– చుక్కా రమేష్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
– ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ పై సమగ్ర విచారణ జరిపించాలి
– పత్రికా స్వేచ్ఛను, నిరసన తెలిపే స్వేచ్ఛను హరించే హక్కు మీకెవరిచ్చారు అంటూ ఆగ్రహం
ములుగు/ భూపాలపల్లి: ములుగు జిల్లా చల్వాయి గ్రామానికి చెందిన చుక్కా రమేష్ ఆత్మహత్య చేసుకునేలా తనని మానసికంగా ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కోరారు.
ములుగు నియోజకవర్గంలో ఇటీవల ఇందిరమ్మ ఇళ్ళలో జరిగిన అవకతవకలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన చల్వాయి గ్రామ యువకుడు చుక్కా రమేష్ ను కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీస్ అధికారులు వేధింపులకు గురి చేయడంతోనే చుక్కా రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
చుక్కా రమేష్ ఆత్మహత్యను ప్రభుత్వ హత్య గా భావించి అందుకు కారకులైన వారిని శిక్షించాలంటు ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది అని తెలిపారు.నిరసన తెలిపేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేయడం అక్రమమన్నారు.
ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వేధింపులకు గురి చేస్తే చుక్కా రమేష్ ఆత్మహత్య చేసుకున్నారు అని అన్నారు.
ఇటీవల ఇందిరమ్మ ఇళ్ళ పంపిణిలో అవకతవకలపై శ్రీకాంత్ రెడ్డి అనే మీడియా మిత్రుడు ప్రశ్నిస్తే అతని పై దాడి చేశారని తెలిపారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. చుక్కా రమేష్ మరణానికి వారి కుటుంబ సభ్యులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
పోలీసు అధికారులు కూడా ఏక పక్షముగా వ్యవహరించ వద్దనీ కాంగ్రెస్ ర్యాలీ కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చి, బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమానికి ఎందుకు ఈ అడ్డంకులు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు…ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.