చాక కొద్దిపాటి నిధులతో పూర్తయ్యే పనులను సైతం పెండింగ్ పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
• కుందూనది చెంతనే ఉన్నా రైతులు సాగునీటికి ఇబ్బందిపడటం దురదృష్టకరం.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే కుందూనది నీటిని కెసి కెనాల్ కు అనుసంధానిస్తూ సాగునీటి సమస్య పరిష్కరిస్తాం.