– ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్ష, కార్యదర్శులు బొప్పరాజు, పలిశెట్టి
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఉద్యోగులు, పెన్షర్లకు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాకపోవడం వలన ఉద్యోగులు, పెన్షర్లలో తీవ్ర ఆవేదన, అసంతృప్తి నెలకొంది. రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు అందుకోకుండానే కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించడం చాలా బాదాకరంగా ఉందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్ష, కార్యదర్శులు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వారొక ప్రకటన విడుదల చేశారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరును తెస్తుందని భావిస్తున్నామని, ఉద్యోగుల పెన్షర్ల ఆవేదనను, అసంతృప్తిని ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టుకొని ముందుగా ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారపై దృష్టిచారించకపోతే ఉద్యోగుల నుండి వచ్చే ఒత్తిడి మేరకు ఉద్యమాల భాట పట్టక తప్పని పరిస్దితి వస్తుందని హెచ్చరించారు.
ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం గమనించి ఈ నెల 20వ తేదీన సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ఆర్థిక, ఆర్థికేతర ఉద్యోగుల సమస్యలు తదుపరి మూడు మాసాలకు జరుగబోయే రాష్ట్ర ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం లోపు నిర్ణయం తీసుకుని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి లేదా వారిచే నియమించబడిన మంత్రి వర్గ ఉపసంఘం చర్చించాలని నేటి రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మించినట్టు తెలిపారు.