“ఇది కేవలం నేను ఒక మంత్రికి చెబుతున్న కృతజ్ఞత కాదు.. ఆర్డీటీని నమ్ముకున్న లక్షలాది మంది పేదలు ఒక మంచి మనసున్న మనిషికి అందిస్తున్న ఆశీస్సులు.” — ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను కలిసి ఆర్డీటీ (RDT) నిర్వాహకుడు మాంఛో ఫెర్రర్ పలికిన ఈ మాటలు చాలు, ఈ విజయం ఎవరిదో చెప్పడానికి! ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి స్వయంగా వచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్నారంటే, ఆ సమస్య పరిష్కారంలో లోకేష్ పోషించిన పాత్ర ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు.
పని చేసింది లోకేష్.. కృతజ్ఞతలు అందుకుంది లోకేష్. కానీ థాంక్స్ మాత్రం జగన్ చెబుతున్నారు! దీన్నే కదా “చెట్టు నాటి నీళ్లు పోసింది ఒకరైతే.. పండు కోసుకుని నాదే అన్నవాడు ఇంకొకడు” అనేది? ఢిల్లీకి వెళ్లి పనులు చక్కబెట్టింది కూటమి ప్రభుత్వం. కానీ క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవాలని జగన్ గారు పడుతున్న తాపత్రయం హాస్యాస్పదంగా ఉంది.
సేవా గంధం.. కుట్రల అంతం!
మాంఛో ఫెర్రర్ నవ్వుతూ లోకేష్‌కు ధన్యవాదాలు చెబుతుంటే, అది చూసి ఓర్వలేక జగన్ విమర్శలు చేయడం ఆయన అభద్రతా భావానికి నిదర్శనం. రాజకీయాలు పక్కన పెట్టి, లక్షలాది పేదల జీవితాల్లో వెలుగు నింపిన లోకేష్ ని అభినందించాల్సింది పోయి.. జగన్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయడం శోచనీయం. లోకేష్ సాధించిన ఈ విజయం, కుట్రలపై మానవత్వం సాధించిన విజయం!