-కొంతమంది పోలీసులు ఐపీసీ ఫాలో అవ్వడం లేదు జేపీసీ ఫాలో అవుతున్నారు
-తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లు ధ్వంసం చేస్తున్నారు
-వైసిపి ఇంచార్జ్ పనికిరానివాడు కాబట్టి పెద్దిరెడ్డి వేలు పెడుతున్నాడా?
-చిత్తూరు లో నారా లోకేష్
ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే ఎంత ప్రమాదమో చూస్తున్నాం. ప్రజాస్వామ్యం పై కనీస గౌరవం లేని వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు లో లేదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉంది. జగన్ రెడ్డి అంత పిరికివాడిని ఇప్పటి వరకూ చూడలేదు. టిడిపి కార్యకర్త ట్వీట్ పెడితే జగన్ రెడ్డి భయపడతాడు.
ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది టిడిపి ముఖ్య నాయకుల పై అక్రమ కేసులు పెట్టారు. 5000 మంది కార్యకర్తల పై కేసులు పెట్టి వేధించారు. భయం మా బయోడేటా లేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో కొంతమంది పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైసిపి డ్రెస్ వేసుకున్నారు. టిడిపి నాయకుల ముందు మీసం మెలేయడం, టిడిపి కార్యకర్తల తలలు పగలగొట్టడం, సామాన్య ప్రజలను హింస పెట్టడం కొంత మంది పోలీసులకు ఫ్యాషన్ గా మారింది.
కొంతమంది పోలీసులు ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్) ఫాలో అవ్వడం లేదు జేపీసీ (జగన్ పీనల్ కోడ్) ఫాలో అవుతున్నారు.వచ్చేది టిడిపి ప్రభుత్వమే. చట్టాన్ని ఉల్లంఘించే ప్రతి అధికారి మూల్యం చెల్లించుకోక తప్పదు.
జగన్ రెడ్డి ఒక దుర్మార్గుడు. సొంత తల్లి, చెల్లికి అన్నం పెట్టకుండా బయటకి గెంటేసాడు. ఇప్పుడు పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పై పడ్డాడు.అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు అన్నం పెట్టే 201 క్యాంటీన్లు రద్దు చేసాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లు ధ్వంసం చేస్తున్నారు.మంగళగిరి లో నేను అన్న క్యాంటీన్ పెడితే ధ్వంసం చేసారు. కుప్పం లో అన్న క్యాంటీన్ పై దాడి చేసారు. ప్రశాంతంగా ఉండే కుప్పం లో వైసిపి నాయకులు, పోలీసులు కలిసి హింసా రాజకీయం మొదలుపెట్టారు.
చంద్రబాబు పర్యటనకి భద్రతా ఏర్పాట్లు ఎందుకు చెయ్యలేదు. రెచ్చగొట్టడం కోసం వైసిపి జెండాలు కడితే ఎందుకు వారించలేదు? పోలీసులపై రాళ్లు రువ్విన వైసిపి గూండాలను వదిలి టిడిపికి చెందిన 60 మందిపై కేసులు ఎలా పెడతారు? రెండో రోజు పోలీస్ స్టేషన్ పక్కనే అన్న క్యాంటీన్ పై దాడి జరిగితే పోలీసులు ఎక్కడ ఉన్నారు? సీఎం జగన్ సూచనలతో జిల్లా మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ రెడ్డి ప్రణాళికతో దాడి చేయించారు.
దాడి చేసింది వైసిపి గూండాలు, అమ్ముడుపోయిన పోలీసులు….కేసులు, అరెస్టులు మాత్రం టిడిపి నేతలపైనా? అసలు టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన నేరం ఏంటి? వైసిపి గూండాల దాడి ని అడ్డుకుంటే హత్యాయత్నం కేసులా? ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులా? జైలుకు పోయిన టిడిపి నాయకులు, కార్యకర్తలు నిజమైన వీరులు, హీరోలు. వారికి పార్టీ అండగా ఉంటుంది.
జగన్ లా లక్షల కోట్లు అక్రమాలు చేసి చిప్పకూడు తినలేదు….పార్టీ కోసం జైలుకు వెళ్లారు.
జగన్ రెడ్డి కుప్పం కి చేసింది ఏమి లేదు. కుప్పంకి రౌడీయిజం తెచ్చారు. కుప్పంలో వైసిపి నాయకుల అధ్వర్యంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది.
మూడేళ్లలో కుప్పంలో ఒక్క పని చేశారా…..100 కోట్లతో మొదలు పెట్టిన ఇళ్ల నిర్మాణం ఆపేశారు. హంద్రీనీవా పనులు 10 శాతం ఉంటే వాటినీ పూర్తి చెయ్యలేదు. జగన్ మగతనం అభివృద్దిలో చూపించాలి. పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని వాడు…ఇక్కడికి వచ్చి కుప్పంను అభివృద్ది చేస్తాడా?
కడపలో వరదలు వస్తే తిరిగి ఇళ్లు ఇవ్వలేని జగన్ ఇక్కడ ఏదో పొడుస్తానని చెపుతున్నాడు.
మా ఓపిక పరీక్షించొద్దు. రాబోయేది టిడిపి ప్రభుత్వమే. మేము ఇలానే చేస్తే జగన్ అడుగు బయట పెట్టగలడా? కుప్పంలో పెద్దిరెడ్డి కి ఏం పని? వైసిపి ఇంచార్జ్ పనికిరానివాడు కాబట్టి పెద్దిరెడ్డి వేలు పెడుతున్నాడా? రాజనీతి లో లక్ష్మణ రేఖ ఉంటుంది. వైసిపి వాళ్ళు దానిని ఎప్పుడో దాటేసారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టను. గడప గడప కి వెళ్లలేని వైసిపి నాయకులు కుప్పంలో గొప్పలు చెప్పడం హస్యాస్పదంగా ఉంది.