‘కాగ్’పై తండ్రి బాటలోనే కొడుకు!
– నాడు జలయజ్ఞం పనుల్లో అవినీతి జరిగిందన్న కాగ్
– కాగ్ అకౌంటెంట్ జనరల్‌కు పిచ్చి పట్టిందన్న వైఎస్
– సమాల్పై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చే ప్రయత్నం
– ఇప్పుడు తనయుడు జగన్ కూడా తండ్రి దారిలోనే
– తన ఐదేళ్ల పాలనలోని తప్పులను కడిగేసిన కాగ్
– జవాబు లేక జగన్ వ్యూహాత్మక మౌనం
కాగ్ అంటే జగన్ నుండి వైఎస్ రాజశేఖరరెడ్డి వరకు చాలా చాలా గౌరవం!
నేను చెప్పినట్లే కాగ్ నివేదిక ఇచ్చింది అని జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడాడు.
తన ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై కాగ్ కడిగిన దానికి ఒక్క సారి కూడా జగన్ స్పందించలేదు.
గతంలో కాగ్ అకౌంటెంట్ జనరల్‌గా ఉన్న సమాల్ నివేదికల పట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ‘జలయజ్ఞం’ ప్రాజెక్టులలో అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు మేలు చేశారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లిందని సమాల్ తన నివేదికలో పేర్కొన్నారు.
ఈ నివేదిక అధికార పక్షానికి రాజకీయంగా పెద్ద ఇబ్బందిగా మారింది. దీంతో ప్రభుత్వం కాగ్ గణాంకాలను తప్పుపడుతూ, ఏకంగా ఆయనకు పిచ్చి పట్టింది అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు.
ఈ వివాదం ఎంతటి స్థాయికి చేరిందంటే, కాగ్ నివేదిక శాసనసభలో ప్రవేశపెట్టకముందే మీడియాకు లీక్ అయిందని ఆరోపిస్తూ సమాల్పై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చే వరకు వెళ్లారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారిపై నాటి వైఎస్సార్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడం, అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. వైఎస్సార్ స్వయంగా అసెంబ్లీలో మాట్లాడుతూ, కాగ్ పరిధిని మించి రాజకీయ కోణంలో వ్యవహరిస్తోందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
మాస్క్ ఇవ్వలేదంటే పిచ్చి పట్టింది అని బలవంతంగా దళిత డాక్టర్ సుధాకర్ గారికి చికిత్స చేసి, మానసికంగా హింసించి చనిపోయేలా చేసిన ఘనుడు మన జగన్. ఈయన ప్రవచనాలు చెబితే నమ్మే ప్రజలు ఎవరూ లేరు.