-అభివృద్ధి అంటే రంగులు వేసుకోవడం కాదు జగన్ రెడ్డీ!
-నారా లోకేష్
పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మొన్ననే దేశంలో ఏడా దొరకని సరుకు జగన్ రెడ్డి తయారు చేసే బూమ్ బూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ లోడు మీకు చూపించాను. ఈ రోజు మరో జగన్ బ్రెయిన్ చైల్డ్ స్కీమ్ ఫిష్ ఆంధ్ర చూశాను. మదనపల్లె నియోజకవర్గం చిన్న తిప్పసముద్రంలో జగన్ తెచ్చిన ఫిష్ ఆంధ్ర మార్ట్ కి తాళాలు పడి ఫినిష్ అయిపోయింది. రాయలసీమని మేము ఎలక్ట్రానిక్స్-మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దితే, రాయలసీమకి చేపలు, రొయ్యలు వస్తాయని ఏనాడూ తాను ఊహించలేదని సంభ్రమాశ్చర్యాలకు గురైన జగన్‌రెడ్డి ఫిష్ మార్టులు తెచ్చాడు, చేపల్లేక, అద్దెలు కట్టక అవి ఫినిష్ కూడా అయిపోయాయి. అభివృద్ధి అంటే రంగులు వేసుకోవడం కాదు జగన్ రెడ్డీ!