– ఫలించిన మంత్రి సుభాష్ కృషి
– సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ
– బడుగు బలహీన వర్గాలు బాబుకి రుణపడి ఉంటారు
.- కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
అమరావతి / రామచంద్రాపురం: బీసీ-బీ జాబితాలో గీత కులాల సీరియల్ no. 4 ప్రభుత్వం సవరించటం పట్ల రాష్ట్ర కార్మిక సంక్షేమం, వైద్య భీమా, ఫ్యాక్టరీ ల శాఖ మంత్రి వాసం శెట్టి. సుభాష్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియ జేశారు.
బీ.సి-బీ జాబితాలో గీత కులాలు సీరియల్ no. 4 కు సవరణ చేయాలని ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ వినతిపత్రం సమర్పించారు. మంత్రి వినతి మేరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈరోజు సవరణ ద్వారా గీత కులాలకు చెందిన వ్యక్తులు కు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలలో సంబంధించిన కులం పేరు మాత్రమే రాయాలి. కులం పేరుకు ముందు గౌడ్ అనే పదాన్ని ముందుగా రాయకూడదని ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.
దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు పట్ల గీత కులాలు లో ఉన్న వివిధ వర్గాలకు మేలు జరుగుతుందిని మంత్రి సుభాష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సమస్యను తెలియ చేసిన వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఉత్తర్వులు జారీ చేయడం చాలా సంతోషం కలిగించిందని, గీత కులాలు కు చెందిన వివిధ వర్గాలు వారు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారని కృతజ్ఞతలు తెలియ జేశారు.
బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం అవుతుందని, ఇప్పటికైనా ప్రతిపక్షాలు బీసీల పట్ల ఉండే కపట ప్రేమ మానుకొని బుద్ధి తెచ్చుకోవాలని, బీసీల అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రతిపక్షాలకు సూచించారు. బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఈ జీవో ద్వారా నిరూపితమైం దని కార్మిక శాఖ మంత్రి సుభాష్ పేర్కొన్నారు.