– ప్రతి స్కూల్లో మిడ్డే మీల్స్, యూనిఫార్మ్స్, టెక్స్ట్‌బుక్స్, డిజిటల్ సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది
– వైద్య రంగంలో బలవర్థన కోసం చర్యలు
– హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో డయాలిసిస్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సదుపాయాలు, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం చర్యలు
– రవాణా శాఖతో కలిసి హైదరాబాద్‌లో కొత్త ఆడిటోరియం నిర్మాణం
– వచ్చే మూడు నెలల కార్యాచరణపై స్పష్టమైన ప్రణాళిక
– జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశం అనంతరం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఇవాళ హైదరాబాద్ డెవలప్ మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. ఇందులో హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అన్ని శాఖలు ప్రజలకు అందిస్తున్న పౌరసేవలపై సమీక్ష నిర్వహించాం. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు, జీహెచ్ఎంసీ కమిషనర్ , మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు, అలాగే అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యంగా విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సరఫరా వంటి అనేక అంశాలపై జరుగుతున్న పనులను సమీక్షించడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ సమావేశం చాలా ఉపయోగకరంగా జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్డే మీల్స్, టెక్స్ట్‌బుక్స్, యూనిఫార్మ్స్, అలాగే స్మార్ట్ క్లాసులు, డిజిటల్ క్లాసులు వంటి సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ప్రతి స్కూల్లో మిడ్డే మీల్స్, యూనిఫార్మ్స్, టెక్స్ట్‌బుక్స్, డిజిటల్ సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.
వైద్య రంగంలో కూడా బలవర్థన కోసం చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో డయాలిసిస్ సెంటర్లు, వ్యాక్సినేషన్ సదుపాయాలు, ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇవన్నీ కూడా సమర్థంగా అమలు అవుతున్నాయా లేదా అన్నదానిపై నిరంతరం మానిటరింగ్ చేస్తాం. వచ్చే మూడు నెలల కార్యాచరణపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాం.
హైదరాబాద్ ఒక స్టేట్ క్యాపిటల్‌గా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. దీనికి అవసరమైన తాగునీటి సమస్యల పరిష్కారం, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సంక్షేమం వంటి అన్ని అంశాలపై దృష్టి సారిస్తున్నాం. అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రతి సమస్యపై చర్చించి, పరిష్కార మార్గాలు కనుగొంటున్నాం. సమ్మర్ సీజన్ నేపథ్యంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం.
జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్, ఎడ్యుకేషన్ శాఖలు కలిసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. పిల్లలకు ఇబ్బందులు లేకుండా స్కూల్స్‌లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఎడ్యుకేషన్ శాఖకు సూచించాం. అదేవిధంగా వర్షాకాలానికి ముందస్తు ఏర్పాట్లపై కూడా దృష్టి పెట్టాం. డ్రైనేజీ సిస్టమ్, పైప్‌లైన్స్, ఓపెన్ నాళాలు, వరద నీటి ప్రవాహ మార్గాలు వంటి వాటిని సమీక్షించి, అవసరమైన మరమ్మతులు చేయాలని ఆదేశించాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని మాన్యువల్స్, వ్యవస్థలను చెక్ చేయాలని సూచించాం.
రవాణా శాఖతో కలిసి హైదరాబాద్‌లో కొత్త ఆడిటోరియం నిర్మాణంపై కూడా చర్చించాం. రేపు ఆ ప్రదేశాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటాం. నగర అభివృద్ధి కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉన్నాం.
హైదరాబాద్ ఒక సైంటిఫిక్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఐటీ హబ్‌గా ఉంది. ఇది మరింతగా పరిశోధనలో అభివృద్ధి చెందాలి కాబట్టి నేషనల్ సైన్స్ సెంటర్‌ను కూడా అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఇక్కడ అనేక రకాల టూరిజం అవకాశాలు ఉన్నందున, టూరిజం అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. అనేక కొత్త ఇన్స్టిట్యూషన్స్ను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి అనేక ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణే నగరాలకు హైస్పీడ్ రైలు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇవి తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్‌గా మారనున్నాయి. హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులు, ఎలివేటెడ్ కారిడార్ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు కేటాయించి, దేశ మౌలిక వసతుల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని అభివృద్ధి చెందడం తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు లభించిన గొప్ప గుర్తింపు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రకారం ప్రపోజల్స్ పంపిస్తే, ఆ పథకాలను కేంద్రం ఆమోదిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం అమలు చేస్తే మంచి ఫలితాలు సాధించగలం. అనవసరమైన విమర్శలు చేయడం కాకుండా, కేంద్ర పథకాలను సమర్థంగా అమలు చేస్తేనే ప్రజలకు నిజమైన లబ్ధి జరుగుతుంది.
వైద్య రంగంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. ఆధునిక మెడికల్ మెషీన్స్, కార్డియాక్ సంబంధిత పరికరాలు, ఐ టెస్టింగ్ మెషీన్స్ వంటి హై లెవల్ ఎక్విప్మెంట్స్ను హైదరాబాద్ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్నాం. కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమవుతున్నాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌కు భారీ నిధులు మంజూరు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తోంది. నగరంలో స్పోర్ట్స్, సివిక్ సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఉస్మానియా హాస్పిటల్ అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.. ఇవన్నీ చేపడుతున్నాం.
కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం ఎన్నో దశాబ్దాలుగా ప్రజలు, భక్తులు ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో ఈ నిర్మాణ పనులు పూర్తవడం చాలా సంతోషకరమైన విషయం. మల్లన్న స్వామి ఆలయానికి సమీపంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ మరికొన్ని రోజుల్లో భక్తులకు సేవలందించడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆ ప్రాంత అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైల్వే స్టేషన్‌ను మల్లన్న స్వామి భక్తులకు అంకితం చేయనున్నారు. దీంతో భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
ఈ రైల్వే స్టేషన్ ప్రారంభం వల్ల హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి మాత్రమే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుండి కూడా కొమురవెల్లికి వచ్చే భక్తులకు సులభమైన, భద్రమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. యాదగిరిగుట్టకు కనెక్టివిటీ పెంచే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ సదుపాయం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసే ప్రతిపాదన ఉంది. దీనిపై ప్రధానమంత్రి తో మాట్లాడి, త్వరలోనే అమలు దిశగా ముందుకు తీసుకెళ్తాం.
మొత్తానికి హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించడానికి ముందుకు సాగుతున్నాం.