Suryaa.co.in

Andhra Pradesh

పౌల్ట్రీ రైతులు కోసం సుంకం రద్దుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ

ఢిల్లీ: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎం పి దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో పౌల్ట్రీ రైతులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5కోట్లు కోళ్ళు 3వేల మంది రైతులు పెంపకం సాగిస్తున్నారు.పరోక్షంగా 10లక్షల మంది కి జీవనాధారం.ఆక్వా రంగం తర్వాత పౌల్ట్రీ రంగం అతి పెద్ద రంగమని దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రి కి వివరించారు.

పౌల్ట్రీ రంగంలో ఉన్న రైతాంగానికి కోళ్ళ మేత నిమిత్తం రెండు లక్షల టన్నుల మొక్క జొన్న విదేశాల నుండి దిగుమతి చేసుకునేందుకు దిగుమతి సుంకం రద్దు చేయాలని పౌల్ట్రీ రైతులు ఈ సందర్భంగా విన్న వించారు.ఈ మేరకు కేంద్ర మంత్రి సీతారామన్ సానుకూలంగా స్పందించడం తో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు పౌల్ట్రీ రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE