Suryaa.co.in

Telangana

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో రోడ్డెక్కిన రైతులు

నిజామాబాద్ జిల్లా: ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఇందూరు రైతులు ఆది వారం పోరు బాటపట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబా ద్ జిల్లా ఆర్మూర్‌ లో మహా ధర్నా చేపట్టారు.

రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

రైతు ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ప్రతిపక్షాలు సహా వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో ఆర్మూర్ పట్టణంలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ముందు ధర్నాకు అనుమతి లేదనడంతో రైతులు కోర్టును ఆశ్రయించారు.

దీంతో న్యాయస్థానం శాంతి యుత ధర్నాకు అనుమతిం చడంతో మామిడిపల్లి రోడ్డు వద్ద ఆందోళన చేపట్టారు. షరతులు లేకుండా రుణ మాఫీ అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.

ఎకరానికి 7 వేల 500 రూపాయల చొప్పున ఇస్తామన్న రైతుభరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. పెట్టు బడి డబ్బులు వస్తాయనే ఆశతో రైతులు వేరే దగ్గర అప్పులు కూడా తెచ్చు కోలేదని వాపోయారు.

అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవు తున్నారని రైతులు ఆరోపించారు. రైతులకు మంచిచేస్తే నాయకులను ఇంటికి ఎందుకు పంపిస్తా మని ప్రశ్నించారు. రైతులకు ద్రోహం చేయాలని చూస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE