Home » ఏయూ వీసీకి.. బాబు సీఎం కాదట!

ఏయూ వీసీకి.. బాబు సీఎం కాదట!

– ఏయూ వర్శిటీ రెడ్డిగారి రూటే సెపరేటు
– ఆయన చాంబరులో కనిపించని సీఎం చంద్రబాబు ఫొటో
-గతంలో జగన్ నిలువెత్తు చిత్రపటం వద్ద ఫొటోలు
– జగన్‌రెడ్డి భక్తసమాజం తీరే వేరప్పా
– అవి వర్శిటీలా? రెడ్ల ఆశ్రమాలా?
– ప్రసాదరెడ్డి రాజీనామాకు రోడ్డెక్కిన విద్యార్ధులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

మనం ఓటు వేయని అభ్యర్ధి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన మనకు ఎమ్మెల్యేనే. మనకు ఇష్టం లేని పార్టీ గెలిచి.. ఆ నేత సీఎంగా ఎన్నికైతే, ఆయన మనకు ఇష్టం లేకపోయినా ముఖ్యమంత్రే. ఇది చదువులేని పామరులకూ తెలిసిన పాయింటే. కానీ పెద్ద పెద్ద చదువులు చదివిన, యూనివర్శిటీ వైస్ చాన్సలర్లు- రిజిస్ట్రార్లకు మాత్రం ఈపాటి జ్ఞానం లేకపోవడమే వింత. తన‘కుల’పతి జగన్‌రెడ్డి సీఎంగా దిగిపోయి..చంద్రబాబు సీఎం అయినా వీసీ రెడ్లు మాత్రం, ఆయనను సీఎంగా అంగీకరించలేకపోవడమే విచిత్రం. ‘యూనివర్శిటీలను రెడ్లదర్బార్’గా మార్చిన జగన్‌రెడ్డి జమానా ఇంకా కొనసాగడమే ఆశ్చర్యం.

ఐదేళ్లు కులపిచ్చతో జగన్‌రెడ్డి సర్కారుతో అంటకాగిన అధికారులకు.. చంద్రబాబునాయుడును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంగీకరించేందుకు మనస్కరించడం లేనట్లుంది. ప్రధానంగా రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు.. తన రెడ్లు- క్రైస్తవులను వైస్ చాన్సలర్-రిజిస్ట్రార్లుగా నింపేసిన జగన్‌రెడ్డి పట్ల సదరు అధికారులు, ఆయన మాజీ అయిన తర్వాత కూడా విధేయత ప్రదర్శిస్తున్నారట. జగన్ ఓడిపోయారన్న పుట్టెడు దుఃఖం నుంచి వర్శిటీ రెడ్డిగార్లు ఇంకా తేరుకోన్నట్లుంది.

నాగార్జున, ఆంధ్రా యూనివర్శిటీ వైఎస్ చాన్సలరు-రిజిస్ట్రార్లు ప్రదర్శించే జగన్‌భక్తిని చూసి, కరుడుకట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా ఈర్ష్యపడతారు. నాగార్జున యూనివర్శిటీ వీసీగారైతే.. గతంలో గుంటూరుకు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ స్వతంత్ర వైఖరి, ప్రశ్నించే విధానాన్ని తప్పుపట్టారట. జగన్‌రెడ్డి విధానాలపై కవితలతో ధ్వజమెత్తే ఆమె ఘాటు రాతలు, వీసీ గారికి నషాళానికెక్కాయి. కులతత్వంపై ఆమె తిరుగుబాటు ఆయన గారికి నచ్చలేదు. దానితో ఆమె ధిక్కారస్వరం, నాటి సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరకూ వెళ్లిందట.

దానితో సదరు వీసీ ఆమెను పిలిచి, ‘‘మీ సర్కారు వ్యతిరేక ధోరణి మంచిదికాదు. మీరోసారి సజ్జలతో మాట్లాడండి. సారు సీరియస్‌గా ఉన్నార’’ని చెప్పారట. దానితో మండిపడిన సదరు మహిళా ప్రొఫెసర్, ‘సజ్జలతో నాకేమీ పనిలేదు. నాతో పని ఉంటే ఆయననే ఫోన్ చేయమనండి’ అని ఘాటుగా చెప్పిందట. ఇక ఆమెను వేధించడం ప్రారంభించడంతో, ‘జగన్‌రెడ్డి సీఎంగా ఉన్నంతవరకూ నాకు ఈ ఉద్యోగం అవసరం లేద’ని వీఆర్‌ఎస్ ఇచ్చేశారు.

నాటి ఎంపి రఘురామకృష్ణంరాజును సీఐడీ పోలీసులు వేధించిన సందర్భంలో, ఆమె రాసిన వ్యాసం పాలకులకు కోపం తెప్పించింది. తర్వాత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాసిన మరో వ్యాసం కన్నెర్రకు గురిచేసింది. అదీ అసలు సంగతి!

అన్నట్లు.. నాగార్జున వర్శిటీ వీసీ గారు బయట ద్వారం వద్ద, జగన్-సజ్జల నిలెవత్తు కటౌట్లు పెట్టించడంతోపాటు.. యూనివ ర్శిటీని మినీసైజు వైసీపీ ఆఫీసుగా మార్చి, స్వామిభక్తి ప్రద ర్శించిన వైనం విమర్శలపాలయింది.దానికితోడు జగన్ జన్మదిన వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించి, జగన్‌రెడ్డి మెప్పు పొందారు.

తాజాగా ఆంధ్రా యూనివర్శిటీలో జగన్ భక్త వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ ఇంకా జగన్‌రెడ్డి భజనబృందంగానే పనిచేస్తున్నారని.. అసలు వారికి చంద్రబాబునాయుడును, ముఖ్యమంత్రిగా గుర్తించడం ఇష్టం లేదన్నది ఆరోపణ. ఒక్క ఆరోపణ మాత్రమే కాదు. నిజం కూడా.

ఎందుకంటే ఎన్నికల ఫలితాలు వచ్చి, చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసి ఇన్నిరోజులవుతున్నా.. బుధవారం వరకూ సీఎం చంద్రబాబు ఫొటో వీసీ చాంబరులో భూతద్దం పెట్టి వెతికినా కనిపించలేదు. అంటే.. దానర్ధం రెడ్డిగారికి, బాబును సీఎంగా చూడటం ఇష్టం లేదన్నమాటే కదా అని విద్యార్ధి సంఘాల ప్రశ్న.

అదే తమ ‘కుల’పతి జగన్‌రెడ్డి సీఎంగా ఉన్నన్ని రోజులు, ఆయన నిలువెత్తు చిత్రపటం వీసీ రెడ్డిగారి చాంబరులో మెరిసిపోయేది. తనతో ఎవరు ఫొటో దిగాలన్నా రెడ్డిగారు, తన కులదైవం జగన్‌రెడ్డి ఉన్న చిత్రపటం దగ్గరే నిలబడి దిగేవారు. ఇదీ వీసీ రెడ్డిగారి ‘జగన్నా’మస్మరణ.

అన్నట్లు మొన్నామధ్య జగన్‌భక్త వీసీ రెడ్డిగారిని, చాంబరు నుంచి బయటకు వెళ్లేంతవరకూ విద్యార్ధులు విశ్రమించలేదు. ఇప్పుడు ఈ తాజా జగన్‌భక్త పారాయణం-బాబు వ్యతిరేక వైఖరి తెలియడంతో మళ్లీ రోడ్డెక్కిన విద్యార్ధులు, ప్రసాదరెడ్డిని రాజీనామా చేయాలని గళమెత్తారు. విశ్వవిద్యాలయాలను ‘రెడ్ల ఆశ్రమాలు’గా మార్చిన జగన్‌రెడ్డి కులోన్మాదానికి జోహార్లు!

Leave a Reply