Suryaa.co.in

Telangana

వంధ్యత్వ సమస్యలకు ఫర్టీ 9 అత్యాధునిక చికిత్స

– ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్
– మార్చి 10న లాంఛనంగా ప్రారంభించనున్న సినీ నటి ఇంద్రజ

-మహిళా దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ట్రీట్ మెంట్ పై 50 శాతం రాయితీ 
-సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో లోగో విడుదల చేసిన డాక్టర్ సి జ్యోతి

హైదరాబాద్ : మాతృత్వం ఒక వరం. ఏ స్త్రీ కైనా గొప్ప ఆనందం. మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తిపరమైన జీవితం, పెరిగిన ఒత్తిడి, పిల్లలు లేని సమస్య ప్రబలంగా ఉన్నాయి. ఫర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్ పిల్లలు లేని కారణాలను సరైన రోగ నిర్ధారణ ద్వారా ఆధునిక వైద్య విధానాల సహాయంతో వైద్య శాస్త్రంలో తాజా సాంకేతిక ఆవిష్కరణల ద్వారా తగిన చికిత్సను అందించడం ద్వారా ఈ కీలకమైన సమస్యను వేగంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది.

సంతాన లేని సమస్యల కోసం ఫర్టీ 9 అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పద్దతులను ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో అందించేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని
pc2 పురస్కరించుకుని ఫర్టీ 9 సంతాన సాఫల్యత పరిశోధనా కేంద్రం అత్యాధునిక అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ పద్దతులపై మహిళలకు 50 శాతం రాయితీని కల్పిస్తున్నట్లు డాక్టర్ సి. జ్యోతి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఫర్టీ 9 బ్రాంచ్ లలో ఈనెల 10వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు మహిళలు వినియోగించుకోవచ్చని తెలిపారు.

హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ పద్దతుల లోగోను విడుదల చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. సికింద్రాబాద్ లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9 సెంటర్ లో మర్చి 10వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రముఖ సినీ నటి ఇంద్రజ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ సహకారంతో నిర్వహించనున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఐ వీ ఎఫ్ ప్రొసీజర్స్ ను లాంచనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

కొన్ని వేలమందికి ఐ వి ఎఫ్, ఐ సి ఎస్ ఐ, ఐ ఏం ఎస్ ఐ , ఉచిత వైద్య శిబిరాలను పలు ప్రాంతాల్లో ఉచితంగా నిర్వహించినట్లు వివరించారు. ఇతర వివరాల కోసం 9246800055, 95507 21836 ఫోన్ నెంబర్ లలో సంప్రదించవచ్చని తెలిపారు.

LEAVE A RESPONSE