Suryaa.co.in

Telangana

ప్రజల్ని గాలికొదిలేసి మంత్రి కుటుంబం విహార యాత్రలు

– వరదల్లో బాధితులకు సహాయం అందడంలేదు
– కోదాడలో సాగర్ ఎడమ కాలువకు మరమ్మతు చేయడంలేదు
– పంటకు నీళ్లు అందక రైతులు నష్టపోతున్నారు
– మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్ ,నోముల భగత్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్

హైద‌రాబాద్‌: ఖమ్మం లో వర్షాల కారణంగా కాలువలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న వాటిని వెంటనే రిపేర్ చేయాలి. కోదాడలో సాగర్ ఎడమ కాలువకు మరమ్మతు చేయడంలేదు. నీటిపారుదల శాఖ మంత్రి సొంత నియోజకవర్గం అయినప్పటికీ పనులు జరగడంలేదు.

ప్రభుత్వాన్ని బర్ధరఫ్ చెయ్యాలి అని డిమాండ్ చేస్తున్నాం. పంటకు నీళ్లు అందక రైతులు నష్టపోతున్నారు. ప్రజల్ని గాలికొదిలేసి మంత్రి కుటుంబం విహార యాత్రలు చేస్తున్నారు. వరదల్లో బాధితులకు కనీస సహాయం అందడంలేదు.

ముఖ్యమంత్రి, మంత్రులు పదవులను కిరీటం సోకు గా భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలను పట్టించుకునే వారే కరువయ్యారు. నల్లగొండ జిల్లా లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పాలన తో ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ హామీల ను నమ్మి మోసం పోయాం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో టైంకి రైతు బంధు వచ్చేది. నదుల్లో నీళ్లు లేవు. బోరు బావిలపైనే జనం ఆధార పడాల్సిన అవసరం ఏర్పడింది. భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. తిరిగి ఫ్లోరైడ్ బారిన పడే ప్రమాదం ఉంది. రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలి.

LEAVE A RESPONSE