Suryaa.co.in

Telangana

గురుకుల హాస్టల్ లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్

-హాస్టల్‌ కేర్ టేకర్‌తో కలిసి అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ శైలజ
-రోడ్డెక్కిన బాలికలు
-సోషల్‌మీడియాలో వీడియో వైరల్

అది గురుకుల బాలికల హాస్టల్. కాబట్టి హాస్టల్ ప్రిన్సిపాల్, కేర్‌టేకర్ ఒళ్లంతా కళ్లు చేసుకుని బాలికలను కాపలాకాయాలి. హాస్టల్‌కు ఎక్కడా చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత వారిది. అంటే.. అక్కడి చేనుకు వారిద్దరూ కంచె లాంటివాళ్లన్నమాట. మరి ఆ కంచె.. చేనును మింగేస్తే?..సూర్యాపేట బాలికల హాస్టల్‌లో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. బయటపడిన వీడియో కూడా అదే చెబుతోంది.

సూర్యాపేట – బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో ‌రాత్రిళ్లు గదుల్లో ప్రిన్స్ పాల్ శైలజ- కేర్ టేకర్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడు తున్నారని మద్యం కూడా సేవిస్తున్నారని అడిగితే డిగ్రీ విద్యార్థినులు చూడకుండా తమను కొడుతుందని విద్యార్థినులు నిరసన తెలిపిన వైనం సంచలనం సృష్టించింది. విద్యార్థినుల నిరసనతో సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఇప్పుడు ఈ వీడియో, సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్ధినులతో బీర్లు తాగిస్తున్న పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.

LEAVE A RESPONSE