Suryaa.co.in

Telangana

అంబులెన్స్ కు డబ్బులు లేక 65 కిలోమీటర్లు బైక్ పై మృతదేహాన్ని తరలించిన తండ్రి

-గిరిజన బాలిక అనారోగ్యంతో మృతి
-ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో అవస్థలు పడ్డ బాధిత కుటుంబీకులు

ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం కొత్త మేడేపల్లి గ్రామంలో ఆదివాసి కుటుంబానికి చెందిన వేట్టి మల్ల. ఆది దంపతుల కుమార్తె అయిన వెట్టి సుక్కి (3) అనే బాలికను ఫిట్స్ జ్వరంతో అనారోగ్యంతో బాధపడుతుండగా ఏన్కూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టరు బాలిక పరిస్థితి విషమంగాgirl ఉందని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తెల్లవారుజామున వైద్య చికిత్స పొందుతూ మృతి చెందింది వెంటనే ఆసుపత్రి సిబ్బంది బాలిక మృతి చెందిందని తల్లిదండ్రులకు చెప్పి, మృతదేహాన్ని తీసుకువెళ్లాలని చెప్పడంతో బాలికను తరలించేందుకు అంబులెన్స్ పంపించాలని వేడుకున్నాడు.

అంబులెన్స్ పంపించడం కుదరదని మీరే తీసుకువెళ్లాలని చెప్పడంతో, అతని వద్ద డబ్బులు లేక బాలిక తండ్రి స్వగ్రామానికి చేరుకొని బంధువులకు తెలపడంతో గ్రామంలోని బంధువుల వద్ద బైక్ తీసుకొని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి లో మృతి చెందిన బాలికను ఖమ్మం నుంచి కొత్త మేడేపల్లి గ్రామం కు మృతదేహాన్ని తరలించారు.

ఈ సందర్భంగా బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కుమార్తె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన కుటుంబమైన మాకు అంబులెన్స్ ఏర్పాటు చేయకపోవడంతో బైక్ పైనే మృతదేహాన్ని 65 కిలోమీటర్లు తరలించి ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE